వర్గం: కవితలు
-
సౌందర్యం… ఆర్మెల్ ఒకానర్, అమెరికను
(… మన అవగాహన పరిధి దాటి సృష్టిలో కనిపించే మంచిదనమే… ఏకకాలంలో అందానికి లక్షణమూ, జన్మస్థానమూ కూడ: ఈ ప్రాధమికమైన సౌందర్యం, ప్రాధమికమైన మంచిదనం రెండూ ఒకచోటే ఉంటాయి… అందుకే మంచిదనాన్ని ఆశ్రయించే అందం ఉంటుంది… ప్లాటినస్) సూర్యుడు ఏకకాలంలో చాలాచోట్ల ప్రకాశిస్తాడు, సౌందర్యం అంతరాంతరాల్లో దాక్కుంటుంది. ఒక్క వెలుగే ఎన్నో ముఖాలని దీపించి లోపాలు చూపి ఉత్కృష్టసౌందర్యాన్ని నిరూపిస్తుంది ప్రతి పర్వతం, ఆకాశం, నదీ “భగవంతుడు ప్రసాదించే ఏ వరం నాశనంలేనిది?” అని పదే పదే…
-
My Life is a Newborn Baby… Vadrevu Chinaveerabhadrudu
You will be surprised if you look at me now Wondering why I am circumambulating. Like a young bride making revolutions About the Peepul seeking a child… Hoping for a fruitful life, I make revolutions about this Peepul Tree. Time revolves round me. And I run around the rounding Time To hold aloft in my…
-
ఇంటిదారి… జోసెఫ్ ఆస్లాండర్, అమెరికను
దూకే చేపపిల్లకి చంద్రుడొక కంపించే వలయం నిశ్శబ్దంగా నీరు కదులుతోంది ఇంటిదారి పట్టిన అనేక పడవలకి రాత్రి … ఒక లంగరు. చీకటిలో సొరంగాలు తవ్వే చిత్రమైన వారుంటారు రంయిమని తిరిగి రాలిపోయే రెక్కలుంటాయి, నిశ్శబ్దన్ని గూళ్ళుగా మలిచే సాలీళ్లుంటాయి అందులోకి కీటకాలు అమాయకంగా అడుగుపెడతాయి. గడ్డిమీద కదలాడే క్రీనీడలమీద అడుగులేస్తూ ముఖానికి రాత్రి చిరుచలిగా తగలడం అనుభూతిస్తాను నన్ను నిలదీస్తున్న రోదసి రాత్రి-కాపలాదారుని తప్పించుకుని నేను ఇల్లుచేరుకుంటాను . జోసెఫ్ ఆస్లాండర్ 11 October 1897…
-
కీర్తికాంత … జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి
కాలు నిలవని పిల్లలాంటి కీర్తికాంత, ఆమెకు పాదాక్రాంతులై సేవచేసేవారిని చూస్తే, ఇంకా సిగ్గునభినయిస్తూనే ఉంటుంది. కానీ మనసులో నిశ్చింతగా ఉండే వెర్రివాడు ఎవడైనా ఉంటే దాసోహమంటూ అతని వెంటే ఎక్కువగా తిరుగుతుంటుంది; ఆమె ఒక సంచారిణి; ఆమె పక్కనలేకపోయినా తృప్తిగా ఉండడం అలవాటులేనివారిని ఆమె పలకరించదు; ఆమె ఒక మోసకత్తె…ఆమె చెవిలో ఎవరూ గుసగుసలాడరు, ఆమె గూర్చిమాటాడేవారు అభాండాలు వేస్తున్నారని అనుకుంటుంది; ఆమె అచ్చంగా సంచారిణే… నైలు నదీ తీరాన పుట్టింది అసూయాపరురాలైన పోటిఫార్* భార్యకి సాక్షాత్తూ…
-
కృషి… విలియం హేమండ్, ఇంగ్లీషు కవి
ప్రేమని మొదటగా పాదుకొల్పడానికి ప్రేమలేఖలతో మొదలెట్టిన నేను, వెర్రినై, తెలుసుకోలేకపోయాను, ముఖంచిట్లింపూ కసురు చూపులూ ఆమోదసూచికలేనని… నిర్లక్ష్యమనే చూపులకు బలై ముక్కలుగా విరిగిపోయిన మనసు చీదరింపులనే చట్రాలలో నలిగి నలిగి విత్తు మొలకెత్తిస్తుందని తెలియనైతి. సంకోచం ప్రేమని నిప్పులలోకి తోస్తుంది; మంచుకురిసే నేలలు తమకితాము వేడెక్కలేవు: అశ్రద్ధ దానిమీద ఆలోచిస్తూ కూచుంటుంది హేమంతంలో విత్తుమీద మంచు పేరుకున్నట్టు. మేమిద్దరమూ ఒకరినొకరు కలుసుకోకుండా పంత పండదు ప్రేమపంట ఒక్కటే సమృద్ధిగా పండి చివరకి ఒక్కటిగా మిగిలిపోతుంది మిగిలినవేవీ జీర్ణమయితేనేగాని…
