Trash… Yakoob, Telugu, Indian
The city is an obsolete, redundant
Unintelligible hackneyed metaphor
Spite of years of residence,
the land under my feet
Did not naturalize me.
Nothing looks pleasant to the eyes;
Nor anything sounds sonorous to the ears.
The streets as streets and houses as houses
Continue to exist as they have been
Neither Life comes to life over phones
Nor spills into the greetings exchanged, and
No alluvium collects into camaraderie
With a strange, exotic, pronunciation
Words reek of burnt rice;
Sweet artful rhetoric of promises
Leaks like cracked water pipes,
Blows away like withered petals.
City blatantly patents ersatz civility
Like the shrill moans discernible behind suppressed wails
The City tries to survive…
Seeking some space amidst huddle of structures.
.
Yakoob
Yakoob
ట్రాష్
—
అరిగిపోయిన పాత ప్రతీకలా
అవసరం లేని, ఎంతకీ అర్థం కాని పదబంధంలా నగరం.
ఇన్నాళ్ల తర్వాత కూడా కాళ్ళకింది భూమిలో
‘మనతన’మేదీ అంటడంలేదు.
కళ్ళకేదీ హాయినివ్వడం లేదు.
చెవికేమీ ఇంపుగా విన్పించడమే లేదు.
వీధులు వీధులుగా, ఇళ్లు ఇళ్ళుగా
కేవలం అవి ఉన్నట్టుగానే వుంటున్నాయి.
ఫోన్లలోకి ప్రాణమేదీ లేచిరావడం కానీ
పలకరింతల్లోకి జీవితం ఒలికినట్లు గానీ
సహవాసాల్లోకి , సంబోధనల్లోకి సారవంతమైనదేదీ చేరడమే లేదు .
ఇంకేవో , ఏవేవో ,మరేవో
ధ్వనిస్తాయి మాటలు. మాడుచెక్కల్లాంటి మాటలు. సబ్సిడీల సరసమైనమాటలు. పగిలిన పైపులైన్ లాంటి మాటలు. వాడిన పూరేకులలాంటి మాటలు.
నగరం పేటెంట్ కృత్రిమమాటలు.
బిగబట్టిన ఏడుపులోంచి సనసన్నగా కీచుగా బయటపడిన మూలుగులా నగరం
నివసిస్తుంది, నిర్మాణాల మధ్య ఇంత చోటు వెతుక్కుని .
.
యాకూబ్
తెలుగు
భారతీయ కవి
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి