వర్గం: అనువాదాలు
-
దేవదూతలు… ఎడ్మండ్ స్పెన్సర్, ఇంగ్లీషు కవి
భగవంతుడు నిజంగా పట్టించుకుంటాడా? ఇంత హీనమైన మనుషులనీ, వాళ్ళ దుర్మార్గాలనీ క్షమించి ఉపకారం చెయ్యడానికి ఇంకా ప్రేమ మిగిలి ఉంటుందా? ఉంది. లేకుంటే, మనుషులు మృగాలకంటే కనికిష్టంగా తయారై ఉండేవారు. ఆహ్! ఏమని చెప్పాలి తన సృష్టిని ప్రేమించే మహోన్నతుడైన ఆ దేవుని కరుణ గురించి! అతని అనుగ్రహాలన్నీ దయారసపూరితాలై ఉంటాయి. అందుకే తనదూతలని అన్నిచోట్లకీ సేవచెయ్యడానికి పంపిస్తాడు: క్రూరమైన మనిషినీ… అంతే క్రూరమైన అతని శత్రువునీ. మనలో సహాయంకోసం అర్రులుచాచేవారికి బాసటగా ఎన్నిసార్లు వారు తమ…
-
మృగరాజు అస్థిపంజరం… ఛార్లెస్ టెన్నిసన్ టర్నర్, ఇంగ్లీషు కవి
ఓ మృగరాజా! ఎన్నాళ్లయింది నువ్విలా రక్తమాంసాలు లేకపడి ఉండి? నీ భీకరమైన ఆకలి చూపులను ఆక్సర్షిస్తున్నదేది? మొదట రాబందులు వాలేయి; తర్వాత క్రిములూ, వేడీ, గాలీ, వర్షమూ అనుసరించేయి; వాటితోబాటే ఉష్ణమండలపు తీవ్రతలూనూ… అవి నిన్ను విడిచిపెట్టేయేమో నాకు తెలీదు; ఎన్నాళ్ళు నీ భారీ శరీరం కుళ్ళిపోయి పడి ఉందో, చివరకి ముక్కముక్కలై నాలుగుచెరగులా వెదజల్లబడిందో, లేక, తుఫానులై ఎగసిన ఇసుక వాటిని తిరిగి భూమిలోకి నెట్టేసిందో, కాని, ఒకప్పుడు తీవ్రమైన ఆగ్రహం ప్రదర్శించిన నీ విశాలమైన…
-
సానెట్… మార్క్ అలెగ్జాండర్ బైర్డ్, స్కాటిష్ కవి
చెట్టునుండి జారుతున్న ఎండుటాకులాగా గాలికి ఎగరగొట్టబడ్డ గడ్డిపరకలాగా ఒడ్డునుండి ఒడ్డుకీ, కోననుండి కోనకీ పరిగెడుతూ నా హీన స్వరంతో ఆమెను గెలవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇద్దరు దేవతలు నన్ను నడిపిస్తున్నారు; ఒకరు కబోది, అహంకారంతో పెంచబడిన బిడ్డ; రెండోది సముద్రపు నురుగుకి పుట్టిన పడుచు, దాని రెక్కలతో డాల్ఫిన్ కన్నా తేలికగా ఎగురుతుంది. ఇసకను దున్ని గాలిలో విత్తనం జల్లే మనిషికి ఎప్పుడూ సుఖం ఉండదు; పిల్లవాడి ఉపదేశమూ,అంధుడి మార్గదర్శనంలా మనసులో ఒక వెర్రి కోరిక ఉంచుకుని నిప్పులోకూడా ఆడదాని…
-
స్వాప్నికులు… వాల్టర్ ఎడోల్ఫ్ రాబర్ట్స్, వెస్ట్ ఇండియన్ కవి
మనం ఈ ప్రపంచపు అంతులేని స్వాప్నికులం ఎంత కష్టమైనా వృధా ఐనా మన నావలు ప్రయాణించవలసిందే అన్నిసముద్రాలూ కలిసేచోట్లు మనల్ని సాహసానికి పురుకొల్పుతాయి మనమీంచి ఆ చిట్ట చివరి కెరటం పొర్లినపుడుకూడా మళ్ళీ మనం పునరుజ్జివిస్తాం. మనల్ని జయాపజయాలలోంచి ఉద్ధరించగల ఆవేశాన్ని దేవతలు మనకు అనుగ్రహించారు. మనం బంగారులేళ్ళను పట్టుకుందికో, లేక ఏ “శ్వేత”రాణి ప్రేమను గెల్చుకుందికో, కొత్తలోకాలని గెలవడానికో పుట్టలేదు. అయినప్పటికీ, వనదేవతల సాక్షిగా మనం శాంతికోసమూ పుట్టలేదు! కాల,సౌందర్యాలు హరించలేని అమూల్యవస్తువు మనదగ్గరుంది: వినాశకరమైన…
-
Spiritless Life ….. Anveeksha, Telugu, Indian
After calling it a day, Oblivious of the smiles Of the inviting jasmines in her plait, He enters home from office Caressing his valentine… the cellphone Serving him dutifully Coffee, breakfast and lunch To the hour From morning to evening Yet, without turning her eye off the TV, She continues her soap operas in her…
