వర్గం: అనువాదాలు
-
ఒంటరి మరణం… ఎడిలేడ్ క్రాప్సీ, అమెరికను కవయిత్రి
చలిలో నేను బయటకు వస్తాను; నేను చల్లటినీటిలోనే స్నానం చేస్తాను; నేను వణుకుతూ, పశ్చాత్తాపపడతాను; ఒంటరిగా ప్రభాతవేళ నా నుదిటికీ, కాళ్ళకీ, చేతులకీ విభూతిపూసుకుంటాను; వెలుతురు రాకుండా కిటికీలు మూసెస్తాను పొడవాటి నాలుగు కొవ్వొత్తిల్నీ వాటి ఒరల్లో నిలిపి వెలిగిస్తాను; తూరుపు తెల్లవారుతుంటే, నేను పక్కమీద శరీరాన్ని వాల్చి మొహమ్మీదకి ముసుగులాక్కుంటాను. . ఎడిలేడ్ క్రాప్సీ September 9, 1878 – October 8, 1914 అమెరికను కవయిత్రి . Adelaide Crapsey September 9, 1878…
-
మడుగు… హిల్డా డూలిటిల్, అమెరికను
ఇంకా బ్రతికే ఉన్నావా? నేను నిన్ను తాకుతానో లేదో సముద్రంలో చేపలా అల్లల్లాడిపోతావు. నిన్ను నా వలతో రక్షిస్తాను. అందమైన చారలున్నదానా? ఇంతకీ నువ్వెవరు? . హిల్డా డూలిటిల్ September 10, 1886 – September 27, 1961 అమెరికను The Pool . Are you alive? I touch you— You quiver like a sea-fish. I cover you with my net. What are you, banded one? .…
-
ఒక పిల్ల పాడుకునే పాటలు… మేరీ కెరోలీన్ డేవీస్, అమెరికను కవయిత్రి
I బహుశా దేముడు ఈడెన్ తోట వేస్తున్నప్పుడు పొరపాటున ఒక విత్తనం పక్కన కాలపు పొలంలో జారవిడిచి ఉంటాడు. అది గాని పెరిగిపెద్దదై ఈ క్షణంగా మారలేదుకదా? II నువ్వూ నేనూ ఒక సారి క్రింద పడ్ద జీవితాన్ని ఏరి దానివంక చిత్రంగా చూశాం మనకి దాన్ని ఆటవస్తువుగా ఉంచుకోవాలో, పారెయ్యాలో తెలీలేదు. ఎర్రని దీపావళి టపాకాయల్లా, చూడానికి చాలా బాగుంది, మనకి అది వెలిగించబడిందని కూడా తెలుసు. ఎందుకేనా మంచిదని రాయబారం ఇంకా కాలుతుండగానే దాన్ని…
-
ఆక్వేరియం దగ్గర… మేక్స్ ఈస్ట్మన్,అమెరికను
(అక్వేరియం ప్రతీకగా తీసుకుని రాసిన మంచి కవిత. మనుషులు ఆక్వేరియంలోని చేపలను చూసి ఎందుకు నిరంతరం తిరుగుతున్నాయో అనుకుని ఆశ్చర్యంతో కూడిన జాలి ప్రకటిస్తూ ఉంటారు. కానీ వాళ్ల చేష్టలు ఈ విశాలప్రపంచం అనే ఆక్వేరియంలో చేపల ప్రవృత్తికి భిన్నంగా ఏమీ ఉండదు.) యుగాల వయసున్న ఆ సముద్రపులోతుల్లో అవి అలసి పోయి, వంకీలు తిరుగుతూ… పెదాలు బిగించి, పాలిపోయి, ఆశ్చర్యంప్రకటించేకళ్ళతో ఆ ‘సివర్ ఫిష్ ‘ లు ప్రశాంతంగా ఈదుతున్నాయి. వాటికి ఎక్కడికి వెళ్ళడానికి త్రోవ…
-
War is a Pronoun… Ashok Kumbamu, Indian
No matter who he is He speaks only the language of war. War is now a pronoun for everyone. Their prologue is war. Their epilogue is war. For that matter, every word they utter smacks of war. When war and invasion are their way of life You can’t expect them to be conscious Of people’s…
-
ఒక ముసలమ్మ పదచిత్రం… ఆర్థర్ డేవిసన్ ఫికే, అమెరికను
