వర్గం: అనువాదాలు
-
A Cup of Tea … Bala Sudhakar Mauli, Telugu, Indian
After all a cup of Tea! What would be there That one can hold with five fingers? A cup of tea can bloom a warm evening… It can instil that much confidence as a friend can. My friend compares a cup of tea to a song. A song unites people. On a chilly evening hour…
-
An Open-ended Poem… Ravi Verelly, Telugu, Indian
Under the Unwinking sky… Drips beautiful vitriolic spangles Occasionally Through its leafy canoes… The cocoanut As if it quenches the thirst of the whole village… croons lazily like a well-lubed cart the pulley. With the airs of pulling the hiding sky by its tresses and siphoning it off from the bottom Looks arrogant the insolent…
-
అపేక్షించదగ్గవి … మాక్స్ ఎర్మాన్, అమెరికను
ఆతృతా, రణగొణధ్వనులమధ్య శాంతంగా స్థిరంగా నడుచుకో; నిశ్శబ్దంలో ఎంత ప్రశాంతత ఉందో గుర్తుంచుకో. సాధ్యమైనంతవరకు, ఎవరికీ తలవంచకుండానే, మంచి అనుబంధాలు కలిగి ఉండు; నువ్వు సత్యాన్ని చెప్పేటప్పుడు స్పష్టంగా, నెమ్మదిగా చెప్పు; అలాగే, ఇతరులు ఏది చెప్పినా శ్రద్ధగా విను, వాళ్లు ఎంత మొద్దులూ, మూర్ఖులూ ఐనా; ఎందుకంటే, ప్రతి వ్యక్తికీ ఒక కథ ఉంటుంది. గట్టిగా అరిచి, దురుసుగా మాటాడే వాళ్ళని తప్పించుకు తిరుగు; వాళ్ళు నీ మనస్సుకి క్షోభ కలిగిస్తారు. ఇతరులతో అస్తమానం నిన్ను…
-
స్వరకర్త… W H ఆడెన్, అమెరికను కవి
మిగతావాళ్ళందరూ అనువదిస్తారు: ఒక చిత్రకారుడు దృశ్యమానప్రపంచాన్ని అంగీకరించినా, తృణీకరించినా; తనజీవితంలోకితొంగిచూచి, మధించి వెలికి తీస్తాడు ప్రతిబింబాలని ఒక కవి …వాటితో మమేకమవడానికో, విభేదించడానికో; జీవితం నుండి కళ … అతి కష్టమైన అనుకరణ మధ్యనున్న ఖాళీలను పూరించడానికి మనమీద ఆధారపడుతూ; కేవలం నీ స్వరాలొక్కటే అచ్చమైన సహజ సృష్టి, నీ పాట ఒక్కటే అపురూపమైన కానుక; ఓ ఆనందమా! నీ సన్నిధిని మాకు కలుగజెయ్యి, సాష్టాంగపడేలా పులకరింతలు కలుగజెయ్యి, మా మౌనాలపై, సందేహాలపై దాడిచెయ్యి; ఓ అజ్ఞాత గీతికా!…
-
చావుతప్పిన వాళ్ళు… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
సందేహించనక్కరలేదు, వాళ్ళు త్వరలోనే కోలుకుంటారు ఒత్తిడీ, దిగ్భ్రాంతీ వాళ్ళు నత్తిగా, అర్థంలేకుండా మాటాడేట్టు చేశాయి. “వాళ్ళకి మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళాలనిపిస్తుం” దనుకొండి సందేహం లేదు గాట్లుపడ్డమొహాలతో, నడవడం నేర్చుకుంటున్న ఈ సైనికులకి. వాళ్ళు త్వరలోనే తమ నిద్రలేని రాత్రుళ్ళగురించి మరిచిపోతారు; చనిపోయిన మిత్రుల ఆత్మలకు భయంతో మోకరిల్లడం కూడా, హత్యలతో రక్తమోడుతున్న వాళ్ళ కలలూ, వాళ్ళ గర్వాన్ని సమూలంగా హరించిన మాహా యుద్ధం గురించి ఇప్పుడు మహా గొప్పగా చెప్పుకుంటారు. విచారంతోనూ, ఆనందంగానూ యుద్ధానికి వెళ్ళేరు పురుషులు…
-
శరణు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
