వర్గం: అనువాదాలు
-
Towards Life… Kasi Raju, Telugu, Indian
Contriving loneliness For some unknown reason, You sit somewhere idling away the evening Then the man within begins A winter session with the man without. There will only be endless deliberations But never any worthwhile agreements reached. As you continue with your search You stumble upon your vine of success. You try to pull it…
-
Trash… Yakoob, Telugu, Indian
The city is an obsolete, redundant Unintelligible hackneyed metaphor Spite of years of residence, the land under my feet Did not naturalize me. Nothing looks pleasant to the eyes; Nor anything sounds sonorous to the ears. The streets as streets and houses as houses Continue to exist as they have been Neither Life comes to…
-
కొండవాలు… ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను కవి
ఆ ఎల్మర్, హెర్మన్, బెర్ట్, టామ్ , ఛార్లీ ఏరీ? మనసు నిలకడలేనివాడు, భుజశాలి, చమత్కారి, తాగుబోతు, తగవులమారి ఏమయ్యారు? అందరూ, ఇపుడందరూ కొండవాలులో నిద్రిస్తున్నారు. ఒకడు జ్వరంతో పోయాడు ఒకడు గనిలో కాలిపోయాడు ఒకడు పోట్లాటలో మరణించాడు ఒకడు జైల్లో చనిపోయాడు ఒకడు భార్యాపిల్లలకై శ్రమిస్తూ వంతెనమీంచి జారిపోయాడు… అందరూ, ఇపుడందరూ నిద్ర, దీర్ఘనిద్రపోతున్నారు కొండవాలులో. ఎలా, కేట్, మేగ్, లిజ్జీ, ఎడిత్ ఏరీ? దయాళువు, అమాయకురాలు, కోపిష్టి, గర్విష్టి, ఎప్పుడూ హాయిగా ఉండే వాళ్ళేరీ? ఒక్కొక్కరూ,…
-
తుమ్మెదా- కవీ … జార్జి ఆర్నాల్డ్, అమెరికను కవి
తుమ్మెద అందమైన రెక్కలమీద తేలిపోతుంది తను ప్రపంచం గురించి ఏమీ పట్టదు తనకి ఒక్క తేనెటీగ జోలపాట తప్ప పువ్వులలో మకరందం తప్ప; ఈ రోజు లిల్లీ మధుకలశం ప్రేమగా గ్రోలితే రేపు,గులాబినీ అంతప్రేమగానూ ఆనుతుంది. కవి అందమైన కలలమీద తేలియాడతాడతను ప్రపంచం గూర్చిన ధ్యాసే లేదతనికి ఒక్క యువతుల నవ్వులూ పాటలూ తప్ప వాళ్ళ అధరామృతాల ఆలోచనలు తప్ప. ఈ రోజు సొగసైఅన ఎడిత్ ని గాఢంగా ప్రేమిస్తే రేపు,కావికనుల ఇసాబెల్ ని అంతగానూ ప్రేమిస్తాడు.…
-
బడిపిల్లడు… విలియం బ్లేక్, ఇంగ్లీషు కవి
ఎండాకాలంలో ఉదయాన్నే లేవడం నాకిష్టం ఎందుకంటే ప్రతి చెట్టుమీంచీ పిట్టలు పాడుతుంటాయి; దూరంగా వేటగాడు తన బూరా ఊదుతుంటే, ఇక్కడ స్కైలార్క్ నాతో శృతి కలుపుతుంది అబ్బ ఎంత బాగుంటుందో వాటితో సావాసం. కానీ, ఉదయాన్నే బడికెళ్ళమంటేనే అబ్బ, ఉన్న ఉత్సాహమంతా నీరుగారిపోతుంది. పిల్లలందరూ రోజంతటినీ తీక్షణమైన ముసలి చూపుల పరివేక్షణలో ఉస్సురని నిట్టూరుస్తూ, విసుగ్గా గడపాలి. ఒక్కోసారి నేను నిస్సత్తువతో వాలి కూచుంటాను బడి ఎప్పుడు పూర్తవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తాను పుస్తకాలు చదవడంలోనూ ఆనందం…
-
శకటాల సంగీతం… తూ ఫూ, చీనీ కవి
