వర్గం: అనువాదాలు
-
బానిస… జేమ్స్ ఓపెన్ హీమ్ , అమెరికను కవి
వాళ్ళు బానిసని స్వేచ్ఛగా వదిలేసేరు, సంకెళ్లు త్రెంచి కానీ అతను పూర్వం ఎంత బానిసో, ఇప్పుడూ అంతే. ఇప్పటికీ అతనికి సంకెళ్లు ఉన్నాయి ఇప్పటికీ అతను అశ్రద్ధకీ, సోమరితనానికీ బానిసే ఇప్పటికీ ఇంకా అతనికి భయాలూ, మూఢనమ్మకాలూ, అజ్ఞానమూ, అనుమానమూ, అనాగరికతలనుండి బయటపడలేదు అతని బానిసత్వం అతని సంకెళ్లలో లేదు అతనిలోనే ఉంది వాళ్ళు స్వతంత్రుడిని మాత్రమే సంకెలలనుండి విముక్తుణ్ణి చెయ్యగలరు కానీ నిజానికి ఆ అవసరం లేదు… స్వతంత్రుడు ఎప్పుడూ తనని తాను విముక్తుణ్ణి చేసుకుంటాడు. .…
-
ఏ శపధాలూ చెయ్యొద్దు… గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి
నేనోసారి శపథం చేశాను, ఒక్కటంటే ఒక్కటి. అప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను, ఒంటరిగా. నాకు బాగా ధైర్యం వచ్చినపుడు ఇలా అనుకున్నాను: “ఈ నియమాలు నాకు చాలా సంకుచితంగా కనిపిస్తున్నాయి. అరిగిపోయిన ఆ పాత నియమాలకి నేనెందుకు కట్టుబడి ఉండాలి? ఈ రోజు నుంచీ బట్టలు మార్చినట్టు అన్ని నియమాలూ మార్చెస్తాను!” కానీ ఆ పాత అరిగిపోయిన నియమమే నాకు ఇప్పుడు సంకెలలా తగులుకుంది. అదిప్పుడు ఉల్లంఘించడం చాలా చాలా కష్టం; నానుండి దాన్ని వదుల్చుకోడం…
-
The Grieving Sea… Aranya Krishna, Telugu, Indian
The salty sea is but my embarrassing tears I harbored from public view; When I lean back On the pacific shore The long dried up moisture Of the eyes touches my hands Behind the bleary screens…. the Sea, Sundering itself into several currents Disturbed by the afflictions of the past. Breaks its head on the…
-
సానెట్… 104… షేక్స్పియర్
ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరము ప్రియ మిత్రమా, నాకు నువ్వెన్నాళ్ళయినా పాతబడవు నిన్ను మొదటిసారి చూసినపుడెలా ఉన్నావో అలాగే ఉన్నావు నీ అందం అలాగే ఉంది. అప్పుడే మూడు హేమంతాలు గడిచాయి అడవి గర్వించే వనసంపదని మూడు వేసవులై హరిస్తూ, అందమైన మూడు వసంతాలు మూడు పలిత శిశిరాలయేయి, ఈ నిరంతర ఋతుచక్రభ్రమణంలో నేను గమనించినది: మూడు వసంతాల సుగంధాలు మూడు మండు వేసవులలో నిందుకోవడం. నేను మొదటిసారి చూసిన దనం ఇంకా అలానే ఉంది.…
-
జీవితంలో వింత… హేరియట్ మన్రో, అమెరికను కవయిత్రి
ఎంత విశృంఖలంగా, మాంత్రికురాల్లా ఎంత వింతగా ఉంటుందీ జీవితం! చివరకి ఏ స్పందనలూ ఎరుగని రాయి కూడా కలగంటుంది, ఎప్పటినుండో పగిలడం ప్రారంభించి … ఒహోహో… ఎదగడం ప్రారంభిస్తుంది… ఆకుపచ్చని ఉడుపులు ధరించి. ఎంత స్పష్టమైన, వింతైన పదార్థం! ఇదేనా జీవితమంటే! ఓహ్, అది పిచ్చెంకించే మార్మికత. ఆనంద హేల, ధూళికణం ఎగిరి, ప్రాణంతో ఎగసి, అడుగులేసి పరిగెత్తుతుంది… రెక్కవిప్పి ఎగురుతుంది, అరుపులతో అంతరాంతరాలు కదిలిస్తుంది… ఓహ్… ఎక్కడెక్కడి లోతులు… ఏమిటీ అందమైన ఆహార్యం? వింత ముసుగు?…
-
Let it Rain!… Indra Prasad, Telugu, Indian
Let it rain! Like threads of gossamer Let it rain for years! Let the trees spring shoots Let flowers blossom Let the Hares hide in the shrubbery At the grating of pebbles. Let it rain! And let all secrets open up Let the soil hardened over decades Break and melt steadily. And moss these roads…
-
That girl…. Rama Sundari, Telugu, Indian’
I still remember the girl! Once when the faint drizzle And tender greenery made friendship I saw her humbly walking hugging the books Down the Jamun-trees alley; At the Andhra University out-gate, many times I saw her giving her hoarse voice chorus to Gaddar’s song; She used to sit all alone near the Martyr’s memorial…
-
Let me speak of a Poem… Bala Sudhakar Mauli, Telugu, Indian
A Poem is nowhere else But moves amongst us! When conversation Between two people Fails to flow freely Poem suffers silently Shuttling in the gullet; A poem convulsing Standing on the dais of Conflict and mistrust Between people of two regions, Is a disheartening spectacle; When the camaraderie In the faces of people disappears Poem,…
-
మాతృత్వం… ఏలిస్ మేనెల్, అమెరికను కవయిత్రి
ఒకామె తన ఒకే ఒక బిడ్డకై ఏడుస్తోంది. పోయి పదేళ్ళయింది, పురిటిలోనే. “ఏడవకు. స్వర్గంలో ఉన్నాడులే” అన్నారందరూ. ఆమె అంది కదా: ” అయినా సరే! “పదేళ్ళ క్రిందట పేగుతెంచుకున్న ఆ బిడ్డని ఇప్పుడు మరిచిపోలేను. కానీ, అయ్యో! పదేళ్ళ క్రిందట నిష్ప్రయోజనంగా ఒక అమ్మ, ఒక తల్లి జన్మించింది. ” . ఏలిస్ మేనెల్ అమెరికను కవయిత్రి . Alice Meynell . Maternity . One wept whose only child was dead…
-
One Has to Search… Mohana Tulasi Ramineni Telugu, Indian
On the wings of another night, or Under the umbrages of moon or Jasmine bowers Or, in the amative eyes of a sweetheart The threads of last night’s sentence Before the first rays of the day break. In deep ebony cloud-lets, or in dolorous sagas, In moments when sky seems the limit Or on the…