వర్గం: అనువాదాలు
-
వార్ధక్యం రావడం అంటే… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి
“వార్ధక్యం రావడం” అంటే ఏమిటి? ఆకారంలోని శోభనీ, కళ్ళలోని మెరుగునీ కోల్పోవడమా? అందం దాని అలంకారాలని కోల్పోడమా? అవును, కానీ అవొక్కటే కాదు. మన వికసనము కోల్పోవడమే కాదు, మన శక్తి … మన సత్త్వము క్షీణించినట్టు అనిపించడమా? లేక, మన శరీరంలోని ప్రతి అంగమూ బిరుసెక్కినట్టనిపించి, ప్రతి చర్యలోనూ నైపుణ్యం తగ్గి, ప్రతి నరం నీరసంగా కొట్టుకోవడమా? అవును, ఇంతే కాక, చాలా! కానీ, “అయ్యో, నేను యవ్వనంలో ఇలా అవుతుందని ఊహించ లేదే!” అని…
-
A Daily… Palaparthy Indrani, Telugu, Indian
It won’t take a wink thro’ the night. At the day break… It comes carrying news On each page, as Crisp as a deep-fried Papad, Astringent as Neem leaves chutney, Round as black-gram bolus, Resinous as sesame candy. It sleeps For the whole day. There will be cobwebs On every one of its pages And…
-
An Afternoon in Agra… V. Chinaveerabhadrudu, Telugu, Indian
That was an afternoon in Agra. As the late Sagittal sun Prevailed up the welkin, Like the tang of tarty fruit, There was a mild bite in it. That ageless dream… Taj Mahal … looked as if Somebody had set it over this earth only yesterday. The marmoreal minars were Splendid under the hoary…
-
చిందరవందర గది… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి
ఈ గది ఎవడిదో గాని వాడు సిగ్గు పడాల్సిందే! వాడి లాగు లాంతరుకి వేలాడుతోంది. వాడి రెయిన్ కోటు అప్పటికే బట్టల్తో నిండిపోయిన కుర్చీలో ఉంది ఆ కుర్చీ తడి తడిగా ముక్క కంపుగొడుతోంది. వాడి చిత్తుపుస్తకం కిటికీ తలుపుపడిపోకుండా అడ్డం పెట్టి ఉంది వాడి స్వెట్టరు నేలమీదకి విసిరేసి ఉంది. వాడి రుమాలూ, ఒక Ski, TV క్రింద ఉన్నాయి వాడి పేంట్లు ఆశ్రద్ధగా తలుపుకి వేలాడదీసి ఉన్నాయి. వాడి పుస్తకాలు బీరువాలో కుక్కేసినట్టున్నాయి, వాడి…
-
జీవితం హాయిగా ఉంది… లాంగ్ స్టన్ హ్యూజ్, అమెరికను
నేను నది ఒడ్డుకి వెళ్ళేను, ఒడ్డున కూచున్నాను; ఆలోచించడానికి ప్రయత్నించేను గాని కుదరలేదు. అందుకని అందులోకి గెంతి మునకవేశాను. ఒక సారి పైకి వచ్చి గట్టిగా అరిచేను రెండో సారి పైకి వచ్చి బిగ్గరగా అరిచేను! ఆ నీళ్ళేగాని చల్లగా ఉండి ఉండకపోతే అందులో మునిగి చచ్చిపోయేవాడిని. కానీ ఆ నీళ్ళు చల్లగా ఉన్నాయి! చాలా చల్లగా! * నేను ఎలివేటరు ఎక్కేను క్రిందనుండి పదహారో అంతస్థుకి. నా బిడ్డ గురించి ఆలోచించేను. ఒక్కసారి కిందకి…
-
జీవితంలో చెడు చాలా చూశాను … యూజెన్యో మోంటేల్, ఇటాలియను కవి