శకటాలు ముందుకి కదులుతూ కిర్రు మంటున్నాయి గుర్రాలు మంద్రంగా శకిలిస్తూ మురుస్తున్నాయి నిర్బంధ సైనికుల నడుములకి ధనుర్బాణాలు వేలాడుతున్నాయి. వాళ్ళ తలిదండ్రులూ, భార్యాపిల్లలూ వీడ్కోలివ్వడానికి పరిగెడుతున్నారు, ఎంత దుమ్ము రేగుతోందంటే, గ్జ్యాన్యాంగ్ వంతెన కనిపించడం లేదు. వాళ్ళు బట్టలు చించుకుని, కాళ్లు నేలకు బాదుతూ, ఏడుస్తూ త్రోవకి అడ్డుపడుతున్నారు వాళ్ళ రోదనలు మింటికెగసి మబ్బుల్ని తాకుతున్నాయి. దారినపోయే దానయ్య ఒకడు సైనికుణ్ణడిగాడు “ఎందుకేడుస్తున్నా”రని సైనికుడు అన్నాడు: ఈ నిర్బంధపు సైనిక సేవ తరచు జరుగేదే. పదిహేనేళ్ళకు చాలా…
-
అస్వస్థతతో మంచంపట్టినపుడు… జాన్ మెయిస్ ఫీల్డ్, ఇంగ్లీషు కవి
పగలల్లా గాలి రొద వింటూనే ఉన్నాను అది ఏమి చెప్పదలుచుకుందో దానితో సహా. రాత్రల్లా గాలి చేసిన చప్పుళ్ళు విన్నాను పోరాటానికి పోతూ అదిచేసిన హాహాకారాలతో సహా. గాలి ఆగగానే వర్షమూ వర్షం ఆగగానే గాలీ కొండమీద దాడి చెయ్య సాగేయి అది మాత్రం నిశ్చలంగా ఉంది. పగలల్లా సముద్రం నేలని స్థిరంగా ఉండనీలేదు, రాత్రల్లా నేలమీదకి సముద్రంలోని ఇసక అంతా పోగుపెడుతూనే ఉంది రాత్రంతా అది తెల్లగా మెరవడం చూశాను ఘోరమైన దాని జుత్తు విరబోసుకుని…
-
సానెట్ 73… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరము నువ్వు నాలో చూసే వయసు ఎలాంటిదంటే పేరుకి ఒకటి రెండు పండుటాకులు కొమ్మలకి వేలాడుతూ ఒకప్పుడు కలకూజితాలతో పులకించి, రాగహీనమై శీతకాలం రాగానే వణికే చెట్టులాటిది; నువ్వు నాలో చూస్తున్న సాంధ్యరాగం సూర్యాస్తమయం కాగానే చీకటిలో కలిసిపోయేటిది. మృత్యువుకి ప్రతిరూపమై, అన్నిటినీ కనుమరుగుచేసే చిమ్మ చీకటి దానిని అంచెలంచెలుగా కబళిస్తుంది. నువ్వు ఇపుడు నాలో చూస్తున్న వెలుగు యవ్వనపు చితాభస్మము మీద కనిపించే జిగి లాంటిది. మరణశయ్యమీద…
-
A Shriveled Memory… Praveena Kolli, Telugu, Indian
From the stack of memories A shriveled piece of paper Slipped by accident. When I tried to read as much I could By flattening it out, Eyes already brimming with tears Made it more blearier. Rubbing the eyes with left index finger When I tried to run the right underlining the letters The dampened paper…
-
ఒక సాయంత్రం … ఫ్రెడెరిక్ మానింగ్, ఆస్ట్రేలియన్ కవి
ఎవరూ చప్పుడు చెయ్యొద్దు, నా బాబు పడుకున్నాడు రొదచేస్తున్న ఓ వడి గాలీ! నువ్వు కూడా హుష్! ధారాపాతంగా కురుస్తున్న వర్షమా! నువ్వూ హుష్! రేపు పొద్దుపొడిచేదాకా బిడ్డని నిద్రపోనీండి. మీరందరూ నెమ్మది! ఇకనుండి జీవితమంతా అతను మూటగట్టుకునేది దుఃఖమే; నవ్వులుండాల్సిన చోట కన్నీరుంటుంది కనీసం నిద్రలోనైనా అతనికి శాంతి నివ్వండి. హుష్ అంటుంటే?! జబ్బుతో బలహీనంగా ఉన్నాడు అతని ఏడుపులో కొంతపాలు వాళ్ళమ్మతో పోనీండి. అదిగో వడిగాలీ, హుష్! నీ రొద కొంచెం ఆపు! ఎవరూ…