వర్గం: అనువాదాలు
-
నిలకడలేని ఆకారము … ఏ. ఎస్. క్లైన్, ఇంగ్లీషు కవి
ప్రకృతికి ఈ వంక రాళ్ళూ రప్పలు ఆ వంక జీవం, ఒక వంక పదార్థం మరోవంక దాన్ని కల్పనాచాతుర్యం, ఒక చివర వైభవం, పాలపుంతల వెలుగు, పువ్వులూ, వాటి రేకలనుండి ఎగిసే పుప్పొడి మరో చివర… మనసు. ఒక చివర శబ్దం, దానికి అటుచివర నిశ్శబ్దం, గులకరాళ్ళమధ్యనుంది వడగడుతున్న ఇసుక. ఒక అంచున చీకటి, సంక్లిష్టత, సత్యంకోసమై వెదుకులాట, రెండో అంచున సత్యమూ, దాని సొగసు, పరిహసించేంత సరళత, అపహసించేంత క్లిష్టత. ఈ కొసని, నిశ్చలమైన గమ్యంలేని…
-
స్వీయ మృత్యుల్లేఖనం… జాన్ గే, ఇంగ్లీషు కవి
జీవితం ఒక పరిహాసం, అన్ని వస్తువులూ అదే ఋజువుచేస్తాయి. ఒకప్పుడు నేనూ అలాగే అనుకునే వాడిని; ఇప్పుడు నాకు తెలుసు. . జాన్ గే (30 June 1685 – 4 December 1732) ఇంగ్లీషు కవీ, నాటక కర్తా. ఈ కవితలో సౌందర్యం “Jest” అన్న మాటని సునిశితంగా వినియోగించిన తీరు. మొదటి పాదంలో జీవితం పరిహాసం అన్నప్పుడు ప్రకృతిలోని వస్తువులని పరికిస్తూ ఆశగా … కావాలని కోరుకునే ఆనందం (Wishfulness) అన్న అర్థం సూచిస్తే, …
-
సంగీతం … స్టీఫెన్ విన్సెంట్ బెనెట్ అమెరికను కవి.
మా మిత్రుడు పియానోదగ్గరకి వెళ్ళి, స్టూలు కొంచెం ఎత్తుగా చేసుకుని, నోట్లో పైపుని పక్కనబెట్టి, అల్మారాలోంచి ఒక లావుపాటి పుస్తకం ఎంచుకున్నాడు; దాన్ని ఠప్ అని అసహనంగా తెరిచాడు. అతని వేళ్ళు అలవోకగా మెట్లమీద పరుగులుతీసాయి కత్తులు దూసుకుంటున్నట్లు… ఆటవికదళాల మొరటు డప్పుదరువులకనుగుణంగా ఆయుధాలను ఝళిపిస్తూ, పిడుగులు వర్షించినట్టు పెడబొబ్బలు పెడుతూ, అకస్మాత్తుగా ‘గాలి కోట’మీద సేనల దాడి ప్రారంభమైంది… మెరుపులు కదంతొక్కుతున్నాయో అన్నట్టు కవాతుచేస్తూ భీతిగొలిపే పతాకాలతో, హతమార్చి తగలెయ్యడానికి దివిటీలతో తుఫానుమేఘాల్లా జరజరా పాకుతూ….…
-
అపార్ట్ మెంటు ఇళ్ళ వెనక వసారాలు… మేక్స్ వెల్ బోడెన్ హీం, అమెరికను కవి
నీ కళ్ళు లవండరులా తెల్లగా కళకళలాడే రోజుల్లో ఎప్పుడో నువ్వు కోసిన రేగి కాయని నోటితో కొరుకుతూ రేగి చెట్లగూర్చి ఎండలో పాటలుపాడుకునే ఓ పనిపిల్లా! సూర్యుడూ చంద్రుడూ, నక్షత్రాలూ ఎరుగని ఆకాశమూ ముఖం మీద ఆర్ద్రతాచిహ్నాలింకా చెరగని శవం లాంటి ఆకాశమూ నీ కళ్ళనుపోలిన రంగులోనే ఉంటాయిలే. నువ్వున్న ఇంటి మీది వసారాలో ఉన్న ఇద్దరు స్త్రీల ముఖాలు ఎన్నడూ వర్షం ఎరగని నేలలా ఎర్రబడి ఉన్నాయి; వాళ్ళకళ్ళు నీరంతా పోయి ఏమూలో కాస్త తడిమిగిలిన…
-
బోనాపార్టే రోడ్డు … జోసెఫ్ వారెన్ బీచ్, అమెరికను కవి.
