వర్గం: అనువాదాలు
-
సమస్య… పీట్ హెయిన్, డేనిష్ కవి
మనకు బాగా నచ్చిన ప్రణాళికలు ఎందుకూ కొరగాకుండా పోతాయి మనం నిర్మించుకున్న అత్యున్నత ఆశాసౌధాలు కుప్పకూలిపోతాయి ఎందుకంటే ముందు ఎంతో చక్కగా గీసిన గీతల్ని తర్వాత అంత చక్కగానూ పొరపాటని సరిదిద్దుతాము . పీట్ హెయిన్, (కలం పేరు కుంబెల్ (సమాధిరాయి)) 16 డిశంబరు 1905- 17 ఏప్రిల్ 1996 డేనిష్ కవి, రచయిత, శాస్త్రజ్ఞుడు, గణితవేత్త, . . On Problems ( A Grook*) . Our choicest plans have fallen through…
-
నిమిత్త సుఖం … కెన్నెత్ బర్క్, అమెరికను
నేలంతా పచ్చగా ఉంది వార్తలు కట్టేసేనేమో ఈ క్షణంలో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఒక చేతిలో పుస్తకం మరో చేతిలో పానీయం ఇంతకంటే ఏం కావాలి కీర్తీ మెరుగైన ఆరోగ్యమూ ఓ పది మిలియను డాలర్లూ తప్ప? . కెన్నెత్ బర్క్ (May 5, 1897 – November 19, 1993) అమెరికను సాహిత్యవేత్త . ఈ కవితలోని మాధుర్యమంతా నగరజీవితానికి అలవాటుపడిన మనల్ని సున్నితంగా వెక్కిరించడంలో ఉంది. మనం ప్రకృతి ఆరాధకులమనీ, శేషజీవితాన్ని ఏ…
-
జన్మాంతర వాసనలు… విలియం స్టాఫోర్డ్ , అమెరికను కవి
ఒక్కోసారి విశాలమైన ఆకాశంలోకి పక్షులు వీడిన జాడ ననుసరిస్తూనో, లేక కేవలం ఊరికేనో నిరీక్షిస్తూ నిలబడతావు. ఏదో లీలగా అనిపిస్తుంది ఇంతకుముందెప్పుడో ఇలాగే జరిగినట్టు; అక్కడ ఏదో ప్రశాంతత, పిల్లగాలి వీస్తుంటుంది; ఎక్కడో సెలయేటి తీరాన్నో, నది ఒడ్డునో; నీరుబిల్లిలా ఒక్క సారి జాగరూకుడవవుతావు; నువ్వు ఇప్పుడు చూసిన ఈ విశాల నిరామయ లోకంలాటివే, వేరు లోకాల్లో మరొకసారి వేగుచుక్కలా ఉదయిస్తావు, ఒక క్షణ కాలంపాటు, ఈ నిర్నిబంధ ప్రకృతి ఒడిలో. 2 అడవుల్లో ఏదో గుసగుస…
-
కవితా చాతురి … ఆర్చిబాల్డ్ మేక్ లీష్, అమెరికను కవి
ఒక గుండ్రని పండులా, కవిత స్పర్శకి తెలిసి మౌనంగా ఉండాలి ఎప్పటివో పాతపతకాలు బొటనవేలితో మాటాడినట్టు మూగగా మాటాడాలి నాచుపట్టిన కిటికీపక్క నాపరాయిపలకలు భుజాలరాపిడికి అరిగినట్టు చప్పుడుచెయ్యకుండా అరిగిపోవాలి ఎగురుతున్న పక్షుల్లా కవిత భాషాతీతంగా ఉండాలి నెమ్మదిగా నింగినెక్కుతున్న చంద్రుడిలా కాలానికి తెలియకుండా అది కదలాలి చీకటికి చిక్కుపడ్డ చెట్లు విస్తరిస్తున్న వెన్నెలలో ఒకటొకటిగా కొమ్మలు కనిపించినట్టు, అర్థమవాలి శీతకాలపు చెట్ల ఆకుల వెనక కదిలే చంద్రుడిలా ఒక్కొక్క జ్ఞాపకపు పొరా విడిచిపెట్టాలి నెమ్మదిగా నింగినెక్కుతున్న చంద్రుడిలా…
-
తబ్బిబ్బైన శతపాది… అజ్ఞాత కవి
