An Open-ended Poem… Ravi Verelly, Telugu, Indian
Under the
Unwinking sky…
Drips beautiful vitriolic spangles
Occasionally
Through its leafy canoes…
The cocoanut
As if it quenches the thirst
of the whole village…
croons lazily like a well-lubed cart
the pulley.
With the airs of
pulling the hiding sky by its tresses
and siphoning it off from the bottom
Looks arrogant
the insolent pail.
Looking at its reflection in the puddle-mirror
preens leisurely its feathers
the little sparrow.
Letting grace to lend a helping hand
To hold the pot in the sickle of her arm
Poor me, breathes heavy
The new bride.
As if to replay the sounds
of bubbling springs to the sky,
like the open-ended poem of Ismail,
stands there
our village well!
.
Ravi Verelly
తెరుచుకున్న పద్యం
.
రెప్పవేయని
ఆకాశం క్రింద
ఆకు దోనెల నుంచి
అప్పుడప్పుడు
అద్దాల బొట్టుబిళ్ళలు రాల్చే
కొబ్బరిచెట్టు
ఊరి దాహాన్నంతా తనే మోస్తున్నట్టు
కందెనేసిన నిండు బండిలా
మెత్తగా మూల్గే
గిలక
అట్టడుగునదాగున్న
ఆకాశం జడలుపట్టుకుని
పైకితోడిపోసినంత గర్వంగా
బొక్కెన.
జాలారు అద్దం అంచున
సింగారించుకుంటూ
ఊరపిచ్చుక.
వయ్యారాన్ని ఓ చెయ్యి వెయ్యమని
బిందెను చంకనెత్తుకోడానికి
ఆపసోపాలు పడుతూ
కొత్తకోడలు
అదిగో—
నీటి ఊట నిశ్శబ్దాన్ని
ఆకాశానికి వినిపించడానికన్నట్టు
ఎప్పుడూ తెరుచుకునే ఉండే
ఇస్మాయిల్ పద్యంలా
మా ఊరి గంగబావి.
(తలకు ఆకాశం పగిడీ చుట్టుకుని, వేళ్ళకి భూమిని తొడుక్కున్న చెట్టు…
ఇస్మాయిల్ గారి కోసం. 25 నవంబరు ఆయన వర్ధంతి )
.
రవి వీరెల్లి
ప్రకటనలు