వర్గం: అనువాదాలు
-
వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా కవిత రాయమన్నప్పుడు… హీడెన్ కరూత్ , అమెరికను కవి
నిజానికి నాదగ్గర ఒకటేమిటి ఒకటికంటే ఎక్కువే ఉన్నాయి కవితలు వాటితో పాటే ఇదికూడా మీకు చెబుతాను ఆ పీడకల ఉందే, అదే, అల్జీరియా యుద్ధానికి వ్యతిరేకంగా ఒకటి రాసేను , మరొకటి కొరియా యుద్ధానికి వ్యతిరేకంగా మరొకటి నేను పాల్గొన్నదానికి వ్యతిరేకంగా నాకు గుర్తులేదు ఈ మూడూ కాకుండా ఇంకెన్నిన్నున్నాయో నేను కుర్రాడిగా ఉన్నప్పుడు అబిసీనియా, స్పెయిన్ హార్లాన్ కౌంటీలు… అందులో ఒక్కరంటే ఒక్కరు బతికిబట్టకట్టలేదు… గొంతుకలు బద్దలై ఆడ, మగ, పిల్లలు అన్నతేడా లేకుండా ఒక్కరు…
-
నేను రాస్తాను… మార్గరెట్ వాకర్. అమెరికను కవయిత్రి
నేను రాస్తాను నేను నా ప్రజల పాటలు రాస్తాను వాళ్లు రాత్రి చీకటిలో గీతాలు పాడడం వినాలి. ఏడ్చి బొంగురుపోయిన వాళ్లగొంతులలో కడపటి స్వరాన్ని నేను పట్టుకోగలగాలి. నేను వాళ్ళ కలల్ని మాతలలోకి మళ్ళిస్తాను వాళ్ళ ఆత్మల్ని స్వరాలుగా మలుచుకుంటూ… సూర్యుడి వెలుగువంటి వాళ్లనవ్వుల్ని ఒక పాత్రలో పట్టి చీకటి ఆకాశంలోకి వాళ్ళ నల్లని చేతులు విసిరేసి వాటిని నక్షత్రాలతో నింపుతాను ఆ వెలుగులని అన్నిటినీ కలిపి ఎంతగా నుజ్జు చేస్తానంటే ఉషోదయవేళ దీధుతులు విరజిమ్మే సరసులా…
-
చిన్నతనం… ఫ్రాన్సిస్ కార్న్ ఫొర్డ్, ఇంగ్లీషు కవయిత్రి
ఓ రోజు మేడమెట్లనానుకున్న కటకటాల్లోంచి మా పెద్దమ్మమ్మ’ఎట్టీ’ స్నేహితురాలు వెళ్ళిపోతున్నప్పుడు ఆమె మెడలోని పగడాల దండతెగిపోడం చూసేదాకా… నేననుకుంటూండేదాన్ని పెద్దవాళ్ళు బిగువైన మెడలూ, ముక్కు చుట్టూ ముడుతలూ చేతులమీద బాగా బలిసిన పాముల్లా నరాలూ గొప్పగా కనిపించడానికి ఎంచుకుంటారేమోనని. అవిదొర్లిపోతుంటే ఆమె వెదకడానికి తెగ అవస్థ పడింది. అప్పుడు నాకు అర్థమయింది, ఆమె ముసలితనమూ నా చిన్నతనమూ మా అధీనంలో లేనివని. . ఫ్రాన్సిస్ కార్న్ ఫొర్డ్ (30 March 1886 – 19 August 1960)…
-
శుక్రవారం … ఫరూవే ఫరుక్జాద్, పెర్షియన్ కవయిత్రి
ప్రశాంతమైన శుక్రవారం బావురుమంటున్న శుక్రవారం పాత ఇరుకుసందుల్లా భయపెట్టే శుక్రవారం బద్ధకంగా అనారోగ్యపు ఆలోచనల శుక్రవారం వంకరటింకరగా విస్తరించిన దుర్గంధపు శుక్రవారం ఎదురుచూడడానికి ఏదీలేని శుక్రవారం అణిగి ఉండవలసిన శుక్రవారం… శూన్యమైన ఇల్లు ఒంటరిగా దివుదివుమంటూన్న ఇల్లు యువత తిరుగుబాటుకివ్యతిరేకంగా మూసిన ఇల్లు వెలుగుకోసం కలలుగనే చిమ్మచీకటి ఇల్లు ఒంటరితనం, శకునాలూ, అస్థిరతా కూడిన ఇల్లు కర్టెన్లూ, పుస్తకాలూ, బీరువాలూ, చిత్రపటాలూ ఉన్న ఇల్లు ఆహ్! నా జీవితం నిశ్శబ్దంగా, నిర్మలంగా ఎలా సాగిపోయిందో గంభీరంగా ప్రవహిస్తున్న…
-
ఖగోళంతో కసరత్తు … పీట్ హెయిన్, డేనిష్ కవి
నక్షత్రాలు పొదిగిన రాత్రి ఆరుబయట తలక్రిందులుగా నిలబడి కాళ్ళు పైకి ఆకాశంలోకి వేలాడేలా విడిచిపెట్టండి. తారానివహంతోకూడిన ఆకాశమే కాసేపు మీరు నడవడానికి ఎంచుకున్న ఆధారం అనుకొండి. శీతశైలాలూ, మహానగాగ్రాలూ, మరుగుతున్న అంతశ్శిలాద్రవమూ నీరూ, ఇనుమూ, ఖనిజాలతో కూడిన అపారమైన ఈ భూగోళపు బరువు మీ తలపై మోస్తున్నట్టు ఊహించి… కాసేపు చిత్రంగా దృఢమైన ఈ గ్రహం బరువు అంతే చిత్రంగా స్థిరమైన మీ తలపై నిలకడగా నిలబెట్టండి . పీట్ హెయిన్ 16 December 1905 –…
