వర్గం: అనువాదాలు
-
పుడమి… జాన్ హాల్ వీలాక్ అమెరికను కవి
ఓ అజ్ఞాత కీటకమా! శ్రావ్యమైన నీ సంగీతమూ, నా కవితా కూడా, సమస్తమైన కవిత్వానికీ ఆలవాలమై మౌన, గంభీరమైన ఈ పుడమికి ఒక్కలాగే చెందుతాయి. మనం రాసేదీ, పాడేదీ అంతా ఆమె సుషుప్తావస్థలో ఉండి అటూ ఇటూ కదులుతున్నప్పుడు మగతలో ఆమె గుండెచేసే సవ్వడులే. మనం ఆనందంతో కేరినా, దుఃఖంతో కీరినా నువ్వూ, నువ్వూ నేనూ ఇద్దరం ఆమె గొంతులమే. ఆమె అగోచరమైన సౌందర్యాన్ని ఈ ధూళి ఎంతో నేర్పుగా ప్రకటిస్తుంది; డాంటే కలలైనా, కీచురాయి…
-
పల్లెటూరి డాక్టరు … ఫ్రాంజ్ కాఫ్కా, జర్మను రచయిత
Watch this story turned into a beautiful Japanese animation picture here నేను చాలా చిక్కులోపడ్డాను. నేను అత్యవసరంగా ఒకచోటికి వెళ్ళాల్సి ఉంది. పదిమైళ్ళదూరంలోనున్న గ్రామంలో ఒక రోగి నాకోసం నిరీక్షిస్తున్నాడు. అతనికి నాకూ మధ్యం ఒక తీవ్రమైన మంచుతుఫాను అడ్డంగా వచ్చింది. ఈ పల్లె రోడ్లమీద వెళ్ళడానికి అనువైన పెద్ద చక్రాల తేలికపాటి బండీ ఒకటి నా దగ్గరుంది. నా పరికరాలన్నీ పెట్టుకున్న బ్యాగ్ చేత్తోపట్టుకుని, ఉన్నికోటు వేసుకుని నేను సిద్ధంగా ఉన్నాను;…
-
ఈ మట్టిలో సారం ఉంది… ఆర్థర్ స్ట్రింగర్, అమెరికను కవి
. ఈ మట్టిలో అపారమైన సారం ఉంది ఈ నేలలో జవమూ జీవమూ ఉన్నాయి. పెల్లగిలిన మట్టిలో ఊరటా, ఆకాంక్షలూ దాగున్నాయి; అందుకే, నా ఆత్మని ఇందులో విత్తనంలా పాదుకొల్పుతాను రేపు అది పాటగానో, పువ్వుగానో తిరిగి నను చేరుకుంటుంది. ఎంతో శాంతగంభీరంగా, స్థిరంగా, అమరికగా ఉండే ఈ పుడమిని తల్లిని తిరిగి చేరుకోడం మంచిదని నేనెరుగుదును. అది ఎంత నెమ్మదిగా తెలిసీ తెలియనట్లు శ్వాసిస్తుంది! సువిశాలమూ, సంపన్నమూ అయినా ఆ వక్షము ఏదో ఒకరోజు మనలనందరినీ…
-
విద్యుద్దీపం… టాం క్లార్క్ అమెరికను కవి
అదిలేకుండా పాపం మన పూర్వీకులు ఎంత ఒంటరి జీవితం గడిపేవారో! చీకటి చిత్తరువుల్లాంటి భయంకరమైన గుహల్లో వెలుగుచొరని చలి ప్రదేశాలమధ్యా నలుగురూ నాలుగుపక్కలా పడుక్కుని గుడ్డివాళ్లలా ఒకరి ముఖాలు ఒకరు నవ్వితే పడే సొట్టలకోసమూ ఆవేశాల ఆనవాళ్లకోసమూ సణుక్కుంటూ, తడుముకుంటుండేవారేమో. ఎంత విసుగెత్తే సంభాషణలు నడిచేవో వాళ్ళ మధ్య! బహుశా పాత కవిత్వం అంత నిరాసక్తంగా ఉండడానికీ ప్రసిద్ధమైన వాటిలోని విషాదఛాయలకీ కారణం సుదీర్ఘమైన దీపాలులేని చీకటి రాత్రులనుండి రావడమేనేమో! దీపాలతో పాటే హాస్యోక్తులూ వచ్చి ఉంటాయి.…
-
నేను చనిపోయిన పిదప… రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి
నేను చనిపోయిన పిదప స్పందనలేని ఈ మట్టిమీద ఆడంబరానికి, లేని దుఃఖాన్ని ప్రదర్శించవద్దు; బ్రతికున్నప్పుడు నేను ప్రేమించిన నా మిత్రులందరూ ఒక కన్నీటిబొట్టు వదిలి, నా భార్యాబిడ్డల్ని ఓదార్చొచ్చు. నేను చనిపోయిన పిదప అపరిచితుల్ని పక్కనుండి పోనీండి. నా దేశ దిమ్మరి జీవితం గూర్చి హర్షించడానికిగాని అవమాంచడానికిగాని ఎందుకూ, ఎలా అన్నప్రశ్నలడగనీయొద్దు. ఆశాశ్వతమైన కీర్తి కుసుమాల్ని నాపై వేయనీయొద్దు. నేను చనిపోయిన పిదప హత్యాసదృశంగా విమర్శించిన నాలుక అంతవరకు నాగూర్చిచెప్పిన అబద్ధాలన్నిటినీ మరిచిపోయి అది…
