వర్గం: అనువాదాలు
-
పద చిత్రం… కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి
ఓడల నీడలు లేత నీలిరంగు జిలుగుతో తీరుబాటుగా కదలి వస్తున్న మెత్తని కెరటాల శీర్షాలపై ముందుకీ వెనక్కీ ఊగుతున్నై. దిగంతాల అంచున పొడవుగా వంగిన ఆకాశపు కపిలవర్ణం ఉప్పునీటిలో ఇసుకను కలుపుతున్నట్టుంది. సాగరదేహం మీద అంతులేని స్పష్టమైన అలల ముడుతలు ముందుకు వచ్చీ, ముగిసిపోయీ, వెనక్కిపోతూ ఉన్నాయి. చిన్ని అలలు భగ్బమై, పేలిపోతున్న బుడగలు సాగరతీరన్ని అలుకుతున్నాయి. ఓడల నీడలు లేత నీలిరంగు జిగిగల కెరటాల శీర్షాలపై ముందుకీ వెనక్కీ ఊగుతున్నై. . కార్ల్ సాండ్ బర్గ్…
-
మూడు బొంతకాకులు … అజ్ఞాత కవి , 17 వ శతాబ్దం
మూడు బొంతకాకులు చెట్టుమీద కూచున్నాయి, అవి ఎంతనల్లగా ఉండగలవో అంత నల్లగా ఉన్నాయి. అందులో ఒకటి మిగతావాటితో అంది: “మనం ఊదయాన్నే ఫలహారం ఎక్కడ చెయ్యడం?” అని “అదిగో! దూరాన పచ్చనిపొలాల్లో ఒక వీరుడు చనిపోయి తన డాలుక్రింద పడి ఉన్నాడు.” “లాభం లేదు. అతని వేట కుక్కలు పాదాల చెంత ఉన్నాయి. అవి తమ యజమానిని జాగ్రత్తగా కాపాడతాయి.” అతని పెంపుడు డేగలు ఆకాశంలో పహారా కాస్తున్నాయి అతని దగ్గరకి ఏ పక్షీ రానియ్యవు. కొంతసేపటికి…
-
బిల్లు కలెక్టరు… (ఫాదర్) జాన్ బి టాబ్, అమెరికను
“ఎవరు మీరు?” ఒక నల్ల కలువ…తుమ్మెదని అడిగింది మంచుబిందు సులోచనాల్లోంచి దాని భీకరమైన ఆకారం చూసి ఆశ్చర్యపోతూ . “నేనా అమ్మా, నేను ప్రజా సేవకుణ్ణి తేనె, మైనం పన్ను వసూలు చేసే బిల్లు కలెక్టర్ని. నాకివ్వడానికి మీదగ్గర ఏమీ లేదా?” బదులిచ్చేడు గండుతుమ్మెద. . (ఫాదర్) జాన్ బి టాబ్ (March 22, 1845 – November 19, 1909) అమెరికను కవి. . Image courtesy: http://catholiclane.com/john-b-tabb-americas-forgotten-priest-poet/ . The Tax-Gatherer .…
-
కొత్త సిపాయిలు… అజ్ఞాత కవి, రుథేనియన్
కొండవాలులో మంఛుపేరుకుని ఉంది, కాని తర్వాత కరిగి వాగులై ప్రవహిస్తుంది. రోడ్డుపక్కన పాపీలు విరగవూసాయి… అవి పాపీలేనా? కాదు, అవి ఎర్రగా మెరుస్తున్నాయి గాని, ఓహ్, అవి పువ్వులు కవు, సైన్యంలోకి కొత్తగా చేరిన సిపాయిలు! వాళ్ళు కొత్తగా చేరిన యువ సిపాయిలు! వాళ్ళు క్రిం (Krym) దాకా ఒకరివెనక ఒకరు స్వారీచేస్తూ వెళ్తారు, ఆ విశాలమైన పల్లెసీమలో గుర్రపు డెక్కల చప్పుడు ప్రతిధ్వనిస్తుంది. ఇంతలో ఒక తల్లి పిలుపు వినిపిస్తుంది: ఒరేయ్ శ్రద్ధమాలినవాడా! వెనక్కి రా…
-
There is Nothing Much To Say…. Nanda Kishore, Telugu, Indian
1 Now there are only two tenses… The times when I loved her, and the times when I can’t help loving her. 2 It never occurred to me how time would pass without her; All these days, amidst enveloping despair, I could understand I was better off because of her, But strange, I…
-
జీవిత సంగ్రహం … జిస్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి
