Watch the poem in video here.
ఇదిగో
నా చిన్ని పలకా, నా బంగారు బలపమా!
రేపు తెల్లారేలోగా గనక
మీరీ లెక్కలన్నీ చేసేసేరనుకో
మీ ఇద్దరికీ పాళా ఐస్ క్రీం కొనిపెడతా,
వన్ బై టూ కాదు, చెరొకటీ.
కానీ లెక్కలుగనక తప్పుచేసేరో,
ఇదిగో పలకా, నిన్ను విసిరి ముక్కలు చేస్తాను,
బలపమా, నిన్నూ అంతే, పొడిచి పోగుబెడతా.
నాకు లెక్కలు చెయ్యడం చాతగాకనో
లేక నిద్రముంచుకోస్తోందనో అడగడం లేదు
ఈ ప్లేట్లన్నీ ఇపుడు కడగకపోతే,
ఈ గిన్నెలనిండా నీళ్ళు నింపకపోతే
నన్ను వాళ్ళు పచ్చడి పచ్చడి చేసెస్తారు.
.
మోహన్ కృష్ణన్,
మలయాళం,
ఇండియా
.
Note: పాళా: పాళా ఐస్ క్రీం అంటే పాల ఐస్ క్రీమే గాని, పొడుగ్గా కడ్డీలాగ ఉంటుంది. కోన్ లాగ ఉండే రేకుగొట్టాల్లో వెదురుపుల్లచుట్టూ పాలు గడ్డకట్టెలా ఐస్ లో ముంచి తయారు చేస్తారు. నా చిన్నప్పుడు స్కూళ్ళకి ఎదురుగా ఇది అమ్ముతుండేవారు.
ఈ కవితలో, దీనికి లింకు ఇచ్చిన చిత్రంలో చదవాలని తపనపడే బాల కార్మికుల బాధ చాలా రసవత్తరంగా చిత్రీకరించబడింది.
శ్రీ మోహన్ కృష్ణన్ కాలికట్ యూనివర్శిటీలో Plant Chemistry లో పరిశోధక విద్యార్థిగా ఉన్నారు.
.

Image Courtesy: Mahan Krishnan
స్పందించండి