వర్గం: అనువాదాలు
-
అజ్ఞాతకు … హెలెన్ డడ్లీ, అమెరికను కవయిత్రి
వినీలాకాశంలో విచ్చలవిడిగా తిరిగే అందమైన నక్షత్రాలనెన్నో చూశాను, చివరకి సూర్య చంద్రుల్ని కూడా కానీ, నీ ముఖమే చూడలేదు. వయొలిన్ రాగాలని విన్నాను చిరుగాలులూ, ఉత్తుంగ తరంగాల అసంఖ్యాకమైన ఉల్లాసగీతికలు విన్నాను ఒక్క నీ స్వరం తప్ప. ఈ నేలమీది నల్ల కలువల్నీ సుకుమారమైన పుష్పాలనెన్నిటినో తాకేను పారిజాతాల్నీ, రత్నభోగి పువ్వులనీ కూడా ఒక్క నీ చేయి తప్ప. ప్రభాత సంధ్య పాదాలని ఒక ప్రేమికుడిలా ముద్దాడేను వేకువ తలుపులను బార్లా తెరిచాను…
-
రాత్రీ పగలూ నా ఆలోచనలు అటే తిరుగుతాయి… రిఛర్డ్ హెన్రీ స్టొడ్డార్డ్, అమెరికను
. రాత్రీ పగలూ నా ఆలోచనలు మధువందించే అనుభూతివైపే తిరుగుతాయి నా ఉద్దేశ్యంలో జాడీలు మధువు నిల్వచెయ్యడానికే ఉన్నాయి, మధువు, నాకు తెలిసి, తయారుచేసేది తాగడానికే. నేను మరణించేక (ఆ రోజు చాలా దూరంగా ఉండుగాక!) ఒకవేళ కుమ్మరి జాడీ తయారు చేయవలసి వస్తే, నా చితా భస్మముతో తయారుచేయును గాక దానిని నిత్యమూ మధువుతో నింపుదురు గాక! . రిఛర్డ్ హెన్రీ స్టొడ్డార్డ్ జులై 2, 1825 – మే 12,…
-
స్త్రీజాతి శాసనం … ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి
(ఈ కవిత సుమారు వంద సంవత్సరాల క్రింద వ్రాసినా, అందులో ప్రకటించిన ఆవేదనకి కారణమైన యుద్ధోన్మాదం ఎంతమాత్రం తగ్గుముఖం పట్టలేదు, సరికదా, విజృంభిస్తోంది అన్నిచోట్లా, అన్ని రకాలుగా. ఈ కవిత దాని సందర్భాన్ని కోల్పోకపోవడం ఒక పక్క ఆనందకరం, రెండోపక్క విచారకరం. ప్రపంచశాంతికి ఇంతకంటే గొప్పకవిత ఎవరూ రాయలేరేమో ) . క్రీస్తు జన్మించి అప్పుడే 2 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. సాగరంలోకి భూమ్మీద ఉన్న నదులన్నీ చేరినట్టు ఒక్కసారిగా కొన్ని కోట్లమంది స్త్రీలు ఒక కేంద్రస్థానంవైపు…
-
మధుగీతం… అబ్రహాం కూలీ, ఇంగ్లీషు కవి
దాహంకొన్న భూమి వర్షపునీరు చుక్కమిగల్చదు అంతా తాగేసి, ఇంకా కావాలని ఎదురుచూస్తుంటుంది; వృక్షాలు నేలను పీల్చి, పీల్చి నిరంతరం తాగుబోతులై ప్రవర్తిస్తుంటాయి. పోనీ సముద్రం చూద్దామంటే (ఎవరికైనా దానికి దాహం ఏమిటనిపిస్తుంది) ఇరవైవేల నదుల్ని అవలీలగా తాగెస్తుంది ఎంతగా అంటే దాని బొజ్జ పొర్లిపోతుంది. అలా నిలకడలేక తిరుగుతుంటాడా సూరీడు (అతని జేవురుమన్నముఖం తాగుబోతని చెప్పకచెబుతుంది) సముద్రాలన్నిటినీ తాగేస్తాడు, అతని పనయిపోయేక చంద్రుడూ, నక్షత్రాలూ అతన్ని తాగెస్తాయి తాగేసి తమ పద్ధతిలో తందనాలాడతాయి, తాగి రాత్రల్ల వేడుక…
-
లుకాస్టా కోసం (యుద్ధానికి వెళుతూ) … రిఛర్డ్ లవ్ లేస్, ఇంగ్లీషు కవి
నీ నిర్మలమైన హృదయమందిరానికీ ప్రశాంతమైన మనసుకీ దూరంగా, నిర్దాక్షిణ్యంగా వెళుతునానని ప్రేయసీ, నన్ను నిందించకు. నిజమే! మరొక స్త్రీని కాంక్షిస్తూ పరిగెడుతున్నాను రణరంగంలో నాకు కనిపించే మొదటి శత్రువు వెనక, కరవాలాన్నీ, గుర్రాన్నీ, కవచాన్నీ ఎంతో విశ్వాసంతో గుండెలకి హత్తుకుంటాను. నా ఈ చపలత్వం ఎలాంటిదంటే అది నువ్వు కూడా హర్షిస్తావు; నిజానికి, ప్రేయసీ! నా ఆత్మగౌరవాన్ని ఇంతగా ప్రేమించి ఉండకపోతే నిన్ను అంతగా ప్రేమించి ఉండగలిగేవాడిని కాదేమో! . రిఛర్డ్ లవ్ లేస్ (1618–1657) ఇంగ్లీషు…