నువ్విప్పుడు ఏంచెయ్యాలి? ఒక దరఖాస్తు నింపి దానికి నీ జీవిత సంగ్రహాన్ని జతపరచాలి, నీ జీవితం ఎంత దీర్ఘమైనది అన్న నిమిత్తం లేకుండా నీ జీవిత సంగ్రహం చాలా సంక్షిప్తంగా ఉండాలి. కనుక క్లుప్తత పాటించి, వాస్తవాలనే ఎంచుకో. దృశ్యాలని చిరునామాలుగా మార్చు, లీలగా ఉన్న జ్ఞాపకాలని తారీకులుగా మార్చు, పెళ్ళి చేసుకున్నవారినే ఉటంకించు, పిల్లలలోకూడ పుట్టిన వాళ్లనే చూపించు. నీ కెవరు తెలుసునన్నదానికంటే నిన్నెవరికి తెలుసో చాలా ముఖ్యం. ప్రయాణాలు…. విదేశప్రయాణాలయితేనే, అనుబంధాలు— దేనితోనో చెప్పు, ఎందుకో…
-
భావ శకలం 2 … జకోమో లెపార్డి , ఇటాలియన్ కవి
మనిషికి చెందిన ఏదైనా క్షణికమే: ఖీయోస్(Chios) కి చెందిన ఆ అంధకవి* నిజమే చెప్పాడు: చెట్ల ఆకులూ, మానుషప్రకృతీ ఒకే ధర్మాన్ని కలిగి ఉన్నాయి. కాని, ఈ మాటలని పట్టించుకునే వాళ్లు తక్కువ. అందరికీ, చపలమైన ఆశ, వయసు తమతో శాశ్వతంగా ఉంటుందని. మన యవ్వనపుష్పం పచ్చగా అందంగా మెరుస్తూ కనిపిస్తే గర్విష్ఠి అయిన విశృంఖల ఆత్మ వృధాగా అనేక అందమైన ఊహలు ఊహిస్తుంది వయసూ, మృత్యువు అన్న ధ్యాస లెకుండా, ఆరోగ్యంగా, బలంగా ఉన్నప్పుడు రోగాం…
-
శైశవానందం… విలియం బ్లేక్, ఇంగ్లీషు కవి
“నాకు ఏ పేరూ లేదు; పుట్టి రెండురోజులయింది. అంతే!” మరి నిన్ను ఏమని పిలవాలి? “నేను ఆనందంగా ఉన్నాను. ఆనందమే నా పేరు.” నీజీవితం ఆనందమయమగు గాక! నిజమైన ఆనందం! రెండురోజుల వయసుగల శైశవానందం. మధురానందం అని పిలుస్తాను నిన్ను. నువ్వు అలా నవ్వితే చాలు నేను ఆనందంతో గీతాలాలపిస్తాను. నీ జీవితం ఆనందమయమగు గాక! . విలియం బ్లేక్ (28 November 1757 – 12 August 1827) ఇంగ్లీషు కవి . . Infant…
-
కార్డినల్ న్యూమన్ స్మృతికి … క్రిస్టినా రోజేటి ఇంగ్లీషు కవయిత్రి
(సమాధిలో నువ్వెక్కడకి పోగలవు.) . శిలువ తరఫున పోరాడి అలసిన యోధుడా, విశ్రమించు, తుదకు అన్నిటినీ అక్కునచేర్చుకునే నిద్ర, నిద్రపో; నువ్వు నాట్లువేసిన రోజు సుదీర్ఘమయినది, నిద్రించి ప్రతిఫలం అందుకో, నువ్వు చాలా కాలం ఉపవశించేవు, నీ ఆత్మతృప్తిగా విందు భోజనం చెయ్యి. అవును, ప్రేమ నిండుగా అనుభవించడం నీవంతు, ఎందుకంటె, నువు కనపరిచినప్రేమ, పైపైది కాదు, లోతైనది, నీ ప్రేమ నిండుపున్నమనాటి పోటువంటిది, కొంచెపునరుల పిల్లకాలవలలు నీ వరద ముందు దిగదిడుపే. నీకిపుడు రాత్రి అయింది,…
-
నిర్భాగ్యుడి మరణశయ్య… కెరొలీన్ ఏన్ సదే, ఇంగ్లీషు కవయిత్రి
మెల్లగా అడుగులెయ్యండి… తల వంచుకొండి గౌరవపురస్సరంగా తల అవనతం చెయ్యండి ఇక్కడ ఏ గుడిగంటలూ మోగవు… అయినా ఒక అమర్త్యాత్మ శరీరంనుండి నిష్క్రమించబోతోంది. ఓ తెరువరీ! నువ్వు ఎంతో గొప్పవాడివై ఉండొచ్చు అయినా, కనీసగౌరవంతో తల వంచుకో; ఆ పాడుబడ్డ పూరిపాకలో… ఆ నామమాత్రమైన పక్కమీద నీకంటే గొప్పవాడు పరున్నాడు. ఆ బిచ్చగాడి గుడిశలో మృత్యువు రాజసాన్ని ప్రదర్శిస్తోంది. ఎవరూ లేరులే… లోపలికి నడు ఈ రాజమందిరానికి ఎవరూ కాపలా లేరులే లోపలికి తొంగిచూడు చెమ్మగా చల్లగా…