వర్గం: అనువాదాలు
-
Today… Prasuna Ravindran, Telugu, Indian
Silent is the wee-hour mist, and chime melodiously the temple-bells … Enough! This heart is awake. Be as it may the page of the day blacken for any pollutant … But, before the darkness of the night could thicken deep, It would turn out pleasant like a moon-washed poem. . Prasuna Ravindran…
-
మా నాన్న తాండవనృత్యం… థియొడోర్ రెట్కీ , అమెరికను కవి.
. నీ ఊపిరిలో ఉన్న విస్కీ ఓ చిన్నకుర్రాడికి మత్తుకలిగించగలదు; కాని నేనుమాత్రం ప్రాణం ఉగ్గబట్టుకున్నాను అలా నృత్యం చెయ్యడం అంత సులభం కాదు. మనం ఎంతలా గెంతులేసేమంటే ఆ దెబ్బకి వంటగదిబీరువాలోంచి గిన్నెలు జారిపడ్డాయి. చిట్లించుకున్న మా అమ్మ ముఖం మరి యథాస్థితికి రాలేదు. నా మణికట్టు పట్టుకున్న చేతికి వేలి కణుపులదగ్గర దెబ్బలుతగిలేయి; తాళానికి నీ అడుగు తప్పిన ప్రతిసారీ నా కుడి చెవి గట్టిగా మెలిపడేది. మట్టిపనిచేసి బిరుసెక్కిన…
-
Ghalib! … Saif Ali Gorey Syed, Telugu, Indian
Ghalib! Oceans continue to have high and low tides still Carpenter Bees continue to hover over flowers The sky continues to play chameleon at will Plants still sprouting only after the seed explodes… Ghalib! Darkness still puts on that ebony mantle, and for that The glow-worms lay in wait for the whole day; No matter…
-
బిలియర్డ్స్ ఆట… ఆల్ఫోన్స్ డోడె , ఫ్రెంచి కథా రచయిత
. రెండురోజులబట్టీ పోరాడుతున్నారేమో, సైనికులు పూర్తిగా అలసిపోయి ఉన్నారు. వర్షం పడుతూ, క్రిందనుండి నీళ్ళు ప్రవహిస్తున్నా లెక్కచెయ్యకుండా వాళ్ళు వీపులకి తగిలించిఉన్న సంచీలతోనే నిద్రపోతున్నారు. ఆయుధాలు పక్కనబెట్టి, చెరువులయిపోతున్న రాజమార్గం మీదా, నీరు ఊరుతున్న బురద పొలాలల్లోనూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని అలాగే మూడు గంటలపాటు అలా నిరీక్షించవలసి వచ్చింది. అలసటవల్ల, నిద్రలేమివల్ల, యూనిఫారంలతో నిలువునా తడిసిముద్దయిపోవడం వల్లా శరీరం కొంకర్లుపోయి వెచ్చగా ఉండడానికి ఒకరికొకరు దగ్గరగా ఆనుకుని పడుకున్నారు; కొందరయితే ఒకరి భుజానికున్న సంచికి మరొకరు చేరబడి నిలబడే…
-
A Moist Memory… Nishigandha, Telugu, Indian
Listening to the affairs of changing Seasons thawing ice, leaves its last wet traces … A memory stops me on a chilly night holding me by my little finger … What is night, after all? Just disappearance of your voice! I still light my each day with your last greeting heard decades back; Bowers…
-
ఆగ్రహం… ఛార్లెస్ లాంబ్, ఇంగ్లీషు కవి