జీవితంలో చెడు చాలా చూశాను; ఎండిందనుకున్న దొంగయేరు అదాత్తున పొంగినట్టు, ఎండకి మాడిపోయిన ఆకులు ముడుచుకుపోయినట్టు, పరిగెడుతున్న గుఱ్ఱం దబ్బున కూలబడినట్టు. మంచి అంతగా ఎరుగను; దైవం ఎందుకు నిర్లిప్తంగా ఊరుకుందా అన్న ఆశ్చర్యం తప్ప; అది పగలే నిద్రలో మునిగిన శిలావిగ్రహం లాటిది ఎక్కడో గగనతలంలో ఎగురుతున్న డేగలాంటిది. . యూజెన్యో మోంటేల్ (12 October 1896 – 12 September 1981) ఇటాలియను కవి . . Evil I’ve often encountered in…
-
రుబాయీ- XVI, ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి
ఒకటి తర్వాత ఒకటి పగలూ రాత్రీ ద్వారాలుగా ఉన్న ఈ పాడుబడ్డ సత్రంలో, చూడు, సుల్తానులు ఒకరి వెనక ఒకరు ఇక్కడ బసచేసిన ఆ గంటా, ఘడియా తమ వైభవాల్ని ప్రదర్శించి, ఎవరిత్రోవన వాళ్ళు పోయారో! . ఉమర్ ఖయ్యాం 18 May 1048 – 4 December 1131 పెర్షియను కవి .. Rubaiyat – XVI . Think, in this battered Caravanserai Whose doorways are alternate Nights and Day,…
-
సూక్తి … మార్షల్, ప్రాచీన రోమను కవి
గతకాలపు కవులని తీసిపారెస్తావు జీవితం బాగులేదని నిందిస్తావు. నీ స్తోత్రాలకి ఒక దణ్ణం; నీ పొగడ్తలు పడి చావవలసినంత గొప్పవేమీ కావు . మార్షల్ క్రీ. శ. 1 వ శతాబ్ది. ప్రాచీన రోమను కవి . Epigram . You puff the poets of other days, The living you deplore. Spare me the accolade: your praise Is not worth dying for. Martial Marcus Valerius Martialis…
-
II… లావొ జూ సంకలనం (చీనీ) నుండి
ప్రపంచానికి అందాన్ని అందంగానే తెలుసు అందుకే అక్కడ కురూపితనం కూడా ఉంది. ప్రపంచానికి మంచిని మంచిగానే తెలుసు అందుకే అక్కడ చెడు కూడా ఉంది. అస్తిత్వమూ, శూన్యమూ ఒకదాన్నొకటి సృష్టించుకుంటాయి కష్టమూ, సుళువూ ఒకదాన్నొకటి నిర్వచించుకుంటాయి, పొడవూ, పొట్టీ ఒకదానికొకటి హద్దులేర్పరచుకుంటాయి, ఎత్తూ, పల్లమూ ఒకదానిమీద ఒకటి ఆధారపడతాయి. గళమూ, స్వరమూ ఒకదాన్నొకటి శృతిలో ఉంచుకుంటాయి, పాతదీ, కొత్తదీ ఒకదాన్నొకటి అనుసరిస్తాయి, విజ్ఞులు కర్మకి అకర్మ ద్వారా కట్టుబడి ఉంటారు, మౌనంద్వారా చెప్పదలచుకున్నది వ్యక్తపరుస్తారు. ఒక రీతిలో…
-
బందీ… లిలీ ఏ లాంగ్, అమెరికన్ కవయిత్రి
“నేను” అనబడే ఈ ఒంటరి జైలులో ఈ సృష్టి ప్రారంభానికి ముందునుండీ బందీని. నేను విడుదలయేసరికి, తెల్లని నక్షత్రధూళితో, ఈ లోకాలన్నీ పరిగెత్తాల్సిందే, మొదట పరిగెత్తి నట్టు. నేను గోడకేసి నాచేతులు బాదుకుంటాను, తీరా చూస్తే కొట్టుకుంటున్నది నాగుండెకే. ఎంత గుడ్డితనం! ఏమీ సంకెల! . లిలీ ఎ లాంగ్ (1862 – 1927) అమెరికను కవయిత్రి . Immured . Within this narrow cell that I call “me”, I was imprisoned…