ఆమె అతికష్టం మీద కుంటుతూ నడుస్తోంది ఆగి, సంకోచిస్తూ, మళ్ళీ మెల్లిగా కదుల్తోంది కళావిహీనమైన ఆ ముఖంతో ప్రశ్నార్థకంగా చూస్తూ … కోరికలూ, బాధలూ, భయాలూ అన్నీ హరించుకుపోయి. సాగిపోయిన ముడుతల్లో పాలిపోయిన బుగ్గలు వేలాడుతున్నాయి అందులో రక్తం ప్రవహిస్తున్న జాడ ఎక్కడా కనిపించదు. వరికంకులు కట్టగట్టినట్టున్న ఆమె చేతులు మాసి, చిరుగుపాతైపోయిన శాలువాని పట్టుకున్నాయి రొమ్ము ఉండవలసినచోట ఎముకలు ముడుచుకుపోయి ఉన్నాయి ఆమె పిరుదులు ఒక ముడిలా అటూఇటూ కదులుతున్నాయి తాడులాంటి గొంతులోనుండి శ్వాశ అతికష్టం…
-
లండన్… ఎఫ్. ఎస్. ఫ్లింట్, ఇంగ్లీషు కవి
ఓ నా అందమైన లండను నగరమా! ఆ సూర్యాస్తమయమో, తెల్లని ఎత్తైన ఆ ‘బర్చి’ చెట్టు ఆకుల పరదాలోంచి లీలగా మెరుస్తున్న ఆకాశమో, ఇక్కడి ప్రశాంతతో, లే పచ్చికమీద కువకువలాడుతూ గంతులేస్తున్న పిట్టలగుంపో, అన్ని వస్తువులమీదా సన్నగా పరుచుకుని వాటిని కనుమరుగుచేస్తున్న చీకటో … కాదు నా మనసు దోచుకుంటున్నది. చంద్రబింబం అలా మహావృక్షాల శిరసులమీంచి ఆకసానికి ప్రాకుతుంటే ఆ నక్షత్రాల గుంపులో ఆమెను* ఊహించుకుంటాను వెళుతూ వెళుతూ ఆ చంద్రబింబం మనుషులమీద ప్రసరించే కాంతిని ఊహించుకుంటాను. నా…
-
కురితీర్ తో లియాడేన్… మోరీన్ ఫాక్స్, ఐరిష్ కవయిత్రి
(జానపద గాథ: లియాడేన్, కురితీర్ ఇద్దరూ 7 వశతాబ్దికి చెందిన ఐరిష్ కవులు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కురితీర్ పెళ్ళిప్రయత్నాలు చేసుకుంటూ కొంతకాలం కనబడపోయేసరికి, లియాడెన్ ఏవో తెలియరాని కారణాలకి సన్యాసినిగా దీక్షతీసుకుంటుంది. అది తెలుసుకున్న కురితీర్ నిరాశకు లోనై తనుకూడా సన్యాసిగా దీక్షతీసుకుంటాడు. మొదట్లో వాళ్ళిద్దరూ ఒకర్ని ఒకరు చూసుకోడానికే పరిమితమైనా కొన్నాళ్ళకి వాళ్ళ దీక్షభగ్నం అవుతుంది. అపుడు కురితీర్ తన ఆత్మను రక్షించుకుందికీ, శేషజీవితాన్ని ప్రాయశ్చిత్తంతో గడపడానికీ ఆమెని విడిచిపెడతాడు) I నాకే గనక…
-
యూదు సైనికుడు… ఫ్లారెన్స్ కైపర్ ఫ్రాంక్, అమెరికను కవయిత్రి
(ఒక్క జార్ చక్రవర్తి పదాతి దళంలోనే సుమారు 2.5 లక్షలమంది యూదులు … ఒక పత్రికలో వార్త) వాళ్ళు నాకు సైనికుడి దుస్తులు తొడిగేరు చేతిలో తుపాకీ పెట్టి ఈ పరాయిదేశంలో నాకు నచ్చినవాణ్ణి ధైర్యంగా చంపమని వాళ్ళు నన్ను పంపేరు పాపం, చాలా మంది తమదేశంకోసం మరణిస్తారు చాలామంది విశాల భూభాగాన్ని గెలవడానికి మరణిస్తారు కాని నేను నా బిడ్డను హతమార్చిన నా జన్మభూమికోసం ప్రాణాలర్పిస్తాను. ఎన్ని వందలసంవత్సరాలబట్టి దేశాలు పుట్టి, అభివృద్ధిచెంది, మాయమవడంలేదు! శాంతి…
-
తుఫాను భయం… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి
చీకటిలో గాలి మామీద కక్ష గట్టినట్టు వీస్తూ తూర్పువైపు గది కిటికీని మంచుతో బాదుతూ, తన అరుపుల్ని నిగ్రహించుకుని “ఒరే పిరికిపందా! రారా బయటికి” అని గుసగుసలాడినట్టు అనిపిస్తుంది. బయటికి వెళ్లకుండా ఉండడానికి పెద్దగా విచికిత్స అవసరం లేదు. అబ్బే! లాభం లేదు. నా బలాబలాలు బేరీజు వేసుకుంటాను మేమిద్దరం, ఒక బిడ్డ. మాలో నిద్ర రానివాళ్ళం దగ్గరగామునగదీసుకుని ఒకపక్క పొయ్యిలో నిప్పు నెమ్మదిగా ఆరిపోతుంటే మరోపక్క చలి ఎలా మెల్లిగా పాకురుతుంటుందో గమనిస్తుంటాం. తుఫాను గాలి…