-
పాతపాట … ఆర్థర్ కెచం, అమెరికను
నేను ప్రౌఢవయసులో ఉన్నప్పుడు… అబ్బో! అదెప్పటి మాట! అదృష్టం ప్రతి పురుషుణ్ణీ వరిస్తుందనీ కాలమొక్కటే శతృవనీ; ప్రేమ ప్రతి వసంతంలో పూచే మల్లెపువ్వు వంటిదనీ ఎవరికి నచ్చిన పూవ్వు వాళ్ళు ఎంచుకోవాలనీ… ఆ వయసులో అలా అనిపించడం సహజం. కానీ యవ్వనమొక పొదుపెరగని దూబరగొండి ఎంత సులువుగా వస్తుందో అంత సులువుగా పోతుంది ఒకప్పుడు గాలిలో తేలుతున్నట్టు పడే అడుగులు ఇప్పుడు బరువుగా పడుతున్నాయి. మల్లెతీగ తెల్లని ముసుగేసుకుంది, కోయిల గొంతెత్తి నిర్మలంగా పాడుతోంది మనిషిజీవితంలోమాత్రం వసంతం …
-
Comity of Notes …Elanaaga, Telugu, Indian
Hot footing over sand dunes with whispers A hum breezes into the heart. Holding by the little finger it transports you Thousands of miles hence with her rhythm. It feasts ears Lading winds with perfumes, And paints the innards of the heart with An exotic amalgam of past lives and ancient glories. Enraptured by the…
-
Apartheid … Bolloju Baba, Telugu, Indian
“Teacher! Can I give the bouquet to the Chief Guest?” “No. You can’t. We have already selected someone else.” And soon she realized the difference between Her and that ‘someone else’ … her tan. Emptying tears and blood into the gorges of history It plays chiaroscuro on the path of life… She wanted to cry…
-
పెంపుడు పిల్లి… నజీర్ కదొక్కడ్, మలయాళం, ఇండియన్
కుర్చీలో చేరబడి నేను ఏదో చదువుకుంటుంటే నే నక్కడ ఉన్నానన్న ధ్యాస పిసరంతకూడా లేకుండా మా పెంపుడు పిల్లి కుర్చీ కాలుమీద ఏదో గియ్యడం ప్రారంభించింది. నేనో తన్ను తన్న గానే అక్కడనించి వెళ్ళిపోయింది సగదూరం వెళ్లి నావంక తీక్ష్ణంగా ఓ చూపు చూసింది అందులో ఓ బెదిరింపు: “పంది వెధవా! మరీ అంత తెలివొద్దు” అన్నట్టు చక్కని దస్తూరీతో రాసింది ఆ కుర్చీ కర్ర కాలు మీద “ఓరే మూర్ఖుడా! నీ దిక్కున్నచోటచెప్పుకో!” …
-
ఏకాంత మైదానాల మీదా,రెల్లుపొదల సరస్సులమీదా… విలియం షెన్ స్టోన్, ఇంగ్లీషు కవి
ఎక్కడా ఒక చెట్టుగాని, గోపురముగాని, కుటీరంగాని కనరాని ఏకాంత మైదానాల మీదా, రెల్లుపొదల సరస్సులమీదా… ఎండిన పచ్చికబయళ్ళమీదా కలయ తిరిగాను నా ప్రేయసిని కలుసుకుందికి… ఒకవేళ నా దారిపొడుగునా చక్కని అపురూపమైన అందాలు పరుచుకున్నా నా ఆలోచనలు నా చూపుకంటే ముందుగానే పరుగుతీస్తాయి… ఆమెపై లగ్నమౌతూ. దేవదారువృక్షకిరీటాలుగల పర్వతాగ్రాలుగాని సొగసైన సువిశాల రాజప్రాసాదాలు గాని చివికి మట్టిపాలౌతున్న చక్రవర్తులు నిద్రించే పిరమిడ్ ల కొనలుగాని నన్ను సంతోషపెట్టవు. తూర్పుదేశాల మహరాజుల ఉత్సవప్రభలు నా ముందునుండే నడచిపోవునుగాక, నా…