వర్గం: కవితలు
-
సానెట్ 11… షేక్స్పియర్
ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం నీ దని చెప్పగల వస్తువునుండి నువ్వు దూరమై ఎంత త్వరగా లయిస్తావో, అంత త్వరగా ఎదుగుతావు; యవ్వనంలో ఉన్నపుడు నీ రక్తం పంచుకున్నదానిని యవ్వనం నిష్క్రమించినప్పుడు “నా”దని ప్రకటించగలవు. అందులో అందమూ, తెలివీ వెలిసి ప్రవర్థమానమౌతాయి; అదే లేకుంటే, వయసూ, అవివేకమూ, అన్నీ అంతరించిపోతాయి. అందరూ నీలాగే అనుకుంటే, కాలం నిలిచిపోతుంది. అరవై సంవత్సరాలు తిరగకుండా ప్రపంచం ఉనికి కోల్పోతుంది. ఎవరి ప్రతిరూపాలని ప్రకృతి పదిలపరచడానికి ఇచ్చగించదో అటువంటి…
-
సానెట్ 10…. షేక్స్పియర్
ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరం (ఈ సానెట్ లు వివాహానికి విముఖత చూపించే అందమైన యువకుణ్ణి ఉద్దేశించి రాసినవి) సిగ్గు సిగ్గు! ఎవరిమీదా నీకు ప్రేమలేదని ఒప్పుకో నువ్వంటే ఇష్టపడని తెలివితక్కువవాళ్ళెవరుంటారు? నిన్ను ఇష్టపడే వాళ్లు అసంఖ్యాకం, నికిష్టమయితే ఒప్పుకో. కానీ, నీకు ఎవరిమీదా ప్రేమ లేదన్నది మాత్రం స్పష్టం. నీకు అందరిపట్లా ఎంత ఏవగింపు అంటే, నిన్నుకూడా నువ్వు ద్వేషించుకుందికి వెనుకాడవు. మీ వంశాన్ని నిలబెట్టడం ఎలాగా అని కోరుకోవడం పోయి దానిని అంతం…
-
సానెట్ 9…. షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరం * ఒక భర్తృవిహీనచే కంట తడిపెట్టించవలసి వస్తుందేమోనని నిన్ను నువ్వు ఒంటరి జీవితంతో దహించుకుంటున్నావా? అలాగైతే, నువ్వు పిల్లలు లేక కనుమూయవలసి వస్తే, ఈ ప్రపంచం నీకోసం శోకిస్తుంది, సంతు లేని భార్యలా; తన కన్న బిడ్డల కన్నుల్లో భర్త రూపాన్ని చూసుకుని లోకంలో ప్రతి వితంతువూ భర్తకై శోకిస్తే, నీ ప్రతిరూపాన్ని మిగల్చకుండా పోయావని ప్రపంచమే అనాథయై నీకోసం విలపిస్తుంది. ఈ లోకంలో దూబరామనిషి ఖర్చు చేసేదంతా చేతులు…
-
సానెట్ 8… విలియం షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరం సంగీతం వినవలసి వచ్చినప్పుడు, విచారంతో వినడమెందుకు? తీపి తీపితో భేదించదు, ఆనందం ఆనందంతో కలిసి అధికమౌతుంది. నువ్వు సంతోషంగా స్వీకరించలేనిదాన్ని ఆదరించడమెందుకు, నిన్ను కలవరపరిచేదాన్ని నవ్వుతూ ఆహ్వానించడమెందుకు? చక్కని సుస్వరాల రసజ్ఞమైన మేళవింపు, వాటి రాగయుక్తమైన మేళన చెవులకు ఇంపు కాకుంటే అవి నిన్ను మెత్తగా మందలిస్తున్నాయన్న మాట, నీ ఒంటరిజీవితంతో వాటిని విస్మయపరుస్తున్నందుకు. జాగ్రత్తగా గమనించు. ఒక తీగ, రెండవదానికి జంటయై గతి తప్పకుండా, ఒకదానినొకటి…
-
నటజీవితానికి వేదనతో మిత్రుడికి లేక… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం . నా కృషికి తగిన ఫలాన్నందించలేని దోషి అదృష్టాన్ని నా కోసం తట్టిలేపుతున్నావా మిత్రమా! నా జీవితానికి పదిమందినీ అర్థించడం తప్ప ఏదీ దొరకలేదు; నా ప్రవర్తన కూడా అందుకే అలా. అందువల్లనే, నా పేరుకీ ఒక ముద్ర పడిపోయింది, అప్పటి నుండే నా నడవడికూడా మెతకబడింది, రంగుల్లో నానీ నానీ కలంకారుడి చెయ్యి రంగుదేరినట్టు. నన్ను కనికరించు! నాకీ జీవితం మీద విసుగేస్తోంది; ఈ మహత్తరమైన రోగానికి…
-