-
సగటు మనిషి … జేమ్స్ మన్ గమ్ రీ, ఇంగ్లీషు కవి
ఒకప్పుడు, యుగాలు గడవకముందు ఒక మానవుడు ఉండేవాడు. అతనెవడూ? మర్త్యుడు! అతన్ని నువ్వు ఎలా చిత్రించినా అచ్చం నీలాగే ఉంటాడు. అతనెక్కడపుట్టేడో తెలీదు, అతనెక్కడ మరణించేడో కూడా తెలీదు, అతని పేరు భూమ్మీంచి తుడుచుకుపోయింది; అదొక్క సత్యమే మిగిలి ఉంది. సుఖమూ దుఃఖమూ, ఆశా, భయమూ అతని మనసులో ఒకదాని వెనక ఒకటి నిలిచేయి; అతని బ్రహ్మానందం, విపత్తూ, నవ్వూ, కన్నీరూ, సర్వస్వమూ తెర మాటున మరుగుబడ్డాయి. అతని గుండె చప్పుడూ వడీ, నీరసించిన శరీరం,…
-
షేక్స్పియర్… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి
(ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరము) ఇతరులు మా ప్రశ్నలకి బందీలైపోతారు. నువ్వు స్వతంత్రుడివి. జ్ఞానశిఖరానివై, మేము పదే పదే ప్రశ్నలడుగుతున్నా నువ్వు నవ్వుతూ నిశ్చలంగా ఉంటావు. నువ్వు తారకలకే నీ ఘనతని పరిచయం చేస్తావు. ధృఢంగా ఒక పాదాన్ని సముద్రంలో ఉంచి అత్యున్నత స్వర్గాన్ని నీ నివాసం చేసుకుని, నీ పాదాల చెంతనున్న మేఘవలయాలని మాబోటి మర్త్యుల నిరర్థకమైన వెతుకులాటకి వదిలెస్తావు. స్వయంగా నేర్చుకుని, స్వయంగా తరచిచూచి, స్వయంగా సాధించి, ఆత్మగౌరవం సంపాదించుకుని…
-
దేవతలతో గుసగుసలు… సామ్యూల్ లవర్, ఐరిష్ కవి
(ఐర్లండులో నిద్రలోనవ్వేపిల్లలు దేవదూతలతో గుసగుసలాడుతుంటారనే నమ్మకం ప్రచారంలో ఉంది. మనకి కూడా అలాంటి నమ్మకం ఉంది.) . ఓ బిడ్డ నిద్రపోతోంది; తల్లి మాత్రం శోకిస్తోంది; ఎందుకంటే ఆమె భర్త దూరంగా ఎక్కడో సముద్రం మీద ఉన్నాడు ఆ జాలరి ఇంటి చుట్టు పక్కల తుఫాను చూడబోతే తీవ్రరూపం దాలుస్తోంది. ఆమె రోదిస్తూ, “ప్రియా, డెర్మాట్, త్వరగా ఇల్లు ఏరుకో!” అని. ఆమె దేముడికి అనేక ప్రార్థనలు చేస్తుంటే బిడ్డ ఇంకా నిద్రపోతూనే ఉంది, తన కాళ్ళు…
-
ఉదయం… సముద్రపొడ్డున… ఫ్రాన్సిస్ ఏన్ కెంబుల్, ఇంగ్లీషు కవయిత్రి
(ఈ కవితలో సూర్యుడు, గుర్రాలు అన్న అంశం గమనించండి. ఆమెకు భారతీయ ఇతిహాస విషయాలు కొంతవరకైనా తెలుసునని అనిపిస్తుంది. ఈ కవిత కళ్ళకు కట్టినట్టు చిత్రించిన అపురూపమైన భావ చిత్రం.) నీ కళ్ళమీద ఈ రెండు ముద్దులతో వాటి మీద పేరుకున్న నిద్రని కరిగిస్తాను. లే ! ప్రియతమా, చూడు అప్పుడే సూర్యుడు తన బంగారు హస్తాన్ని తెల్లని ఆ సముద్రపు మేనిపై జాచి నిమురుతూ నవనవోన్మేషమైన తరగలమీంచి అద్భుతంగా పైకి లేస్తూ, విశాలంగా పరుచుకున్న సైకత తలాన్ని…
-
మరణానంతరం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఇపుడు నా పెదాలు సజీవంగా ఉన్నప్పటికీ అవి చెప్పవలసిన మాటలు చెప్పకూడదు నేను మరణించిన పిదప నా ఆత్మకు నేనేం చెప్పాలనుకున్నానో గుర్తుంటుందా? ఒక వేళ దానికి గుర్తున్నా, ప్రియతమా, వాటిని నువ్వు గణించవు; ఎందుకంటే, ఇప్పుడు అవి చెప్పకూడదు అప్పుడు నువ్వు వాటిని వినలేవు. . సారా టీజ్డేల్ August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి . After Death Now while my lips are living …