వర్గం: అనువాదాలు
-
వీరుడు… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
“తను కోరుకున్నట్టుగా జాక్ వీరమరణం పొందాడు” అంది తల్లి, తను చదువుతున్న ఉత్తరాన్ని మడిచిపెడుతూ. “కలనల్ చాలా అద్భుతంగా రాస్తాడు,” అలసిన ఆమె గొంతుకి ఏదో అడ్డుపడి గద్గదమైపోయింది. సగం తలపైకెత్తి,” మా లాంటి తల్లులము అటువంటి వీరపుత్రులను చూసి గర్వపడతాం.” ముఖం వాలిపోయింది. బ్రదర్ ఆఫీసరు మౌనంగా బయటకి నడిచేడు. అతను ఆ అమాయకపు తల్లికి పెద్ద అబద్ధాలు చెప్పేడు వాటిని, సందేహం లేదు, ఆమె జీవితకాలం నెమరువేసుకుంటుంది. అతను మాటాడడానికి మాటలు వెతుక్కుంటూ, గొణుగుతుంటే,…
-
పరస్పర విరుద్ధమైన ఆదేశాలు… కెంట్ ఎం. కీత్, అమెరికను.
మనుషులు అతార్కికులు, అవివేకులు, స్వార్థపరులు. అయినా సరే, వాళ్ళని ప్రేమించు. నువ్వేదైనా మంచిపని చేస్తే దానివెనక నీకేదో స్వలాభం ఉందని నిన్ను నిందిస్తారు. అయినా సరే, మంచిని చెయ్యి. నువ్వు విజయం సాధించి నిజమైన శత్రువులనీ, కపట స్నేహితుల్నీ సంపాదించుకుంటావు. అయినా సరే, విజయం సాధించు. నువ్వు ఇవాళచేసిన ఉపకారాన్ని రేపటికి మరిచిపోతారు. అయినా సరే, ఉపకారం చెయ్యి. నిజాయితీవల్ల, నిజంచెప్పడం వల్ల నువ్వు నష్టపోవచ్చు. అయినా సరే, నిజాయితీగా ఉండి నిజమే చెప్పు. గొప్ప…
-
నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసిన క్షణం… పుష్కిన్, రష్యను కవి
నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసిన ఆ క్షణం ఇంకా గుర్తే: నా కళ్ళు అప్పుడే అలా ఎత్తి చూశాను, నువ్వు అక్కడ ఉన్నావు, అపురూపమూ అరుదూ ఐన సౌందర్య రహస్యం లిప్తకాలం కళ్ళముందు కదిలివెళిపోయిన అనుభూతి… మూగ పరివేదనతో, నిరాశతో లోపలే ప్రార్థించుకున్నాను. ప్రపంచమెప్పుడూ వృధా జీవిత ప్రయాసలనే గౌరవిస్తుంది. ఊరడించే నీ పలుకులని చాలకాలం మనసులో భావించుకున్నాను, నీ రూపం నా కలలని చాలకాలం వేధించింది. కాలం గడిచిపోయింది. ఒక భయంకరమైన తుఫాను నాకై నేను పదిలంగా…
-
వీడిపోవుట … A C స్విన్ బర్న్, ఇంగ్లీషు కవి
గీతికలూ! పదండి ఇక్కడనుండి పోదాం; ఆమె ఇక వినదు. మనం ఇక్కడ నుండి నిష్క్రమిద్దాం నిర్భయంగా; మౌనంవహించండి, ఎందుకంటే మనకిష్టమైన విషయాలూ, జ్ఞాపికలగురించి పాడే సమయం ముగిసిపోయింది. మనం ఆమెని ప్రేమించినంతగా నన్నుగాని,మిమ్మల్ని గాని ఆమె ప్రేమించదు. నిజం, మనం ఆమె చెవులకి గంధర్వగానం వినిపించినా ఆమె వినేస్థితిలో లేదు. లేవండి! లేచి ఇక్కడనుండి పోదాం; ఆమె కనీసం గుర్తించలేదు. పెద్ద పెద్ద గాలులు పోయే సముద్ర తటివైపు పొదాం. అక్కడ ఇసకా, నురుగూ ఎగురుతుంటై; మనకెవరు…
-
అనుకోకుండా… పాట్రిక్ మెగిల్, ఐరిష్ కవి
ఈ చిన్ని కవితలు, మోటుగా వినసొంపు లేకుండా ఉంటే ఉండనీండి, వీటిని నేను పూరిపాకలొ, సోమరిపోతు ధనికుల భవంతులచెంత లోతైన మురికి గుంటలో, బోర్లపడిన బొక్కెన ఆదర్శంగా రాసేను. అదిగో ఇంజన్లు పరిగెత్తే రాదారుల్లోనో, హాయైన రాచబాట మీదనో, దీనికి మీరు తగిన గుర్తింపు ఇవ్వకపోవచ్చు, మీ అనుమానం తీర్చడానికి, ఈ కవితల్ని రాసింది నేనే, భగవంతుడు సాక్షిగా, ఆ విషయం నాకే తెలుసు! వాటిని ఏ పెనం పక్కనో, లేదా ఏ వణికిస్తున్న ఆరుబయటనో రాసేను,…
-
