వర్గం: కవితలు
-
మానవజాతికి చరమశ్లోకం … Edna St Vincent Millay, American
కాలువకి గండిపడింది, కరకట్ట కోసుకుపోయింది పంటచేలన్నీ ముంపుకిగురై, పశువులుమునకేశాయి నమ్ముకున్న నేల దూరమై, దొరికింది ప్రమాదకరంగా ఉంది ఎటుచూసినా వేళ్లతోసహా పెకలింపబడి కొట్టుకొస్తున్నచెట్లూ, పునాదుల్తో కొట్టుకొస్తున్న ఇళ్ళతో వరద భీభత్సం తప్ప మరేమీ లేదు ఇంతకష్టమూ పడి, చివరకి మనిషి తనజీవితం చావుకంటే భారమని తలచి తన నీడపై చప్పుడు లేకుండా ఈరోజు రాలిపోవలసిందేనా? లేదు లేదు. నీటిలో సూర్యుడు అస్తమించినతర్వాత ఇంకా సంధ్యవెలుగుంటుండగా తోటకి ఆవల ఒక్క తెడ్డు మీద వాలి ఉన్నప్పుడు చూసాను…. అదిగో…
-
కాలేజీ కిటికీ… DH Lawrence
గట్టిగాకాస్తున్న ఎండకి నిద్రలో జోగుతున్న నిమ్మచెట్టు వెలుగులు వణుకుతున్నట్టు నామీద నుండికదిలి, అలా కాలేజీ గోడ ఎగబాకుతున్నై. నేలమీద లేత నీలి రంగులో పచ్చిక చాలా బాగుంది నిశ్చలంగా ఉన్న డెయిజీలగుత్తులు మెత్తగా మనసు హరిస్తున్నాయి. వీధిలోకి వేలాడుతున్న కొమ్మలకి దూరంగా హద్దులుగీసి ఉన్న , వేసవి తెలుపులా స్వచ్ఛమైన కాలిబాటమీద తమనీడలు కాళ్ళకింద పడుతుంటే ప్రపంచం కుడి ఎడమల నడిచిపోతోంది. ఎక్కడో దూరంగా, ముష్టివాడి దగ్గు నాకు వినిపిస్తున్నా వాడికి నాణెం వేస్తున్న అందమైన స్త్రీ వేళ్ళుకనిపిస్తున్నాయి నేను…
-
మోచాత్ విళంబిత నృత్యగీతం … Sara Teasdale, American Poet
మసకవెలుతురు పడుగులా పరుచుకున్న గదిలో వాయులీనపు స్వరాలు పేక నేస్తున్నాయి గాలిలో అల్లుకుంటూ, పెనవేసుకుంటూ, చిమ్మచీకటిలో పసిడి మెరుగులు చిమ్ముతున్నై సంగీతం వెలుగుగా మారడం నేను గమనించాను. కానీ, ఒకసారి కమాను ఆగగానే ఆ కలనేత చెదిరిపోయి ఆ మెరుపు ముంచెత్తుతున్న రాత్రి కెరటంలో మునకేసింది. . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) ఆధునిక అమెరికను సాహిత్యం లో సారా టీజ్డేల్ ది ఒక ప్రత్యేక స్థానం. పదాల వాడుకలో…
-
Home-sickness … BVV Prasad, Telugu Poet
When there was no ruffle all ripples hid under the lake and water nestled in water rather nicely. When there was no streak of light all shadows ducked behind night and darkness reposed in downy darkness When everything was calm all sounds dissolved in silence, and serenity had spread out stately. *** Then, where did…
-
కుర్చీ వెనక నుండి … మార్గరెట్ మాహీ, న్యూజిలాండ్ కవయిత్రి