-
సానెట్ 33… షేక్స్పియర్
ఇది షేక్స్పియర్ 400 వర్థంతి సంవత్సరము నేను చెప్పలేనన్ని అద్భుత సూర్యోదయాల్ని చూశాను మహోన్నత గిరిశృంగాలని రాజమకుటాలుగా రూపిస్తూ, చిలకపచ్చని మైదానాలని పసిడి కాంతులతో ముద్దాడుతూ, కళతప్పిన సెలయేళ్ళకు మహత్తరమైన దివ్య రుచులద్దుతూ; అంతలోనే నిరాధారమైన నీలిమేఘాలు కూడబలుక్కుని రోదసి రారాజు దివ్యవదనానికి అడ్డుగా తెరకట్టి ప్రపంచానికి అతని వదనాన్నీ, వెలుగులని దూరం చేస్తే పడమటకి అవమానభారంతో తను ఒంటరిగా క్రుంగడమూ తెలుసు; అయినప్పటికీ నా సూర్యుడు ఒక రోజు ఉదయాన్నే తన పూర్వ దీధుతులతో నా…
-
ఓ నా కవితా!… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి
పద, ఆమె దగ్గరకు వెళ్ళు, బెదిరిపోకు ఆమె అందాన్ని చూసి పురుషులు సంకోచించినట్టు; నీ వైపు తీక్షణంగా చూడదులే, నిన్ను చూసి ముఖం అటు తిప్పుకోదు కూడా. ఆమె మనోఫలకం మీద నువ్వు నిలిచేలా నీకు కొన్ని సొగసులు అద్దుతానులే, ఒకటి రెండు లోపాలు కూడా కలగలిసిపోవచ్చు వాటిని ఆమె నవ్వుకుంటూ క్షమించెస్తుంది. . వాల్టర్ సావేజ్ లాండర్ జనవరి 30, 1775 – 17 సెప్టెంబరు 1864 ఇంగ్లీషు కవి . To His Verse…
-
సాయంస్తుతి… ఫిల్లిస్ వ్హీట్లీ, ఆఫ్రికను అమెరికను కవయిత్రి
సూర్యుని చివరి వెలుగులు తూరుపుని విడిచిపెట్టగానే రోదసి ఒక్క సారి ఘంటరావాలతో నిండిపోయింది అద్భుతమైన దృశ్యం! అప్పుడే వికసిస్తున్న వసంతపు సుగంధాలని చిరుగాలి నలుదిక్కులా మోసుకొస్తోంది. సెలయేళ్ళు గలగలమంటున్నాయి; పక్షులు నవరాగాలాలపిస్తున్నాయి; గాలిలో వాటి సమ్మిళిత సంగీతం తెరలు తెరలుగా తేలియాడుతోంది. ఆహ్! ఆకాశంనిండా ఎన్ని అందమైన రంగులు అలముకున్నాయి. పడమరమాత్రం ముదురు ఎరుపురంగును అద్దుకుంది నల్లని చీకటి తెరలను దించడంతో పాటు వెలుగులనూ విరజిమ్మే సృష్టికర్త సంకీర్తనలతో నిండి అవనిమీద ప్రాణంతో స్పందించే…
-
నే పోయిన తర్వాత … హెన్రీ ఆస్టిన్ డాబ్సన్, ఇంగ్లీషు కవి
నే పోయిన తర్వాత నా సమాధి కంటే ఎత్తుగా గడ్డిమొలిచినపుడు … ఇష్టంగానో అయిష్టంగానో ప్రపంచం నన్ను చిరుకవిగా గుర్తించడానికి బేరీజు వేస్తుంటుంది అప్పుడు నేను ప్రశ్నించనూ లేను, జవాబూ చెప్పనూలేను. నేను ఉదయాకాశాన్ని చూడనూ లేను నడిరేయి గాలి నిట్టూర్పులు వినలేను నే పోయిన తర్వాత అందరు మనుషుల్లాగే నేనుకూడా మూగగా ఉండిపోతాను. అయినప్పటికీ, ఇపుడు నేను బ్రతికుండగా, ఎవరైనా ఇలా చెప్పగలిగితే సంతోషిస్తాను: “అతను తన కలాన్ని కళకి అంకితం చేశాడు సిగ్గుచేటు పనులకీ,…
-
కడసారి ప్రార్థన… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను
ఎలాగైతేనేం, చివరకి, తేలికగా కోటలా భద్రమైన ఈ ఇంటి గోడల మధ్యనుండీ చక్కగా దువ్విన కురుల కౌగిలిబంధాలనుండీ మూసిన తలుపుల చెరసాలనుండీ నన్ను ఎగిరిపోనీ. ఓ మనసా! తలుపులు తెరూ! చప్పుడు చెయ్యకుండా ఇక్కడినుండి పోనీ; మెత్తనైన తాళంచెవితో గుసగుసలాడుతూ తాళం తెరూ… తొందరపడకు! ఓరిమి వహించు, (ఓ నశ్వరమైన శరీరమా, నీమీది మోహం వదలదు సుమీ! ఓ ప్రేమపాశమా, నీ బంధం ఒకంత వదలదు సుమీ!) . వాల్ట్ వ్హిట్మన్ మే 31 1819 –…