వర్గం: కవితలు
-
అలసితి… సర్ హెన్రీ పార్క్స్, ఆస్ట్రేలియన్
కలతపడ్డ మనసుని మరింత కృంగదీస్తున్న ఈ అంతులేని యుద్ధానికి అలసిపోయాను; గమ్యం చేరుకునే వేళకి, కత్తితోకొట్టినట్టు ఆలోచనలు సొమ్మసిలేలా వేటువేస్తున్నాయి. దుఃఖకారణమైన సుఖాలవేటకి అలసిపోయాను. అవి కల్పించిన భ్రమలు నుసిలా రాలుతున్నాయి; అవి ఉన్న సంతోషాలను హరించడమే గాక బాధల భస్మ కలశలోకి ఎముకల్ని ఎత్తుతున్నాయి. సంకుచితమైన మార్గాలలో నడుస్తూ భంగపడ్ద ఆశలకి అలసిపోయాను; అవి పేలవమైన లక్ష్యాలకి శక్తిధారపోసేలా, తప్పుడు చేతలకీ, వక్రమార్గాలకీ ప్రేరేపించేయి. మంచి చెడుల సంకరమైన యుద్ధంలో పోరాడే సమూహాన్ని చూసి అలసిపోయాను;…
-
యూదు… షెం తోబ్ దె కారియన్, ఇజ్రేలీ కవి
ముళ్ళతో కూడిన చిగురు తొడిగిందని గులాబీ నేలకి తక్కువ సుగంధాన్ని అద్దదు; పాకురుతున్న తీగనుండి వచ్చిందని ద్రాక్షగుత్తి రుచికి ఏమీ తీసిపోదు. ఒక మురికి గూటిలోంచి ఎగసిన డేగ ఉదాత్తమైన గుణాలు కలది కావచ్చు ఒక యూదు నోటివెంట వచ్చినంతమాత్రం చేత ధర్మసూత్రాల నైశిత్యం తగ్గిపోదు. . షెం తోబ్ దె కారియన్ ఇజ్రేలీ కవి 14 వ శతాబ్దం . Israelite Juan Alfonso Baena, a converted Jew who flourished in the…
-
మిగిలిపోయేవీ, తరిగిపోయేవీ … థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి
తుంపరలమీద కదలాడే సూర్యుడి ఇంద్రధనుసులూ పారుతున్న సెలయేటి మీది తళతళలూ అందమైన ముఖాలూ, ప్రమాణాలూ, వెన్నెలరాత్రులూ… ఇవన్నీ శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటాం కానీ, అవి తరిగిపోతాయి. హేమంతపు మంచులా పరుచుకున్న శూన్య ఋతువులూ నిశ్శబ్దంగా ఓడుతున్న కుళ్ళిన ప్రపంచపు రక్తస్రావమూ వేలమంది దౌర్భాగ్యుల అవేదనపు కేకలూ — ఇవి సమసిపోవాలని మనం కోరుకుంటాం, కానీ, అవి మిగిలిపోతాయి. . థామస్ హార్డీ 2 June 1840 – 11 January 1928 ఇంగ్లీషు కవి . Going…
-
దారీ తెన్నూ లేక… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
చిత్తడినేల అంటే ఏమిటో తెలీదు, సముద్రాన్ని ఎన్నడూ చూసి ఎరగను కానీ, నాకు అడవిపొదలెలా ఉంటాయో తెలుసు కెరటం అంటే ఊహించుకోగలను. నేను దేవుడితో ఎప్పుడూ మాటాడలేదు స్వర్గాన్ని ఎన్నడూ చూడలేదు కానీ నాకు పటం చూసినంత స్పష్టంగా అదెక్కడుంటుదో ఖచ్చితంగా తెలుసు. . ఎమిలీ డికిన్సన్ December 10, 1830 – May 15, 1886 అమెరికను కవయిత్రి . Chartless I never saw a moor, I never saw the…
-
పిల్లాణ్ణిముద్దుచెయ్యి, ఎప్పుడూ ఏడుస్తుంటాడు… లేడీ మేరీ రాత్, ఇంగ్లీషు కవయిత్రి
పిల్లాణ్ణిముద్దుచెయ్యి, ఎప్పుడూ ఏడుస్తుంటాడు సంతోషపెట్టు, గాలిలో ఎగురుతుంటాడు అడిగింది ఇవ్వు, ఇంకా కావాలంటాడు ఉన్నదానితో ఎప్పుడూ సంతోషపడడు. వాడి కోరికలకి తుది ఉండదు అవివేకమే వాడి అంతులేని సంపద; వాడు ఇచ్చినమాట ఎప్పుడూ నిలబెట్టుకోడు వాడు మాటాడినది ఒక్కటీ నమ్మబోకు. వాడు ఒట్టేసి అబద్ధం ఆడతాడు నిన్ను ఏమార్చడానికి పొగుడుతుంటాడు; ఒక సారి చెయ్యి అందనీ, నిన్ను వదిలెస్తాడు నిన్ను మభ్యపెట్టినందుకు గర్వపడుతుంటాడు నువ్వు ఏడుస్తుంటే వాడు నవ్వుతుంటాడు నీ లోపాలకి మళ్ళీ వాడే కారణం ఇవి వాడి సుగుణాలు,…
