వర్గం: కవితలు
-
ఉన్నదున్నట్టుగా … జార్జ్ లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి
తోట వాకిలి తెరుచుకుంటుంది, సేవకుడికుండే విధేయతతో బహుకాల సేవన ఇచ్చే చనవుతో అడిగే ప్రశ్నలా; తోటలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉండే ప్రతి వస్తువూ యథాతథంగా మనసులో ముద్రవేసి ఉండడంతో వాటిని ఏకాగ్రతతో పరిశీలించవలసిన అవసరం లేదు. నాకు అన్ని సంప్రదాయాలూ, ఆలోచనలూ ప్రతి జనసమూహమూ అల్లే పలుకుబడుల అంతరార్థాలూ తెలుసు; వాటిగూర్చి ప్రత్యేకంగా చెప్పనక్కరనూ లేదు, లేని హక్కులూ, అధికారాలూ కోరదలుచుకోనూ లేదు. నా చుట్టూ ఉన్నవాళ్ళకి నా గురించి బాగా తెలుసు నా మానసిక…
-
విశ్వాసం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నా ఆత్మ నా శరీర గృహంలో ఉంటుంది నువ్వు, రెండింటికీ స్వామివే. కానీ, నా ఆత్మ, నిర్భయంగా హాయిగా తిరిగే సాహసికుడిలా ఒక్కోసారి ఒదిగి ఉండదు. అదొక శాంతిలేని, కుతూహలము వీడని ఆభాస. అదేం చేస్తుందో నే నెలా చెప్పగలను? నా శరీరపు విశ్వాసాన్నైతే హామీ ఇవ్వగలను. కానీ, నా ఆత్మకి నీ మీద విశ్వాసం తప్పితే? . సారా టీజ్డేల్ August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి . .…
-
A Sweet Calling on the Shore … Kasiraju, Telugu, Indian
Either in the wakes of those surging waves or buried in the slightly wet sands on the shore there lie some hushed legends. which commune freely with every solitude. The imprints of few footprints erased by the sweeping waves pleaded for attention to listen to their story. A violent wave which girdled my feet before…
-
నువ్వు నాకు విడిచిపెట్టినవి… ఎమిలీ డికిన్సన్, అమెరికను
ప్రియా! నువ్వు నాకు రెండు వారసత్వంగా వదిలావు; మొదటిది ప్రేమ భగవంతునికి ఆ వారసత్వం లభించి ఉంటే అతను మిక్కిలి సంతృప్తిచెందేవాడు. కాలానికీ శాశ్వతత్వానికీ మధ్య, నాకూ, నీ స్మృతికీ నడుమ సముద్రమంత విశాలమయిన దుఃఖపు పరిమితులు మిగిల్చావు . ఎమిలీ డికిన్సన్ December 10, 1830 – May 15, 1886 అమెరికను కవయిత్రి . . You left me . You left me, sweet, two legacies,— A legacy of…
-
చిన్న చట్టిలో తాండ్ర పంపుతూ దొరసానికి పంపిన ‘చిన్న ‘ త్రిపదలు… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి
చిన్న దేవుడికి చిన్న గుడి చాలు చిన్న పాదుకి చిన్న ప్రాపు చాలు నా చిటికెడు సారాకి, చిన్న గాజు కుప్పె చాలినట్టు చిన్న విత్తుకు చిటికెడు నేల చాలు చిన్న వ్యాపకానికి చిన్న శ్రమ చాలు నా చిన్న జాడీ కొంచెం నూనెకు చాలినట్టు. చిన్న రొట్టెకి చిన్న బుట్ట చాలు చిన్న బుర్రకి చిన్న దండ చాలు నా చిన్న గుడిశకి చిన్న కర్ర చాలినట్టు. చిన్న పడవకి చిన్న సెలయేరు చాలు చిన్న…
-
మలి ఎదుగు… విబిఫ్రెడ్ వెల్స్, అమెరికను కవయిత్రి
