నిన్ను కదిలించడానికి అబద్ధాలూ, అలసటా,
ఒక్కోసారి ప్రేమా వంటి అన్ని సాకుల్నీ వాడీసేక
ఇక మిగిలింది ఒక్కటే: నీ నుండి దూరంగా జరగడమే.
నేనా అపరాధభావన భరించడానికి సిద్ధంగా ఉన్నాను.
“ఔ””నని తలూపుతావు. శరత్తులో ఒక్కసారి గాలి ఊపు అందుకుంటుంది.
రాలిన ఎండుటాకుల పోక ఒకటి గలగలా దొర్లుకుంటూ చప్పుడు చేస్తుంది.
మనిద్దరం అలా చూస్తూ కూచుంటాం. మళ్ళీ మాటాడబోయేవేళకి
నాలో ప్రేమ పూర్తిగా అడుగంటిపోతుంది… అంతరాంతరాల్లోకి…
.
జేమ్స్ మెరిల్
(March 3, 1926 – February 6, 1995)
అమెరికను .
.
James Merrill
.
A Renewal
.
Having used every subterfuge
To shake you, lies, fatigue, or even that of passion,
Now I see no way but a clean break.
I add that I am willing to bear the guilt.
You nod assent. Autumn turns windy, huge,
A clear vase of dry leaves vibrating on and on.
We sit, watching. When I next speak
Love buries itself in me, up to the hilt.
.
James Merrill
(March 3, 1926 – February 6, 1995)
American
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.in/2000/08/renewal-james-merrill.html

వ్యాఖ్యానించండి