శాశ్వతత్వానికి వ్యతిరేకంగా .. జాన్ ఎం. ఫోర్డ్, అమెరికను
క్రిమి సర్పిలాకారంగా బల్లని దొలుచుకుంటూ పోతుంది తాను చేసిన కన్నంలో ఉండే ఆ కర్ర పొడే, కప్పుడు ఆ బల్లని దృఢంగా, ఏకాండిగా ఉంచేదని దానికి తెలీదు; అకస్మాత్తుగా ఒక స్ఫటికం నేలమీదపడి పగులుతుంది; ఎలక్ట్రాన్లు వాటిత్రోవని చాలా నేర్పుగా తెలుసుకుంటాయి, ద్రవ్యరహిత ప్రవాహం పొగవ్యాపించిన జాడలననుసరిస్తుంది; ఒకప్పుడు అందరినాలికలమీద ఆడిన ప్రేమికుల పేర్లు తెలియకపోయినా నీకు ఇపుడు పెద్దనష్టం లేదు; అదే చిత్రమంటే. ఈ సృష్టి క్రమంగా నశిస్తుంది. అది అలాగే సృష్టించబడ్డది. కాని జ్ఞపకశక్తి…
-
ల్యూసైల్… ఓవెన్ మెరెడిత్, ఇంగ్లీషు కవి
మనం కవిత్వం సంగీతం, కళలూ లేకుండా బ్రతకొచ్చు; మనం హృదయమూ, అంతః కరణా లేకుండా బ్రతకొచ్చు; స్నేహితులు లేకుండా, పుస్తకాలు లేకుండా బ్రతకొచ్చు; కానీ ఏ నాగరీకుడూ వంటవాళ్లు (కుక్స్) లేకుండా బ్రతకలేడు. అతను పుస్తకలు లేకున్నా బ్రతకొచ్చు… జ్ఞానానిదేముంది, వగవడం తప్ప? ఏ ఆసలూ లేకుండ బ్రతకొచ్చు… ఆశదేముంది, మోసగించడం తప్ప? అతను ప్రేమలేకుండాకూడా బ్రతకొచ్చు, అనురాగానిదేముంది, కోరికతో కృశించడం తప్ప? కానీ భోజనం అవసరం లెకుండా బ్రతికే మనిషిని చూపెట్టండి? . . ఓవెన్…
-
వసంతమొక అజ్ఞాత హస్తం… ఇ. ఇ. కమ్మింగ్స్, అమెరికను కవి
బహుశా వసంతమొక అజ్ఞాత హస్తం… (అదెక్కడనుండి అంత జాగ్రత్తగా పొడచూపుతుందో అంతుచిక్కదు) జనాలు తొంగి చూసే కిటికీని సవిరిస్తూ (వాళ్ళు ఒకపక్కనుండి ఆశ్చర్యంగా చూస్తుంటే వాళ్ళకి బాగా పరిచయమైనవీ, ఏమీ తెలియనివీ వస్తువుల్ని జాగ్రత్తగా స్థలాలు మారుస్తూ, ఒక పద్ధతిలో పెడుతూ ) అన్నిటినీ ఎంతో మెళకువతో పరివర్తనచేస్తూ… వసంతం బహుశా కిటికీలో మనకి బాగా పరిచయమైన చెయ్యిలాంటిది (కొత్తవస్తువుల్నీ, పాతవస్తువుల్నీ చాలా పదిలంగా మార్పులు చేస్తూ, మనుషులు జాగ్రత్తగా పరిశీలిస్తుంటే ఆ పువ్వుని కోణాన్ని ఒక…
-
ప్రిమ్రోజ్ … రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి
“నాకెందుకు పూలలో యువరాణివంటి అందమైన కుసుమాన్ని పంపిస్తున్నా?”వని అడుగు “మంచుముత్యం జతచేసిన ఈ ప్రిమ్రోజ్ ని ఎందుకు పంపుతున్నా?”వని అడుగు నీ చెవుల్లో రహస్యంగా చెబుతాను: ప్రేమలోని తియ్యదనంలో కన్నీళ్ళుగూడా కలగలిసి ఉంటాయని. “ఈ పువ్వెందుకు పసిడివర్ణంలో ఉన్నా అంత దీనంగా వాడిపోయినట్టుందేమిటి? అని అడుగు. “ఈ తొడిమ ఎందుకు బలహీనంగా ఉండి వంగిపోయినా, రాలిపోవడం లేదేమి?” అని అడుగు నే బదులు చెబుతాను: అవి ప్రేమికునిలో అణగారుతున్న ఆశలు ఎలా ఉంటాయో గ్రహిస్తున్నాయని. . రాబర్ట్…
-
ఏకాంతము … లార్డ్ బైరన్, ఇంగ్లీషు కవి
తోవచూపట్టని కీకారణ్యాల్లో ఆనందం ఉంది; ఒంటరి తీరాల్లో అలవిమాలిన పారవశ్యం కలుగుతుంది; ఎవ్వరూ చొరలేని చోటకూడ సహవాసాలుంటాయి, గంభీరమైన సముద్రంలోకూడా ఎగసిపడే అలలచప్పుళ్ళున్నట్టు; మనిషంటే నాకు ప్రేమ తక్కువేం లేదు, ప్రకృతిని ఎక్కువ ప్రేమిస్తా నంతే! మా ఈ భేటీల్లో నేను నా రాబోయే జన్మల్లోనో లేదా గతించిన జన్మల్లోనో ఈ విశ్వంలో విలీనమైన విషయాలను నెమరువేసుకుంటూ, ఎంతగా అనుభూతిస్తానంటే నేను మాటల్లో చెప్పలేను; అలాగని అంతా దాచుకోనూలేను. ఓ అగాధ వినీల సాగరమా! దొర్లుకుంటూ పో!…