సానెట్ 11… షేక్స్పియర్

ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం 

నీ దని చెప్పగల వస్తువునుండి నువ్వు దూరమై

ఎంత త్వరగా లయిస్తావో, అంత త్వరగా ఎదుగుతావు;

యవ్వనంలో ఉన్నపుడు నీ రక్తం పంచుకున్నదానిని

యవ్వనం నిష్క్రమించినప్పుడు “నా”దని ప్రకటించగలవు.

అందులో అందమూ, తెలివీ వెలిసి ప్రవర్థమానమౌతాయి;

అదే లేకుంటే, వయసూ, అవివేకమూ, అన్నీ అంతరించిపోతాయి.

అందరూ నీలాగే అనుకుంటే, కాలం నిలిచిపోతుంది.

అరవై సంవత్సరాలు తిరగకుండా ప్రపంచం ఉనికి కోల్పోతుంది.

ఎవరి ప్రతిరూపాలని ప్రకృతి పదిలపరచడానికి ఇచ్చగించదో అటువంటి

ఏ రూపురేఖలులేని మొరటు వాళ్ళని నిస్సంతుగా మరణించనీ;

చూడు, ప్రకృతి అనుగ్రహించినవాళ్ళని సమృద్ధిగా అనుగ్రహిస్తుంది;

ఉదారంగా ఇచ్చిన ఆ బహుమతిని అంత పదిలంగానూ కాపాడుకోవాలి;

నిన్ను తన ముద్రగా తీర్చిదిద్దింది, ఎందుకని? నువ్వు మరో

పది ప్రతిరూపాల్ని సృష్టిస్తావని, ఉన్నది హరింపజేస్తావని కాదు.

.

షేక్స్పియర్

 

 

William Shakespeare.

.

SONNET 11

As fast as thou shalt wane, so fast thou growest

In one of thine, from that which thou departest;

And that fresh blood which youngly thou bestow’st

Thou mayst call thine when thou from youth convertest.

Herein lives wisdom, beauty and increase:

Without this, folly, age and cold decay:

If all were minded so, the times should cease

And threescore year would make the world away.

Let those whom Nature hath not made for store,

Harsh featureless and rude, barrenly perish:

Look, whom she best endow’d she gave the more;

Which bounteous gift thou shouldst in bounty cherish:

   She carved thee for her seal, and meant thereby

   Thou shouldst print more, not let that copy die.

.

Shakespeare

 

 

Notes

wane (1): decline; age.

one of thine (2): a child.

youngly (3): in your youth.

convertest (4): change.

Herein (5): In marriage and children.

threescore year (8): sixty years.

would make the world away (9): would be the end of the world (due to lack of population).

for store (9): for breeding.

barrenly (10): without children.

Courtesy: http://www.shakespeare-online.com/sonnets/11.html

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: