వర్గం: అనువాదాలు
-
అంతరంగపు ప్రశాంతత … హారియట్ మన్రో, అమెరికను కవయిత్రి
గాలి ఊసులేని భూమి పొరల్ని చీల్చుకుని ఎక్కడ నిశ్చలత ఉందో అక్కడకి చొరబడాలని ప్రయత్నించే భీకర శబ్దాలూ, యుద్ధాల కోలాహలమూ, ప్రార్థనలలోని సవ్వడీ, అకస్మాత్తుగా కలిగే ఆనందాన్ని సున్నితంగా ప్రకటించే అనురాగ నిస్వనాలూ, లజ్జ ఎరుగని నవ్వుల కంఠధ్వనులూ… ఇవేవీ నన్ను ఎదిరించి అవమానించనూలేవు… జ్ఞాపకాలై మనసులో పదేపదే మార్మోగనూ లేవు… శాశ్వతమైన ప్రశాంతత నిండిన నా అంతరాంతర కుహరాల్లోకి ప్రవేశించనూ లేవు. బుగ్గకంటే మెత్తనైన ప్రశాంతత పుష్పించబోతున్న మొగ్గలక్రింది నేలలో దాగుంది… అది గంటలకొద్దీ నిర్విరామంగా…
-
మహా నగరం… హెరాల్డ్ మన్రో, ఇంగ్లండు
నేను సూర్యాస్తమయవేళ తిరిగి వచ్చేసరికి సేవకురాలు సన్నగా ఏదో పాడుకుంటోంది. చీకటిగా ఉండే మెట్లకిందా, ఇంటినిండా వెన్నెలరేకలా సంధ్యవెలుగు చొరబడింది. కాల స్పృహ ఎంతగా చచ్చుపడిందంటే అది మధ్యాహ్నమో అర్థరాత్రోకూడా తెలియడంలేదు. జలపాతపు నీటిలా పడుతూ, లేస్తూ, పడుతూ, ఉస్సురంటూ నిశ్శబ్దపు శబ్దమొక్కటే శాశ్వతంగా కనిపిస్తోంది. నేను నా గదిలో కూచున్నాను, సూర్యాస్తమయాన్ని గమనిస్తున్నాను… నక్షత్రాల వెలుగు చూశాను… ఇంటిముఖం పట్టిన మనుషుల పాదాల చప్పుడు విన్నాను… నిద్రపోబోతున్న కడసారి బిడ్డ చివరి మాట విన్నాను……
-
రే స్తుతి … మేక్స్ మైకేల్సన్, అమెరికను
నిగూఢమైన ఓ రేయీ, ఇలా రా! నెమ్మదిగా దిగివచ్చి ఒద్దికగా పొదువుకో! ఏ ఆరాధనలూ లేకుండా అహంకారంతో మేము కట్టుకున్న ఇళ్ళపై నెమ్మది నెమ్మదిగా ఆవహించు. నీ ముసుగులో వాటిని దాచి దాచి నాల్గుపక్కలా నీ నీడలని ప్రసరించు. మా కార్ఖానాలపై, అంగళ్ళపై వ్యాపిస్తూ, మా అహమికలనీ, మా అవమానాలనీ నీ నీహారికా సదృశమైన రెక్కలలో మరుగుపరుచు. నున్నటి రాళ్ళుపరచిన మా వీధులలోకి అడుగుపెట్టి నీ కల్లోల పవనాల రేచుకుక్కల్ని విడిచిపెట్టు. ఓ నిశా రత్నమా! నిద్రిస్తున్న వాళ్ళని…
-
అనుమానపు మనసు… ఎలిజబెత్ మహారాణి 1 ఇంగ్లండు
పాదాల వంకర లేదు, కళ్ళు పువ్వువెయ్యనూ లేదు, శరీరంలో ఏ భాగమూ ఎబ్బెట్టుగా అసహజంగా లేవు. అయితేనేం, అవన్నీ ఉన్నా, నిత్యమూ రహస్యంగా, అనుమానించే మనసుకంటె, సగంకూడా అసహ్యంగా ఉండవు. . ఎలిజబెత్ రాణి 1 (7 September 1533 – 24 March 1603) (1520లో పారిస్ లో ముద్రించబడ్డ ఫ్రెంచి ప్రార్థనా గీతాల పుస్తకంలో చివరి పేజీలో ఆమెచే ఈ కవిత రాయబడి సేవకునికో, స్నేహితునికో నవంబరు 17, 1558కి ముందు ఇవ్వబడినట్టు అంచనా .)…
-
మహావృక్షాలు కూలినపుడు… మాయా ఏంజెలో, అమెరికను కవయిత్రి
మహా వృక్షాలు కూలినపుడు దూరాన కొండలమీది రాళ్ళు కంపిస్తాయి, సింహాలు ఒత్తైన పొడవాటి రెల్లుపొదల్లో దాక్కుందికి పరిగెడతాయి, చివరికి ఏనుగులు సైతం ప్రాణభీతితో సురక్షితప్రదేశాలకి చేరుకుంటాయి. అడవుల్లో మహా వృక్షాలు కూలుతున్నప్పుడు చిన్నజీవాలు వాటి జ్ఞానేంద్రియాలు భయానికి హరించుకుపోయి మౌనంలోకి ముడుచుకుపోతాయి గొప్పవ్యక్తులు మరణించినపుడు మనని ఆవరించినగాలి పలచనై, తేలికై, క్రియాశూన్యమైపోతుంది. మనం ఊపిరి బిగబడతాం మనకళ్ళు క్షణికమైనా, స్పష్టంగా చూస్తాయి, మన జ్ఞాపకశక్తి ఒక్కసారిగా మరింతపదునుతేరి పరిశీలుస్తూ ఉంటుంది పైకి చెప్పని మంచిమాటలను నెమరేసుకుంటూ చేద్దామనుకుని…
