వర్గం: అనువాదాలు
-
The Prop… Indus Martin, Telugu, Indian
Ever since hutments cropped up around, Like a lone central column, The singular prop for our lives Has been that serrated sickle. To snap the umbilical cord That noosed around my neck In the hands of my granny What came handy was… that gory scalpel To prevent post parturition paralysis To the just yeaned dappled…
-
నేను మేఘాలని చూసేను… హెర్వీ వైట్, అమెరికను
నేను కొండల మధ్య మేఘాలని చూసేను కారు మొయిలు పింఛాలు జలధారలు కురిపిస్తూ… దిగువనున్న అడవుల నీలిమ లోయకే పరిమితమైపోయింది పక్వానికొచ్చిన పళ్ళ బరువుతో, గింజపట్టిన వెన్నులతో చెట్లు సంతృప్తిగా తడిసి ఆనందిస్తున్నాయి. నేను ఆ మైదానంలో సమాధులు చూశాను తొలితరం వాళ్ళు, నేలను పొదువుకుని అది చేసాగుకి లొంగేదాకా శ్రమించి శీతావాతాతపాల్ని ఎదిరించినవాళ్ళు; వాళ్ళ సంతానం, అదృష్టం కలిసివచ్చి ఇపుడు పెద్దలుకట్టిన భవంతుల్లో వసిస్తునారు నేను కొన్ని మరుగుపడ్డ పాటల్ని విన్నాను దారంట పోతూ…
-
నిర్వాణము… జాన్ హాల్ వీలాక్, అమెరికను కవి
నిదురపో… నేను ఎత్తైన స్వర్గ కవాటాలదగ్గర ఉన్నాను దిగువన మీ జాలీ కిటికీలపై మెరుస్తూ ఎదో గొణుగుతూ పరిభ్రమించే నక్షత్రాల మీద ప్రతి తారకా ఏదో కొంత గొప్పదనం ప్రతిబింబిస్తుంది అది నాకు తెలుసు. నేను నిన్ను ఎన్నడో మరిచిపోయాను; వెండిమువ్వలు చేసే చిరుసవ్వడి సంగీతంలా మాయమైపోయాను, సన్ననై, పలచబడి వినిపించని గీతంలా. నిదురపో… నేను ఎత్తైన స్వర్గ కవాటాలదగ్గర ఉన్నాను నిన్ను ఎంతో గాఢంగా ప్రేమించేను. . జాన్ హాల్ వీలాక్ September 9, 1886…
-
పవన వీణ … ఫ్రాన్సిస్ షా, అమెరికను కవయిత్రి
మా ఇల్లు చాలా ఎత్తుగా ఉంటుంది— అక్కడ పగలూ రాత్రీ పవనవీణ మోగుతూనే ఉంటుంది నగర దీపకాంతి మాత్రం దూరంగా… ఎక్కడో. మరి గాలి మోయించే వీణ ఎక్కడున్నట్టు? ఎత్తుగా ఎక్కడో రోదసిలోనా? లేక, సముద్రం మీదనా? అదిగో దూరాన ఉన్న నగరిలోని తిన్నని పొడవాటి వీధుల్లో సరళంగా ప్రసరించే వెలుగురేకలే దాని సంగీతపు స్వరతంత్రులు ఈ పవన వీణ చిరుగాలికి వినిపిస్తుంది: నగరపు కన్నీటి వెతలూ… సన్నగా మంద్రంగా, పసిపాపల ఏడుపులూ, రాజీపడలేని ఆత్మల మనోవేదనలూ…
-
జీవితం ముగిసిపోయినపుడు… ఇరోం షర్మిలా, మణిపురి కవయిత్రి
జీవితం ముగిసిపోయినపుడు ప్రాణహీనమైన నా శరీరాన్ని దయచేసి మీరు ఎత్తి తీసుకుపోయి ఫాదర్ కౌ బ్రూ పరున్న నేల మీద ఉంచండి. ఈ నిర్జీవ శరీరాన్ని మంటలలో బుగ్గిగా మార్చడం, మధ్యలో లేచినపుడు కర్రతో కొట్టడం, తలుచుకుంటే నాకు వెగటుపుడుతుంది పైనున్న తొక్క ఎలాగూ ఎండిపోతుంది దాన్ని నేలలోనే కుళ్ళనివ్వండి ఏ గనిలోనో ఖనిజంగా మారి భావితరాలకి ఉపయుక్తమవనీయండి నా జన్మభూమి కాంగ్లీ నుండి నేను శాంతి సుగంధాన్నై నలుదిక్కులా వ్యాపిస్తాను…
-
క్లో కోసం … విలియం కార్ట్ రైట్, ఇంగ్లీషు కవి