ఎండ మెరుగు (Sonnet 33)…విలియం షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం మహోత్తుంగ నగాగ్రాలకి రాచ ఠీవినలదుతూ పచ్చని తరులతానికుంజములకు పసిడిచాయ నద్దుతూ వన్నెవెలిసిన సెలయేటి నీటికి నాకధునీరుచు లద్దుతూ అరుణరాగరంజితమైన మహత్తర సూర్యోదయాలనెన్నిటినో చూసేను; అంతలోనే, అతని అలౌకిక తేజోమయ వదననాన్ని ఆచ్చాదిస్తూ నిమ్న,కుటిల వారివాహనివహాలను అనుమతించడమూ చూశాను. ఈ ప్రపంచాన్ని పరిత్యజించి, విరక్తితో, ముఖం చాటుచేసుకుని కళంకిత భారంతో అపరాద్రి చేరుకోవడమూ చూశాను. అయినప్పటికీ, ఒకరోజు ప్రభాతవేళ నా కనుబొమలపై ఈ స్నేహితుడు ఎదురులేని వెలుగులతో ఒక్కసారి మెరిసాడు. …
-
మూడు పద్యాలు… విలియం హేమిల్టన్ హేయిన్, విలియం హేమిల్టన్ హేయిన్ అమెరికను కవి
వెన్నెట్లో పక్షి పాట ప్రతి మధురమైన సుస్వరమూ శ్రద్ధగా వింటున్న ఆకుల్ని పరవశింపజేస్తోంది అంతర్థానమైన కీట్స్ ఆత్మ మళ్ళీ ఆ పిట్ట రూపంలో పునర్జన్మ దాల్చినట్టు. చీకటి తెరలు ఒక్కోసారి, ప్రకృతి నిద్రలో మునిగినపుడు దాని వనాలూ, సెలయేళ్ళచుట్టూ ప్రశాంతంగా చీకటి పొరలు పొరలుగా అల్లుకుంటుంది… ఎందుకంటే ప్రకృతి కలలు అవే గనుక. శరద్వీచిక సగం విషాదంలో మునిగి తేలికగా వీస్తున్న ఈ పిల్లగాలి ఇది చెట్లమధ్య దిక్కుతోచక తిరుగాడే “హేమ్లెట్” లాంటిది ప్రతి ఆకు కదలికలోనూ…
-
రేపటి కి… సామ్యూల్ జాన్సన్, ఇంగ్లీషు రచయిత
(ఐరీన్(Irene) నాటకం నుండి) . రేపు చేద్దామనుకుంటున్న పని! వయసుతోపాటు సంపాదించుకున్న అపురూపమైన జ్ఞానం రేపటికి మిగులుతుందా? యవ్వనానికి నెచ్చెలి… వాయిదా తత్త్వం… పిరికితనం, తెలివితక్కువదనం, ఓటమి విధిలిఖితమై రేపటికోసం ఎదురుచూస్తూ జీవితాన్ని వృధా చేస్తుంది. ఆశగా, కోరికలునిండినకళ్ళతో రేపటికై గుడ్లప్పగించి చూస్తుంది మధ్యలో మృత్యువు చొరబడి ఆ అవకాశాన్ని తన్నుకుపోయేదాకా! చిత్రం ప్రతి రోజూ అనవరతంగా ఈ మోసం జరుగుతూనే ఉన్నా అది గ్రహించలేని దౌర్భాగ్యులతో నిండి ఉంది ఈ ప్రపంచం చలికాలంలో మంచులో కవాతు…
-
వసంత కాలం …హఫీజ్, పెర్షియన్ సూఫీ కవి
వసంతం వచ్చేసింది! గులాబులూ, మల్లెలూ, కలువలూ మట్టిలోంచి తలెత్తుతున్నాయి– నువ్వు ఇంకా ఎందుకు మట్టి క్రిందే పడి ఉంటావు? బరువెక్కిన మేఘాల్లా నా ఈ కళ్ళు నీ సమాధి చెర మీద వర్షిస్తుంటాయి కన్నీళ్ళు నువ్వుకూడా మట్టిలోంచి తల పైకెత్తేదాకా! – హఫీజ్… పెర్షియన్ సూఫీ కవి 1325 –1389 The days of Spring are here! The eglantine, The rose, the tulip from the dust have risen– And…
-
ఉత్తరధృవప్రభలు… బెంజమిన్ ఫ్రాంక్లిన్ టేలర్, అమెరికను కవి
ఉత్తరధృవాన్ని ఆక్రమించడానికి సూరీడు మంటల బావుటాల సేనలతో వేంచేసేడు అక్కడి గాలి తెరచాపలపై వాటిని వదలగానే నక్షత్రాల వెలుగుల్లో అవి గడ్డకట్టుకుపోయాయి. ఇప్పుడక్కడ చల్లబడ్డ పతాకలు రెపరెపలాడుతున్నాయి శాశ్వతంగా వేడిమికోల్పోయి, ఉత్తరధృవప్రభలుగా. . బెంజమిన్ ఫ్రాంక్లిన్ టేలర్ (1819- 1887) అమెరికను కవి . Northern Lights . TO claim the Arctic came the sun With banners of the burning zone. Unrolled upon their airy spars, They froze…