ఒక శతపాది ఎంతో హాయిగా ఉండేది అనుకోకుండా ఒక రోజు ఒక కప్ప నవ్వులాటకి: “నీకు ఏ కాలు తర్వాత ఏ కాలు పడుతుందో కాస్త చెప్పవా?” అని అడిగేదాకా. ఆ ప్రశ్న దాని మనసుని ఎంతగా అతలాకుతలం చేసిందంటే అది తబ్బిబ్బై తన గుంతలో ఎలా పరిగెత్తాలో ఆలోచిస్తూ ఉండిపోయింది. . అజ్ఞాత కవి ఈ లిమరిక్కు(కవిత)లో సౌందర్యం ఒక్కోసారి మనం ఎలా Self-conscious అవుతామో తెలియజెయ్యడమే. మామూలు సమయంలో ఎంత నేర్పుగా, అలవోకగా ఒక…
-
యాభై ఏమిటి చెబుతోంది… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి
నేను చిన్నగా ఉన్నప్పుడు నా అధ్యాపకులందరూ ముసలివాళ్ళు నా ఉత్సాహం నీరుకారిపోయేదాకా అర్థాన్ని వదిలి పదాలకోసం ప్రాకులాడేను, కరిగించిన లోహంలా ఎలా పోతపోస్తే అలా తయారయ్యాను. నేను బడికి వెళ్ళి వయోజనుడనై అంతా గతంగురించి నేర్చుకున్నాను ఇప్పుడు నేను ముసలివాడిని, కానీ, నా గురువులు పిల్లలు. ఒక మూసలోపొయ్యడానికి ఒదగనివి స్వయంగా ఫలించి, ఎదుగుతాయి; ఎలా అతుకులువెయ్యాలా అని నేను పాఠాలతో సతమతమౌతున్నాను ఇప్పుడు బడికి వెళుతున్నది పిల్లలనుండి భవిష్యత్తు నేర్చుకుందికి. . రాబర్ట్ ఫ్రాస్ట్ (March 26,…
-
నువ్వు శరత్తులో వస్తే… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
నువ్వు శరత్కాలంలో వస్తే, నేను వేసవిని పక్కకి తోసెస్తాను సగం విసుగుతో, సగం వినోదంతో గృహిణులు ఈగని తోలినట్లు. నేను నిన్నొక ఏడాదిలో చూడగలిగితే నెలలన్నిటినీ ఉండలుగా చుట్టి ఒక్కకటీ ఒకో సొరుగులో దాచి ఉంచుతాను వాటి వాటి సమయం వచ్చేదాకా. ఒక వేళ శతాబ్దాలు ఆలశ్యం అవుతుందనుకుంటే, వాటిని నా చేతివేళ్లమీద లెక్కిస్తుంటాను వేళ్ళన్ని అయిపోయి, వాన్ డీమన్ లో *1 నా శిక్ష పూర్తయేదాకా. జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలిస్తే, ఎప్పుడో ఒకప్పుడు మనిద్దరిదీ…
-
His 20th Birthday… K. Geeta, Telugu, Indian
Are these the same kid-like hands that entwined my neck till the other day?! It seems some alien bony youth has entered into my cherub. Are they the same balloony cheeks Protesting against taking food in anger? Somebody has meticulously carved that tender moustache Over the enduring smiley face of…
-
Darling Daughter… Nishigandha, Telugu, Indian
Before the tailless squirrels And nameless flowers Join the unfinished drawings, Colours engage in whispers With the walls and the windows. When that exhausted and disheveled rainbow Wakes up from her sound sleep It strikes dawn in the mansion. All the curtains of inertia will be Drawn aside in a hurry. As…