సాదా రొట్టెలూ, నీ కాఫీ మాత్రమే అడిగి తీసుకుని నువ్వు బల్ల దాటి వస్తున్నపుడు, అక్కడ అన్నీ జాగ్రత్తగా గమనిస్తున్న యజమానురాలిని పలకరించిన తర్వాత మైధునంలో ఉన్న పక్షులని దాటేటంత నెమ్మదిగా లోనకి ప్రవేశించి, వార్తాపత్రిక అంచుమీదుగా వివేకంతో చూడమని అడ్గుతునాను. ఆదిగో ఆ మూల అస్పష్టంగా, ఏ మాటూ లేని ఆ మేజాబల్ల వెనక స్త్రీ పురుషులిద్దరు అనుకున్నట్టుగా కలుసుకుని మౌన సంభాషణ కొనసాగ్ఫిస్తున్నారు. బయట కాలిబాటమీద చక్కని వెలుగు వెల్లువెత్తుతోంది; దూరంగా గుట్టమీద పనిపిల్ల…
-
ఆత్మ-వర్షపు చినుకూ… సిడ్నీ లేనియర్, అమెరికను కవి
తేలికపాటి చినుకులు పడి సముద్రమ్మీద ముడుతలు పడుతాయి తర్వాత వెంటనే మాయమైపోతాయి అస్సలు జాడలేకుండా. మనకి అక్కడ వర్షం పడిందని కూడా తెలీదు ప్రతిచినుకూ గుండ్రంగా చేసిన ముడతలు చూసి ఉండకపోతే. అలాగే, కొన్ని ఆత్మలు మనజీవితంల్లో ముడుతలు సృష్టించి ఈ తనూవారాశి అలజడుల్లో సమసిపోతాయి. జీవితవదనంమీద ఈ ముడుతలు లేకపోయి ఉంటే ఆత్మకి అక్కడ చోటుందని కూడా ఎవరికీ ఎరుక ఉండదు. . సిడ్నీ లేనియర్ February 3, 1842 – September 7, 1881)…
-
There Comes A Day… Saif Ali Gore Syed, Indian
1 There comes a day So full of grief, that its gloom overwhelms The joy of razing Babri Masjid to the ground. 2 That day is not far off Dawns sooner than the Doomsday prophesied in Quran and Bible That day is too close and comes doubling up. 3 That day … there will be…
-
భల్లూకపు కౌగిలి … మైకేల్ ఓండాట్షీ, కెనేడియన్ కవి
తనదగ్గరకి వచ్చి గుడ్ నైట్ చెప్పి ముద్దివ్వమంటాడు గ్రిఫిన్. అలాగేలే అని నేను అరుస్తాను. చేస్తున్నపని పూర్తిచేసి, తర్వాత మరొకటి, మరొకటి పూర్తిచేసి మెల్లిగా నడుచుకుంటూ మా కుర్రాడి గదివేపు తిరుగుతాను. వాడు నవ్వుతూ రెండుచేతులూ చాచుకుని నేనివ్వబోయే భల్లూకపు కౌగిలివంటి గాఢాలింగనానికి ఎదురుచూస్తుంటాడు. అయినా, నా ఆనురాగానికి ఆ అమానవీయమైన పేరేమిటి? గట్టిగా హత్తుకుంటే మృత్యువు చూపిస్తుందది. నేను హత్తుకుంటే, వాడి లేత ఎముకలూ వెచ్చని మెడా నన్ను అతుక్కుంటాయి. ఆ పైజమాలోని సన్నని బిగువైన శరీరం…
-
పాఠకుని ఎంపిక … టెడ్ కూసర్, అమెరికను కవి
ముందు ఆమె అందంగా ఉండాలి ఒక ఏకాంతపు మధ్యాహ్న వేళ నా కవిత్వ పుస్తకం దగ్గరకి నడవాలి, తలస్నానంచేసి వచ్చిన ఆమె మెడదగ్గర జడ ఇంకా తడిగా ఉండాలి. ఆమె రెయిన్ కోటు తొడుక్కోవాలి అది కూడా బాగా పాతది, డబ్బుల్లేక ఎన్నాళ్ళబట్టో ఉతకక మురికిగా ఉండాలి. ఆమె కళ్ళజోడు తీసి, పుస్తకాల షాపులో నా కవిత్వ పుస్తకం పేజీలు తిరగేసి, తిరిగి దాన్ని పుస్తకాల షెల్ఫ్ లో ఉంచెస్తుంది. ఆమె తనలో ఇలా అనుకుంటుంది, ”…
-
ముదిమి – వయసు… ఫ్రాన్సిస్ విలియం బూర్డిలాన్, ఇంగ్లీషు కవి.
చాలాకాలం క్రిందట, ఒక వేసవి ఉదయాన ఆడుకుంటున్న పాప పక్కనించి వెళ్ళాను; అలా పక్కకి రాగానే, చిన్నతనపు ఉత్సాహంతో “దా! మనిద్దరం ఆడుకుందాం!” అని పిలిచింది. కానీ నా చూపులు దూరానున్న శిఖరం మీద ఉన్నాయి చీకటిపడేలోగా అదెక్కగలిగితే సంతోషమే. అందుకని కొంత అసహనంతో అన్నాను: ” లేదు! నేను నీతో ఆడడానికి మరీ ముసలివాడిని” అని. చాలా ఏళ్ళు గడిచిపోయేక, శీతకాలంలో నా కాళ్ళలో కొండలెక్కగల సత్తా సన్నగిలేక చక్కని పచ్చికబయల్లో ఒక…