వర్గం: అనువాదాలు
-
ఎప్పుడూ అన్యోన్యంగా ఉండండి… లారీ ఎస్. చెంగెజ్, అమెరికను
మీరు ఈ రోజులాగే సన్నిహితంగా, ఆనందంగా ఉండగలుగుతూనే ఎవరికి వారు ఎదుగుతూ, కాలంతోపాటు మారగలిగే నిబ్బరం కలిగి ఉంటే భార్యాభర్తలుగా మీరు అనురాగాన్ని ఒకరికొకరు పంచుకుంటూనే ఇతరులతో ఆనందాన్ని పంచుకుందికి సమయం కేటాయించగలిగితే చేతులో చెయ్యివేసుకుని ఇద్దరూ ఒకరిగా దాంపత్య జీవితాన్ని గడుపుతూనే మీరు ఒకరి ఆశలనీ, కలలనూ రెండవవారు సాకారంచేసేలా సహకరించుకోగలిగితే ఇద్దరూ ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్లగలిగే సాహసాన్ని ప్రదర్శించగలిగితే ఈ రోజు మీరు చవిచూస్తున్న సంభ్రమం మీ జీవితకాలం మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది.…
-
మొత్తానికి అచ్చమైన ప్రేమ… డి. హెచ్. లారెన్స్, ఇంగ్లీషు కవి
తనలో తాను నిమగ్నమైపోయిన అందమైన యువకుడు తనలో తాను నిమగ్నమైపోయిన అందమైన పిల్లని చూసి ఎంతో పరవశించాడు. తనలోతాను నిమగ్నమైపోయిన ఆ అందమైన పిల్ల తనలోతాను నిమగ్నమైపోయిన,ఈ అందమైన ఈ యువకుడిని చూసి ఎంతో పరవశించింది. ఆ పరవశంలో ఇలా అనుకున్నాడు: నాకంటే కూడా ఎక్కువగా ఆమె తనలో తాను నిమగ్నమై పోయింది. చూడాలి. ఆమె ఏకాగ్రతని భంగం చేసి ఆమె నా వంక చూసేలా చెయ్యగలనో లేదో. ఆ పరవశంలో ఆమె…
-
కన్యలకి… సమయముండగానే మేలుకొమ్మని… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి
మీరు గులాబిమొగ్గలు ఏరుకుంటే ఏరుకున్నారు కానీ ఈ ముసలినక్క కాలం పరిగెడుతూంటుంది. జాగ్రత్త. ఇవాళ చిరునవ్వులు చిందించే ఈ పువ్వే రేపు ఉదయానికి వాడి రాలిపోతుంది. అద్భుతమైన ఆకాశ దీపం, సూరీడు, వాడు నెత్తిమీదకొస్తున్నకొద్దీ వాడి పరుగు ముగియబోతుంది, అస్తమయానికి దగ్గరౌతాడు. ఏ వయసులో అయితే యవ్వనం, రక్తం వేడిగా ఉంటాయో అదే ఉత్తమమైనది, ఒకసారి ఖర్చుపెట్టేసేక, వెనక వచ్చేవి గడ్డురోజులూ, అంతకంటే గడ్డురోజులూ. అందుకే, సిగ్గుపడొద్దు. కాలం సద్వినియోగం చేసుకొండి అవకాశం వస్తే, తొందరగా ఒకింటివాళ్లవండి;…
-
సంఘర్షణ… గెమాలియల్ బ్రాడ్ ఫోర్డ్, అమెరికను కవి
నా జీవితం ప్రశాంతంగా నీకు కనిపించొచ్చు కాని నా మట్టుకు అది ఎన్నో మార్పులకి లోనైంది అవి అనంతంగా సాగుతూనే ఉన్నై ఎంత మనోరంజకమో అంత చిత్రంగా. మెదడులో నిప్పు రవ్వల్లాఆలోచనలు విశృంఖలంగా పరిగెడుతూనే ఉన్నై ఇలా మెరిసి, మరుక్షణంలో మాయమౌతున్నై మళ్ళీ మరోసారి రగుల్కోడానికే. అందమైన ఊహలు ఒళ్ళు పులకలెత్తిస్తే, నా కళ్ళముందు అయిష్టంగా కొన్ని భయంకరమైన ఆలోచనలు మెదుల్తునై అప్పుడప్పుడు నిద్రలోకూడా వెంటాడుతూ. ఒక స్పష్టమైన అంతులేని సంఘర్షణ రాత్రీ…
-
అచ్చమైన ప్రేమ… జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి
అచ్చమైన ప్రేమ. ఇది సహజమేనా? అది నిజమేనా? సాధ్యమైనదేనా? వాళ్ళ లోకంలో వాళ్ళుండే ఇద్దరు ప్రేమికులవల్ల ఈ ప్రపంచానికి ఏమిటి ఒరుగుతుంది? . ఏ కారణమూ లేకుండా, ఒకే తాటిమీద నిలబెట్టి లక్షలమందిలోంచి యాదృచ్ఛికంగా తీసి ఇది ఇలాగే జరగవలసి ఉందనడం, దేనికి ప్రతిఫలమట? దేనికీ కాదు. కాంతి ఎక్కడినుండో అవరోహిస్తుంది. మరెవ్వరిమీదా కాకుండా ఈ ఇద్దరిమీదే ఎందుకు? ఇది న్యాయాన్ని అపహసించదూ? అపహసిస్తుంది. మనం ఎంతో శ్రమపడినెలకొల్పుకుంటున్న సిద్ధాంతాల్ని భంగపరచి, అందులోని నైతికతని అగాధాల్లోకి గిరవాటెయ్యదూ?…