-
పున్నమి రేయి… జాన్ ఫ్లెచర్ ఇంగ్లీషు కవి
ఈ రేయి ఎంత అందంగా ఉంది! ప్రశాంతవాతావరణంలో మంచువంటి చల్లదనం; మబ్బుగాని, మసకగాని, ధూళిగాని, నలకగాని ఈ నిర్మలమైన ప్రకృతి ప్రశాంతతని భగ్నం చెయ్యడం లేదు. నీలి నీలి రోదసి కుహరాల్లోంచి అదిగో దూరంగా దివ్యమైన పూర్ణచంద్రబింబం దొర్లిపోతోంది. నిలకడగా కురిసే ఆ వెన్నెలల వెలుగులలో దిగువన ఒక ఎడారి వృత్తం పరుచుకుని ఉంది సముద్రంలా ఆకాశపువడ్డాణాన్ని తొడుక్కుని, ఆహ్! ఈ రేయి ఎంత అందంగా ఉంది! . జాన్ ఫ్లెచర్ 1579–1625 ఇంగ్లీషు కవి, నాటక…
-
ఎడబాటు… థామస్ స్టాన్లీ, ఇంగ్లీషు కవి
నా ప్రియమైన స్వామీ! దూరంగా వెళ్తున్నా నీ కౌగిటినుండి విడదీయబడి నన్ను సమ్మోహపరచిన వాటికంటె న్యూనమైన ఆకర్షణలవైపు. ఇక ముందెప్పుడైనా దుఃఖమే నన్ను పొట్టనబెట్టుకుందని నీకు తెలిస్తే, రా! నా సమాధిమీద ఒకటో, రెండో కన్నీటి చుక్కలు రాల్చు. నీ నిట్టూర్పులతో నా ప్రశాంతమైన నిద్రని భగ్నం చెయ్యి. నీ రోదన విని, మృతిలో కూడా నేను హర్షిస్తాను ఏమో! నీ కన్నీళ్ళకి నా చితాభస్మాన్ని కొత్త జీవంతో నింపగల సత్తా ఉండొచ్చు, లేదా నన్నొక పువ్వుగా…
-
రాతి మీది నాచు… జోస్ మెండోంకా, పోర్చుగీసు కవి
సాహసయాత్రికులూ, దేశదిమ్మరులూ, ఎన్నడో అదృశ్యమైపోయారనుకుంటున్న యాత్రీకులూ, బెర్బరులూ, ఆలమందలుతోలుకునే సంచార జాతులూ, దేశబహిష్కృతులూ… క్షణక్షణమూ ఎదురయ్యే ఊహించలేని అవసరాలు కాక పవిత్రగ్రంధాలే ధర్మశాస్త్రాలుగా భావించే మనలాటివాళ్ళకి ఏమి చెప్పగలరు? మన చైతన్య పరిధికి అతీతంగా, వాళ్ళు వసించే చోటులలో ఒక ప్రేతాత్మల భాష ఉంది అది ఏ భాషా చెప్పలేని విషయాలు చెబుతుంది: నక్షత్రాలు ఒకదాన్నొకటి ఢీకొన్నపుడు వెలుగుతునకలు పుడతాయనీ; తరుము కొస్తున్నపుడు జింక పిల్ల ఎన్నో అక్షరాల సోయగాలతో పరుగెడుతుందనీ; అఖండ హిమపాతము తర్వాత, మొనదేలిన…
-
స్మారక-తిప్ప గుర్తుంచుకో… యెహుదా అమిఖాయ్. ఇజ్రేలీ కవి
నాకు బదులు ఈ స్మారక తిప్పని గుర్తుంచుకో, అది ఉన్నది అందుకే. నా సహచరులని గుర్తుంచుకో, వాళ్ల పేరు పెట్టిన వీధిని గుర్తుంచుకో, బాగా పేరుపడ్డ భవనాన్ని గుర్తుంచుకో. దేవుని పేర వెలిసిన ఆరాధన మందిరాన్ని గుర్తుంచుకో, తోరాటోరాలోని వ్యాఖ్యానాలను గుర్తుంచుకో, స్మృతిగీతాలని గుర్తుంచుకో, చరిత్రని తమలో ఇముడ్చుకున్నరంగురంగుల జండాలను, వాటిలో చుట్టబడిన అమరవీరుల దేహాలనూ గుర్తుంచుకో అవి ఏనాడో మట్టిలో కలిసినై; ఆ మట్టిని గుర్తుంచుకో. వాకిటముందు కళ్ళాపినీ, పునర్జన్మనీ గుర్తుంచుకో. భూమిమీద పశుగణాలూ, ఆకాశంలోని విహంగాలూ గుర్తుంచుకో.…
-
కలలు…. లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి
కలల్ని సజీవంగా ఉంచుకో! ఎందుకంటే, కలలు గనక మరణిస్తే జీవితం రెక్కలు తెగిన పక్షిలా ఇక పైకి ఎగరలేదు. కలల్ని గట్టిగా పొదువుకో! ఎందుకంటే, కలలు గనక జారిపోతే జీవితం మంచుకప్పిన మైదానంలా ఊసరక్షేత్రమైపోతుంది. . లాంగ్స్టన్ హ్యూజ్ February 1, 1902 – May 22, 1967 అమెరికను కవి. . Langston Hughes . Dreams . Hold fast to dreams For if dreams die Life is a broken-winged…