-
On The Easel … Nareshkumar, Telugu, Indian
No great expectations I entertained for The picture to be amazing; I just went on caressing with the brush across; I did not even think of some deadline To finish it before. Even as I blotted clean the stains of blood That seeped up to the fore arms While I was drawing…
-
ఏ యఫ్ యాత్లా యో కుత్ల్… జాన్ మే, ఐస్ లాండ్
ఇంత అందమైన ఆకాశాలకి నలుపు పులిమే ఆమెతో నే నేమి తగవులాడేది? సలసల మరుగుతున్న ఆమె పొట్టని కంపించనీ ఈ ప్రపంచాన్ని ఆమె హేల అబ్బురపరచనీ. ఆమె మహోగ్రంగా ఉంటుంది. కావొచ్చు. కానీ, ఆమెది క్రియాత్మక సంఘర్షణ అని అర్థం చేసుకో గలను. ఆ కరిగి ప్రవహించే ఆమె హృదయం ఈ సృష్టిని తీర్చిదిద్ది, నా జీవితానికే ఆలంబన ఔతుంది. కనుక, ఆమె నల్లని పొగలు చిమ్ముతూ తెల్లని నుసితో ఆకాశాన్ని సముద్రాన్నీ కప్పనీ; పగలే చీకటిబడిన…
-
మైదానాలలో… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే , అమెరికను
చెలియలకట్టలోని గుల్లరాళ్ళని పలకరించే పెను అలలకీ ఒడ్డునవిరిగిపడే టన్నులబరువున్న కెరటాలకీ సముద్రమట్టానికీ, అక్కడి హోరుకీ దూరంగా… మైదానాలలో జాగాలు కొనుక్కుని, అక్కడ ఇళ్ళు కట్టుకునే వాళ్ళూ, లేదా ఇళ్ళు కొనుక్కునే వాళ్ళూ మరోసారి సముద్రపు ఉప్పునీటివాసన నేను కోరుకుంటున్నట్టు, వాళ్ళేం కోరుకుంటారు? మైదానంలోని మా ఇంట్లో, పక్కమీద తుళ్ళిపడిలేచిన నేను కోరుకుంటున్నట్టు రేవు ముఖద్వారంలోని ఓడలను చరుస్తూన్న కెరటాలు నిద్రలేపని ఆ మనుషులు ఏం కోరుకుంటారు? ఇరుకైన గదిగోడలకేసి చేతులు బాదుకుంటూ ఒక కిటికీ గాని, ద్వారబంధంగాని…
-
యువకవులకి… నికనోర్ పర్రా, చిలియన్ కవి
మీకు ఇష్టం వచ్చినట్టు రాయండి ఏ శైలి పాటించాలనుకుంటే అది పాటించండి… ఎన్ని రక్తపుటేరులు పారేయంటే ఇప్పుడు ఏదో ఒక్కదారే సరియైనదని నమ్మడానికి అవకాశం లేదు. కవిత్వంలో ఏదైనా చలామణీ అవుతుంది. కాకపోతే, ఒక్కటే షరతు తెల్ల కాగితం విలువ … పెంచాలి. . నికనోర్ పర్రా Sept 5, 1914 చిలియన్ కవి . . Nicanor Parra Young Poets . Write as you will In whatever style you like…
-
కోరిక… సామ్యూల్ రోజర్స్, ఇంగ్లీషు కవి
కొండ పక్కన నాకో కుటీరముండాలి తేనెటీగల ఝంకారం చెవులకు సొంపుగా సోకాలి సన్నని సెలయేరు, ఒకమిల్లుని చుట్టివస్తూ, గలగల దూకుతూ దాని పక్కనుండే పోవాలి. నా పాక పంచన తరచు ఒక పిచ్చుక తన మట్టి గూడునుండి అటూ ఇటూ తిరుగాడాలి నిత్యమూ ఎవరో ఒక అతిథి నా తలుపు తట్టి నా భోజనంలో పాలుపంచుకోవాలి. ప్రహారీగోడమీద గుబురుగా పెరిగిన తీగలోని పరిమళించే ప్రతి పువ్వూ మంచులో తడియాలి, ఎర్రని గౌనూ, నీలి వోణీ వేసుకున్న ల్యూసీ…