-
నదీ వర్తకుని భార్య ప్రేమలేఖ… ఎజ్రా పౌండ్, అమెరికను క
నా నుదిటిమీద పడుతున్న ముంగురులని తిన్నగా కత్తిరిస్తున్న రోజుల్లో ఇంటి ముందరగేటు దగ్గర పూలు కోస్తూ ఆడుకుంటున్నాను; నువ్వు వెదురుబొంగు ఊతకర్రలమీద గుర్రంలా గెంతుకుంటూ వచ్చి నేరేడుపళ్ళతో ఆడుకుంటున్న నా చుట్టూ తిరిగేవు. తర్వాత మనం “చోకాన్” గ్రామం వెళ్ళేం … జీవించడానికి ఇద్దరు బాలలం… ఏ సందేహాలూ అయిష్టాలూ లేకుండా. పధ్నాలుగో ఏట నిన్ను నా స్వామిగా చేసుకున్నాను. సిగ్గుముంచెత్తడం వల్ల ఎప్పుడూ నవ్వేదాన్ని కాదు; తల వాల్చుకుని, గోడవైపు అలా చూస్తుండేదాన్ని…
-
“హలో! బాగున్నారా?”… జాన్ ప్రైన్, అమెరికను
మాకు సిటీలో ఒక అపార్ట్ మెంటు ఉంది, నాకూ లొరెటా కీ అక్కడ ఉండడం ఇష్టం. పిల్లలు పెద్దవాళ్ళయిపోయి చాలా కాలం అయింది వాళ్ళబ్రతుకులు వాళ్ళుబ్రతకటం మమ్మల్ని ఒంటరిచేసింది. జాన్, లిండా ఒమాహా లో ఉంటారు, జో ఎక్కడో రోడ్లంబట తిరుగుతుంటాడు. కొరియన్ యుద్ధంలో డేవీ చనిపోయాడు, ఇప్పటికీ నాకు తెలీదు ఎందుకో, అయినా, ఇప్పుడు తెలియడంవల్ల ప్రయోజనంకూడా లేదు. మీకు తెలుసును కదా, పాతబడిన చెట్లు బలంగా ఎదుగుతాయనీ పురాతనమైన నదులు రోజురోజుకీ ఏ మరుభూముల్లోకో…
-
గాలి నెవరు చూసేడు?… క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి
గాలి నెవరు చూసేడు? నువ్వూ లేదు, నేనూ లేదు. కానీ, ఆకులు కదుల్తూ వేలాడుతుంటే గాలి వాటిలోంచి వెళుతోందని అర్థం. . గాలి నెవరు చూసేడు? నువ్వూ లేదు, నేనూ లేదు. కాని చెట్లు తమ తలలు వాల్చేయంటే గాలి వాటిమీంచి పోతోందని లెఖ్ఖ. . క్రిస్టినా రోజెటి (5 December 1830 – 29 December 1894) ఇంగ్లీషు కవయిత్రి. మనకి కపిల మహర్షిచే ప్రచారంలోకి తీసుకురాబడిన సాంఖ్యము అనబడే దర్శనములో, వేటిని ప్రమాణాలుగా తీసుకోవాలి…
-
ఔత్సాహిక కవి… రాబర్ట్ బిలియం సెర్విస్, బ్రిటిషు కవి.
అదిగో ఆ బీరువా పై అరలో సన్నటి పుస్తకాలు దొంతి కనిపిస్తున్నదా? వాటిని ఏ పాఠకుడూ తొంగి చూడడు, వెదకడు ఎందుకంటే…. అవి నేను రాసినవి కాబట్టి. అవి చక్కగా నేవీ బ్లూరంగులో ముచ్చివేసి ఉన్నై కాని ఎవ్వడూ వాటిని పట్టించుకోడు; అవి అందంగా ముద్రించబడ్డాయి అయినా ఎవడూ ఎప్పుడూ చదవడు. నా ఆశల రూపం, ఆ పుస్తకాలు! వాటిమీద ఎంత సమయం, డబ్బూ వెచ్చించేనని! ఇప్పుడు అదంతా వృధాశ్రమ అనిపిస్తుంది, అందులో ఏ ఒక్కటీ అమ్మలేకపోయాను;…
-
Rembrandt… Ismail, Telugu, Indian
How to capture on the canvas the golden hues that hop on the cheeks, on the shoulders, on the jewellery adorning a neck and on the borders of silver-laced saris? First, captivate darkness… one that’s very fat and robust; Then, on its skin make indentures with knife. Be merciless! Through those indents tawny blood juts…