-
The Same Road… Mohan Rishi, Telugu, Indian
The road looks barren… As if nobody had passed by for years. The deciduous leaves beckon pleadingly. There is no ruffle in the wind. A rusted old bicycle lies leaning onto the wall The sky is devoid of its wonted hues And the earth fails to hide its fissures. No, one cannot retreat his steps; Must…
-
పాత ఓడలు … డేవిడ్ మోర్టన్, అమెరికను కవి
పాత ఓడలకి కొన్ని జ్ఞాపకాలు అంటిపెట్టుకుని ఉంటాయి ముక్కిపోయిన వాసనతో బరువులేని సరుకులాగ – లోతులేని సింధుశాఖలూ, ముఖాన్ని ముద్దుపెట్టుకునే నీటిపెదాలూ, తుఫాను రాత్రుళ్ళూ, ఇంతవరకు చెప్పని కథలూ… సూర్యోదయంతో కనిపించే ద్వీపాలూ తమ సన్నని తెరచాపకొయ్యలని పరీక్షించిన అగ్రభూములూ, వెన్నుపలకలను విరిచేసిన వంకరలు తిరిగిన జలమార్గాలూ, ప్రశాంత నీలి గగనపు నిశీధులూ, నక్షత్రాలూ… ఊంహూ, ఓడలు ఒడ్డును మరిచిపోతాయనుకోకు, అలాగే తమని వివేకవంతుల్ని చేసిన సముద్రాలనీ, గాలుల్నీ; మీదుమిక్కిలి, ప్రతి సంఘర్షణా ఒక జ్ఞాపకాన్ని మిగులుస్తుంది;-…
-
నిశీధి… జేమ్స్ బీటీ, స్కాటిష్ కవి
చీకటి పడింది, ఇపుడు ప్రకృతిదృశ్యం రమణీయంగా లేదు; నేను విచారిస్తున్నాను, కానీ, ఓ వనసీమలారా మీకోసం కాదు; ఎందుకంటే పొద్దు పొడుస్తూనే మీ అందాలు మీకు తిరిగి వస్తాయి, సరికొత్త సువాసనలు అద్దుకుంటూ, మంచుతో మెరుస్తూ: నేను శీతకాలపు విధ్వంశానికీ వగవను; దయాళువైన ప్రకృతి కుసుమాంకురాల్ని పదిలపరుస్తుంది, చివికిపోతున్న ఈ అస్థికలశం మీద ఎప్పుడు వసంతం కరుణిస్తుంది! నిశీధిలో చిక్కుకున్న ఈ సమాధిపై పొద్దుపొడిచేదెపుడు? . జేమ్స్ బీటీ, (25 అక్టోబర్ 1735 – 18 ఆగష్టు…
-
శీతకాలపు స్వారీ… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
గుర్రపుస్వారీలో ఉన్న ఆనందాన్ని ఎవరు ప్రకటించగలరు? ఎగరడంలో ఉన్న ఆనందాన్ని ఎవరు విప్పి చెప్పగలరు? అకస్మాత్తుగా కనిపించిన అడవిపూల గుత్తుల్ని తప్పించుకుంటూ విశాలమైన రెక్కలతో, ఆకాశంలో ఎగురుతూ వెళుతుంటే… క్షణికమైన లోకంలో కొన్ని శాశ్వతమైన క్షణాలుంటాయి భగవద్దత్తమైనవి, లిప్తపాటైనా, చెప్పలేని ఆనందాన్నిస్తాయి సూర్యుడు హరివిల్లులు చిందించే తళతళల మంచుస్ఫటికాలతో నా ముందు పరుచుకున్న విశాలమైన తెల్లని త్రోవకూడా అలాంటిదే, నేనూ, నా బలశాలి గుర్రమూ దౌడు తీస్తుంటే తెల్లని ఈ పొలాలు, నల్లని పొడవాటి మా జాడలతో…
-
నిర్ణయం… రుడ్యార్డ్ కిప్లింగ్, ఇంగ్లీషు కవి
అమెరికను ఆత్మ పలుకుతోంది: సఫలతనందించేశక్తి ఎవని చేతిలో ఉందో తప్పొప్పులు నిర్ణయించే నిర్ణేత ఎవరో మా విశ్వాసమూ, బలిదానాలూ అతనికే మా గమ్యం, మా బలమూ అతని అనుగ్రహమే ఈ స్వేచ్చా ధరిత్రిమీద పండగ చేసుకొండి మా పూర్వపు సంకెలలు పూర్తిగా తెగిపోయాయి; మరొక్క సారి మాకు మంచికీ చెడుకీ మధ్య నిర్ణయించుకునే అపూర్వ అవకాశం దొరికింది. అయితే అది ప్రార్థనలూ, కన్నీళ్ళతో అంత చవుకగా ఏమీ దొరకలేదు, సందేహాలూ, రోగాలతో పోగొట్టుకున్న మార్గాన్ని మళ్ళీ తిరిగి సాధిస్తాం.…