తలపండిన నా వయసు ఓటమిలో శృతితప్పుతున్న నా నాడి సవ్వడులలో బిగిసిన నా పిడికిలి సందుల్లోంచి జారుతూ ఇసుకరేణువులైపోయిన నా ఆశలతో నా నేరాల బానిసత్వంలో ఇంకా నేను పాడగలిగితే, నేను స్వేచ్ఛాజివినే! ఎందుకంటే, నా పాటతో, నా మనసుకి ఒక ఆశ్రయాన్ని కల్పించగలను… నగిషీమాటల మందిరం నిర్మించగలను … అదే నాకు క్షణికమైన కైవల్యం. . సారా టీజ్డేల్ August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి Refuge…
-
XXXI ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
భవిష్యత్తు ఎన్నడూ మాటాడలేదు; మూగవాళ్ళలా కనీసం ఎన్నడూ చేష్టలతోనో, సంజ్ఞలతోనో నిగూఢమైన భావి విషయాలను తెలియపరచనూలేదు. కానీ, సరియైన సమయం వచ్చినపుడుమాత్రం వాటిని అక్షరాలా ఆచరణలో చూపిస్తుంది…వాటిని తప్పించుకుందికీ, ప్రతిక్షేపించడానికీ చెయ్యగల అన్ని అవకాశాలని ముందే వమ్ముచేస్తూ. సంపదలైనా, సర్వనాశనమైనా రెంటిపట్లా దానికి ఒకే అనాశక్తత; విధి దానికి ఆదేశించిన శాసనాన్ని తు.చ. ఆచరించడమే దాని కర్తవ్యం. . ఎమిలీ డికిన్సన్ December 10, 1830 – May 15, 1886 అమెరికను…
-
అకాల మృత్యువు… హార్ట్ లీ కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి
ఆమె వేకువ తుషారంలా హరించిపోయింది సూర్యుడు ఇంకా పైకి ఎగబ్రాకక ముందే; ఆమె జీవించింది ఎంత స్వల్పసమయమంటే, నిట్టూర్పు అంటే అర్థం ఏమిటో ఆమెకి తెలీదు. గులాబి చుట్టూ దాని సువాసన వ్యాపించినట్టు ఆమె చుట్టూ ప్రేమ తేలియాడింది. గుట్టుచప్పుడుకాకుండా, మృత్యువు సమీపిస్తోందన్న స్పృహ, భయంలేకుండా,ఆమె పెరిగింది. ప్రేమే ఆమె సంరక్షకురాలిక్కడ కానీ, ప్రేమే మృత్యువుముందు తలవాల్చింది ప్రేమకి దయ కలిగినప్పుడు భయం దేనికి, కానీ, మృత్యువు అంత దయతో ఉంటుందా? . హార్ట్ లీ కోలరిడ్జ్…
-
డబ్బు… ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి
మూడునెలలకొకసారి, కదూ, డబ్బు నన్ను దెబ్బలాడుతుంటుంది “ఎందుకిక్కడ నన్ను ఇలా వృధాగా పడి ఉండమంటావ్? నువ్వు ఇంతవరకు ఎరుగని వస్తువుల్నీ, సుఖాన్నీ ఇవ్వగలను. మించిపోయిందిలేదు ఇప్పుడైనా కొన్ని చెక్కులు సంతకం చెయ్యి.” నేను మిగతావాళ్ళవంక చూస్తాను, వాళ్ళడబ్బుల్తో ఏమిటిచేస్తారా అని. మేడమీద అయితే ఖచ్చితంగా డబ్బు దాచుకోరు. బహుశా ఈపాటికి, కారూ, పెళ్ళామూ, రెండో ఇల్లు ఉండి ఉంటుందేమో జీవితంలో డబ్బు పాత్ర చాలానే ఉందని ఒప్పుకోవాల్సిందే. – నిజానికి, తరిచిచూస్తే, వాళ్ళలో ఒక సామాన్యధర్మం కనిపిస్తుంది:…
-
పేరు… అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి
నా పేరుతో నీ కేమిటి అనుబంధం? అది సమసిపోతుంది దూర తీరాలలో ఎక్కడో ఏకాంతంగా దొర్లుకుంటూ వెళ్ళి ఒడ్డున పగిలైన అలలా… లేదా, చీకటి కీకారణ్యంలో ఒక కేకలా. నీ వాళ్ళ సమాధులమధ్య ఒక స్పందనలేని గీతగా మిగులుతుంది; అర్థం కాని భాషలో గజిబిజిగా అల్లుకున్న ఒక సమాధి లిపిలా అదేమిటి మరి? ఎప్పుడో గతించిన కాలం, ఎన్నో పిచ్చి కలలమధ్య తప్పిపోయిన ఒక కల, జ్ఞానదేవత కటాక్ష వీక్షణాలు జ్ఞాపకాలుగా నీ ఆత్మపై ప్రసరించవులే. ఒకవేళ…