నిజానికి మనిషికి రెండు పుట్టుకలు:మొదటిది మేల్కొన్న ఇంద్రియస్పృహపై తొలి వెలుగు కిరణం పడినపుడు; రెండవసారి రెండు హృదయాలు కలిసినపుడు; మనజీవితాన్ని అప్పటినుండే లెక్కపెట్టాలి: మనం ఒకర్నొకరు ప్రేమించుకున్నప్పుడు మనిద్దరం కొత్తగా పుట్టినట్టే లెక్క. ప్రేమ మనకి సరికొత్త ఆత్మలను ప్రసాదిస్తుంది ఆ ఆత్మలలో కొత్త శక్తులను నింపుతుంది; అప్పటినుండి మనం ఒక కొత్త జీవితం మొదలెడతాము; మనం పీల్చే ప్రతి శ్వాస మనది కాదు, ప్రేమికది: వయసు భయపెట్టే వారిని ప్రేమ యవ్వనులని చేస్తుంది తమని తాము యవ్వనులుగా…
-
మూగ ప్రేమికుడు… సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి
ఆవేశాలని వరదలతోనూ, సెలయేళ్లతోనూ పోలుస్తారు: లోతులేనివి గలగలమంటాయని, లోతైనవి సడిచేయవని; కనుక, అభిమానం మాటల్లోకి దిగితే, అనిపిస్తుంది అంతరాంతరాల అడుగున ఉన్నదంతా డొల్లేనని. కానీ ఎవరు సులభంగా మాటాడగలరో, వాళ్ళు మాటల్లోనే గ్రహిస్తారు ఒక ప్రేమికుడికి ఉండవలసినదేదో తమదగ్గర లోపించిందని. . వాల్టర్ రాలీ ఇంగ్లీషు కవి 1552-1618 . Sir Walter Raleigh . The Silent Lover . Passions are liken’d best to floods and streams: The shallow murmur,…
-
సంతోషక్షణం… జలాలుద్దీన్ రూమీ, పెర్షియన్ కవి
నువ్వూ- నేనూ వరండాలో కూర్చున్నది ఒక సంతోష క్షణం చూడడానికి ఇద్దరం గాని నువ్వూ నేనూ ఒకే ఆత్మ మనిద్దరమూ పూదోట సౌందర్యంతో పక్షుల కిలకిలారావాలతో ఇక్కడ జీవనస్రవంతిని అనుభవిస్తున్నాం. చుక్కలు మనల్ని గమనిస్తుంటాయి మనం వాటికి సన్నని సినీవాలి అంటే ఏమిటో చూపిస్తాము. మన అహాలు వదులుకుని ఇద్దరం కలిసి ఉంటాము మనిద్దరం భవిష్యత్తుగురించి నిష్ఫలమైన ఊహాగానాలు చెయ్యం మనిద్దరం నవ్వుతూ ఉంటే ఆకసంలో పక్షులు పళ్ళు రుచిచూస్తుంటాయి ఒక ఆకృతిలో ఈ భూమి మీద…
-
పదచిత్రం… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను కవి
దిక్కుల చివర లేత నీలిరంగు ఆకసపు వెలుగులో బద్ధకంతో నెమ్మదిగా వెనక్కి మరలుతున్న కెరటాల అంచున ఓడల నీడలు తేలియాడుతున్నాయి. ఆకసం వాలిన చోట పొడవాటి గోధుమరంగు గీత ఒకటి జానెడు ఉప్పు కయ్యల్లో చేతులకొద్దీ ఇసుక మేటలు వేస్తోంది. స్పష్టంగా కనిపించే ఆ అంతులేని ముడతలు, భంగపడి,లోపలికి ముడుచుకుని, నిష్క్రమిస్తున్నాయి. చిరుకెరటాలు ముక్కలై, సముద్రపు ఒడ్డును పగులుతున్న తెల్లని నురగలతో కడుగుతున్నాయి. కెరటాల అంచున లేత నీలపు వెలుగులో ఓడల నీడలు తేలియాడుతున్నాయి. . కార్ల్…
-
నిర్ణయం … అలెగ్జాండర్ బ్రోం, ఇంగ్లీషు కవి
అందంగా ఉన్న ముఖం గురించీ ఎర్రని పెదాలూ, బుగ్గలగురించీ ఆమె కురుల గురించీ గాని, తీరుగా దిద్దిన ముంగురుల గురించిగాని దేవదూతలా ఆలపించే అరుదైన గంధర్వ గాత్రం గురించి గాని చెప్పొద్దు; నాకు ఎంపిక చేసుకునే అవకాశం ఉండి ఉంటే నేను ఇవన్నీ ఎంచుకుని ఉండేవాడిని. కానీ, నువ్వు నేను ప్రేమించి తీరాలంటే అందులోను అది ఆమె అయి ఉండాలంటే నన్ను ఒప్పించడానికి ఒక్కటే షరతు ఆమె నన్ను ప్రేమించాలి. మీ ఆడవాళ్ళ సౌందర్యాలు సౌందర్య సాధనాలకి…