. తగిన సమయంలో, తగినచోట ఆగ్రహమైనా అందం సంతరించుకుంటుంది, అయితే, దానికి తగిన కారణం ఉండాలి ఒక నిముషం దాటి అది ఉండకూడదు. అంతకుమించి ఇంకా కొనసాగిందా అది పగ క్రింద మారుతుంది. అది ఒక పాముకీ, ఒక తేనెటీగకీ మధ్య మనం గమనించే వ్యత్యాసం లాంటిది. వెనకచెప్పినదాన్ని మీరెప్పుడైనా రేపెడితే తొందరపడి ఒకసారి గట్టిగా కుడుతుంది, మీకు క్షణకాలం తీవ్రంగా నొప్పెడుతుంది కానీ, రెండోసారి మరి కుట్టదు. గుబురు పొదలమాటునో, వెదురు, ముళ్లపొదలచాటునో…
-
శ్రోతలు… వాల్టర్ డి లా మేర్, ఆంగ్ల కవి
…’ఎవరదీ లోపల?’ అని అడిగేడు బాటసారి వెన్నెల జాల్వారుతున్న తలుపును తడుతూ. ఒత్తుగా పచ్చిక మొలిచిన అడవినేలమీద మౌనంగా గడ్డి కొరుకుతోంది అతని గుర్రం: ఇంటి కప్పుమీదనుండి రివ్వున ఎగురుకుంటూ బాటసారి తలమీదనుండి ఒక పిట్ట దూసుకు పోయింది. అతను తలుపుమీద రెండోసారి గట్టిగా తట్టేడు; ‘ఇంట్లో ఎవరైనా ఉన్నారా?’ అని అడిగేడు మరోసారి. కాని ఎవ్వరూ బాతసారి వైపు కదల్లేదు; లతలతో అల్లుకున్న ద్వారబంధం నుండి ఒక్క తలకాయా అతనివైపు వంగి వాలలేదు, నిశ్చేష్టుడై ఉన్నచోటే…
-
ఈ త్రోవ అలా పోతూనే ఉంటుంది… జె. ఆర్. ఆర్. టోల్కీయెన్,
ఈ గుమ్మం ముందునుండి ప్రారంభమైన ఈ త్రోవ అలా ముందుకి పోతూ పోతూ అప్పుడే చాలా దూరం సాగిపోయింది, ఇక చాతనయితే, వడిగా అడుగులేసుకుంటూ దానివెనక పరిగెత్తాలి… అది మరెన్నో మార్గాలూ లక్ష్యాలూ కలిసే పెద్ద కూడలిని కలిసేదాకా. అక్కడినుండి ఎక్కడికి? ఏమో! నాకు తెలీదు. . జె. ఆర్. ఆర్. టోల్కీయెన్ 3 January 1892 – 2 September 1973 ఆంగ్ల కవీ, రచయితా, భాషాశాస్త్రజ్ఞుడూ. J R R Tolkien కీర్తిప్రతిష్టలు అతని ఫాంటసీ…
-
ఇక్కడ చచ్చి పడున్నాం… ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్, ఆంగ్ల కవి
మేం ఇక్కడ చచ్చి పడున్నాం ఎందుకంటే, మేం బ్రతికి జన్మించిన ఈ గడ్డకి అగౌరవం తీసుకురాదలుచుకో లేదు. . జీవితం… నిజానికి అందులో పోగొట్టుకున్న దేదీ లేదు. కాని యువకులు అలా భావిస్తారు, మరి మేం అందరం యువకులమే. . ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్ 26 March 1859 – 30 April 1936 ఆంగ్ల కవి ఈ కవితలో గొప్ప తాత్త్విక చింతన ఉంది. జీవితం అపురూపమైనదీ, విలువైనదీ అని వృద్ధులు నమ్ముతారు. అసలు చాలా…
-
క్షణికం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
అంతవరకూ కడలికెరటాలమూపున సుడులుతిరుగుతూ తిరుగాడిన నురుగు, అలలుభంగమవగానే నిండు సముద్రంలో నిశ్చలంగా మిగిలినట్లు, నేను మరణించిన కొద్ది సేపటికే నా జీవితం సంగీతంలోనే మిగులుతుంది నా అనంతరం. క్షణికమైన బుద్బుదంలో మెరిసే హరివిల్లులా కొన్ని రేయింబవళ్ళు సంగీతంతో జ్వలిస్తాయి ఒక వెలుగు వెలిగి, తమ శాశ్వతనివాసమైన శూన్యంలోకి నిర్గమించేదాకా… . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి . . A Little While A little…