మనిషికి తెలుసు “బర్చ్” చెట్టు ఎప్పుడూ కొమ్మ నరకబడినచోటే పెరుగుతుందని … అసలు అడవి సంగతే అంత, నేనూ అదే మార్గం అనుసరిస్తాను. ఎందుకంటే, ఇప్పుడు నా శోకం పోగొట్టబడి నాలోని అనుమానాలు పటాపంచలయ్యేయి గనుక నాకూ ఇక మంచిరోజులు ముందున్నాయి నేనూ వెలుగుల్లో స్నానం చేస్తాను. . వినిఫ్రెడ్ వెల్స్ (1893- 1939) అమెరికను కవయిత్రి. . Second Growth . Men know that the birch-tree always Will grow where they…
-
అందమైన వల… రాబర్ట్ గ్రేవ్స్, ఇంగ్లీషు కవి
పిల్లలు ఉదయం ఎంతవేడిగా ఉందో చెప్పలేరు, గ్రీష్మఋతువులోని గులాబి ఎంత రసానుభూతినిస్తుందో, ఆకాశాన ముసురుకునే మునిమాపు చీకట్లు ఎంత భయదమో, బాజాలువాయిస్తూ పక్కనుంచిపోయే పొడవాటి సైనికపటాలం ఎంత భయానకమో వాళ్ళు చెప్పలేరు. కానీ, మనకి మాటలున్నాయి, ఎంత మండు వేసవి రోజునైనా తెలియకుండా గడపడానికి; గులాబుల భావోద్రేకతను అధిగమించగల మాటలున్నాయి, వేలాడుతున్న చీకట్లని మాయం చెయ్యగలం, సైనికులనీ, భయాన్నీకూడ పారద్రోలగలం. మనని కట్టిపడేసే అందమైన పద”జాలము” ఉంది, పట్టలేని ఆనందం నుండీ, భయాన్నుండీ రక్షణ నివ్వగలది; కడకి…
-
డేలియా … శామ్యూల్ డేనియల్, ఇంగ్లీషు కవి
నీ బంగరు కేశాలపై హేమంతం మంచుకురిసినపుడు, గడ్డకట్టిన కాలం దగ్గరలోని పూలన్నీ తునిమినపుడు ఎప్పటికీ తొలగని చీకటిలా నీ రోజులు కనిపించినపుడు, ఇన్నాళ్ళ నీ బలమైన నమ్మకాలూ వఠ్ఠి తప్పులేనని తేలినపుడు; అప్పుడు, నేను రంగు రంగుల కుంచెలతో చిత్రించబోయే ఈ చిత్రాన్ని చూడు, అదేమంత పనికిరానిది కాదు. ప్రకృతీ పరమేశ్వరుడూ నీకిక్కడ ప్రసాదించిన అనుగ్రహాన్ని గుర్తించు; నిన్ను నువ్వు పరిశీలించుకుని నేను నీకై ఎంతకృషిచేశానో తెలుసుకో; బహుశా, ఇదే నీకు శాశ్వతమైన స్మృతి చిహ్నం కావొచ్చు,…
-
ప్రవాసం లో ప్రేమగీతం… స్టీపెన్ రుడాన్ స్కీ, యుక్రేనియన్ కవి
ఓ మారుతమా, యుక్రెయిన్ దిశకు వీచు! ఎందుకంటే, అక్కడ నా ప్రియురాలుని విడిచి వచ్చేను. అవును, రెండు ముదురుగోధుమరంగు కళ్ళని వదిలి వచ్చేను— కనుక, ఓ పవనమా, నిశిరాత్రి నుండీ వీచు. అక్కడ యుక్రెయిన్ లో ఒక కనుమ ఉంది, కనుమలో ఒక పల్లె ఉంది, ఆ పల్లెలో ఒక గుడిశలో ఓ పడుచు ఉంది, ఒక చిన్న కన్నియ, లోకం తెలియని గువ్వ. అక్కడ ఓ మారుతమా, సడిచేయకు, నెమ్మది! ఆమె ముఖం మీద నిశ్చలంగా…
-
పదో ఏడు వచ్చినపుడు … బిల్లీ కాలిన్స్, అమెరికను కవి
(చిన్నపిల్లల కోణం నుండి బాల్యాన్ని విడిచిపెడుతున్నప్పుడు కలిగే మనోవ్యథ బాగా చెప్పిన కవిత. ) ఆ ఆలోచన వచ్చేసరికే అనిపించింది నాకు ఏదో జరగబోతోందని… గుడ్డిదీపం క్రింద చదువుతున్నప్పుడు వచ్చే తలనొప్పికంటే, ఏ కడుపునొప్పికన్నా కూడా తీవ్రమైనది… ఉత్సాహానికి అమ్మవారు వచ్చినట్టు, మనసుకి రోగం వచ్చినట్టు ఆత్మని కురూపిని చేసే అంటురోగం వచ్చినట్టు… ఏదో జరగబోతోందని. సింహావలోకనం చేసుకుందికి మూడు ఆదివారాలైనా కాలేదనొచ్చు, కానీ ఒక విషయం మీరు మరిచిపోతున్నారు: ఇద్దరిచేత పరిచయం చెయ్యబడడంలోని సంక్లిష్టతనీ ఒక్కరిగా…