-
క్లో కోసం… విలియం కార్ట్ రైట్, ఇంగ్లీషు కవి
మనిషికి రెండు పుట్టుకలుంటాయి; మొదటిది ఇంద్రియాల్ని తట్టిలేపుతూ తొలివెలుగు కిరణం పడినప్పుడు; రెండోసారి రెండు హృదయాలు ఒకటైనపుడు, మన జీవితాన్ని మళ్ళీ అక్కడనుండి లెక్కించాలి; నువ్వు నన్నూ నేను నిన్నూ ప్రేమించినపుడు మనిద్దరం కొత్తగా జన్మించినట్టే. ప్రేమ మనకి కొత్త ఆత్మలని ప్రసాదిస్తుంది వాటిలో కొత్త శక్తుల్ని కూడా పాదుకొల్పుతుంది; అప్పటినుండి మనం కొత్తజీవితం ప్రారంభిస్తాం మనం తీసుకునే ఊపిరి మనది కాదు, ప్రేమదే. వయసు వేడి తగ్గినవారినికూడా ప్రేమ యవ్వనుల్ని చేస్తుంది యవ్వనులుగా ఉన్నవాళ్ళని, యవ్వనులుగానే…
-
పెళ్ళి … మేరీ ట్యూడర్ , అమెరికను కవయిత్రి
ఇదిగో, నిన్నే! నాకు నీ పేరిచ్చి నీ కీర్తినీ, అపజయాల్నీ పంచుకుందికి నీ చట్టాలతో నన్ను భార్యగా చేసుకుని, నీ మాటతో నా జీవితాన్ని నీది చేసుకున్న నీకు నన్ను నిరోధించడానికి నీకున్న ఆధారాలేమిటి? నిజమే, శాశ్వతంగా నేను నిన్ను అనిసరించే ఉంటాను, కానీ, ఇంతదూరం వచ్చేక ఋజువేమిటి? నువ్వెన్ని చట్టాలు చేసినప్పటికీ, నేను స్వతంత్రురాలినే. నేను నీలో భాగం కాదు. ఆగు, నా మాట పూర్తవలేదు. నువ్వు నావాడివే, ఎందుకంటే, నేను… నేనూ, నువ్వూ కూడా.…
-
పువ్వులూ-ఫలితాలూ … ఎడ్గార్ గెస్ట్, అమెరికను
అక్కడా ఇక్కడా అన్నిచోట్లా పువ్వులు పూస్తూన్న మొక్కలతో చిన్నదో పెద్దదో ఓ పూదోట కావాలనుకుంటే మనిషి నడుమువంచి మట్టి తవ్వక తప్పదు. మనం కోరి సాధించగలిగిన పనులు ఈ భూమ్మీద చాలా తక్కువగా ఉన్నాయి మనం ఆశించినది ఏపాటి విలువైనదైనా దాన్ని సాధించడానికి శ్రమించాల్సిందే. ప్రశ్న నీ లక్ష్యం ఏమిటి అన్నది కాదు; దాన్ని సాధించగల రహస్యం ఏమిటన్నది. అది: నీకు పువ్వులు కావాలన్నా, కోరుకున్నది కావాలన్నా రోజు తర్వాత రోజు నువ్వు దానికై కష్టపడవలసిందే. . ఎడ్గార్…
-
పునరుద్ధరణ…. జేమ్స్ మెరిల్, అమెరికను కవి
నిన్ను కదిలించడానికి అబద్ధాలూ, అలసటా, ఒక్కోసారి ప్రేమా వంటి అన్ని సాకుల్నీ వాడీసేక ఇక మిగిలింది ఒక్కటే: నీ నుండి దూరంగా జరగడమే. నేనా అపరాధభావన భరించడానికి సిద్ధంగా ఉన్నాను. “ఔ””నని తలూపుతావు. శరత్తులో ఒక్కసారి గాలి ఊపు అందుకుంటుంది. రాలిన ఎండుటాకుల పోక ఒకటి గలగలా దొర్లుకుంటూ చప్పుడు చేస్తుంది. మనిద్దరం అలా చూస్తూ కూచుంటాం. మళ్ళీ మాటాడబోయేవేళకి నాలో ప్రేమ పూర్తిగా అడుగంటిపోతుంది… అంతరాంతరాల్లోకి… . జేమ్స్ మెరిల్ (March 3, 1926 –…
-
అంతిమ విజయం… విల్ఫ్రెడ్ ఓవెన్ … ఇంగ్లీషు కవి
‘ఓ, జీసస్! గట్టిదెబ్బే తగిలింది ‘ అంటూ, అతను నేలకొరిగాడు. అతను వృధాగా శత్రువుని శపించేడో, దేవుణ్ణి తలుచుకున్నాడో గాని, బుల్లెట్లు మాత్రం ‘వృధా! వృధా! వృధా! ‘ అని ముక్తకంఠంతో చెప్పేయి మెషీన్ గన్ లు ” టట్, టట్ టట్ టట్” అంటూ నవ్వుకున్నాయి పెద్ద ఫిరంగి బడబడా పగలబడి నవ్వింది. మరొకడు, – “అమ్మా! అమ్మా! నాన్నా!” అంటూ పిల్లాడిలా దేనికినవ్వుతున్నాడో తెలీని ముఖంతో మరణించేడు. ఎత్తునుండి కురుస్తున్న గుళ్ళవర్షం తాపీగా…