. మా కారు చాలా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా పోతుంది మాకు కొత్త కారు కొనుక్కునే తాహతు లేదు. దానికితోడు నాన్న దాని తాళాలు పారేసుకున్నారు. కారు లేకపోతే పని లేదు. పనిలేకపోతే జీతం రాదు. రోజు రోజుకీ మా పరిస్థితి దయనీయంగా మారుతోంది. నాన్నకి జుత్తు తెల్లబడిపోతోందంటే ఆశ్చర్యం లేదు. ఈ ఉదయం మరీ నిరాశాజనకంగా ఉంది . జేబులో బాకీల చిఠ్ఠాతప్ప చేతిలో చిల్లిగవ్వలేదు. కోపమూ నిస్పృహతో నాన్న చాలా చిత్రంగా ప్రవర్తిస్తున్నారు! ఇప్పటికే…
-
పారూ శకునాలు… బిందు కృష్ణన్, మలయాళ కవయిత్రి
గంజి వారుస్తూంటే, పట్టుతప్పి, గంజి వొలికి చెయ్యి కాలింది. “అంటే అదృష్టం తప్పుకుందన్నమాట” విచారించింది అమ్మ. చేతిలోని అద్దం లో నా ప్రతిబింబాన్ని ఛూసుకుని మురుస్తుంటే చేతిలోంచి అద్దం జారి తునాతునకలయిపోయింది… “ఓహో! రాబోయేది గడ్డుకాలం” వాపోయింది అమ్మ. అతనికి వడ్దిస్తుంటే, ఉప్పు వొలికిపొయింది “దెబ్బలాటలు తప్పవు” అని బాధపడింది అమ్మ. తప్పతాగి, కోపంతో బండబూతులు తిడుతూ నన్నూ, నా కూతుర్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు “అబ్బ! ఎంత అదృష్టమో!” అని సంబరపడ్డాను నేను. . మలయాళ మూలం:…
-
నీకు పదిహేడేళ్ళప్పుడు… Maria Zafar, Indo-Anglian Poet
. ఆమె ముసిముసినవ్వులు నీకు వినిపించేయంటావు. నీకు అప్పుడు పదిహేడేళ్ళు ఆమె ఈడేరిన అప్సరస నీ కలల బాల… లోలిత. ఆమె సడిచేయని ఊర్పులూ, రహస్యభాషణలూ ప్రేమలోని లోతులు తెలుసునంటావు నీకు అప్పుడు పదిహేడేళ్ళు ఆమె కుందనపు బొమ్మ, అమలిన అనాఘ్రాత కుసుమం ఎప్పుడూ పచ్చిగా ఉండే జ్ఞాపకం. ఆమె నిరాశామయ జీవనగాథలన్నీ అవగాహనచేసుకున్నాననీ ఆమె మనసు పూర్తిగా తెలుసుననీ ఏవేవో అంటావు నీకు అప్పుడు పదిహేడేళ్ళు ఆమె వేసవి నీరెండలో హాయిగానిద్రించే మెరుగుపెట్టిన మేలిముత్యం ఆమె…
-
మహా నగం …Jayant Mahapatra,Indo-Anglian Poet
మహానగం దాని తనుభారమంతటితో నేలకు బందీ అయి నిలుచున్నది అగాధ మనః తీరాలలో ఈ సాంధ్య చీకటివేళ నిశ్శబ్దాన్నీ, ఒత్తిడినీ అధికంచేస్తూ, తగ్గిస్తూ, పెంచుతూ. ప్రతి రోజూ పెద్ద అంగలేసుకుని నడిచే సూర్యరశ్మిక్రింద తునాతునకలైన నీడతో అది ఎవరైనా తమజీవితాన్ని పునర్నిర్మించుకుందికి అవకాశముందనడానికి ఉదాహరణగా నిలుస్తోంది. ధృఢంగా ఉన్నప్పటికీ నిర్వీర్యమై పోయి బహుశా, ప్రపంచం మాట్లాడాలని నిరీక్షిస్తోందేమో ఆగిన కాలం మళ్ళీ కదలాలనీ ద్వేషం శిధిలాలనుండి కొత్త సమాజం ఆవిర్భవించాలనీ. రోజల్లా ఎంతకీ తరగని ఆ కొండ ఎగుడు…
-
ప్రేమికులు… వీరన్ కుట్టీ, Malayali Poet
రెండు చేపలు వంతెన దాటుతున్న రైలు ప్రతిబింబం నీటిలో చూస్తూ పెట్టెలోకి ఎక్కిపోయాయి . పాపం! వాటికి తెలీదు ఒక సారి రైలు నది దాటి నేలమీద అడుగుపెట్టిన తర్వాత అవి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతాయని! . వీరన్ కుట్టీ Infatuation (మోహాన్ని) నీటిలోని ప్రతిబింబంతో, అదికూడ వంతెనమీద నుండి పరిగెత్తుతున్న క్షణికమైన రైలు నీడతో, పోలుస్తూ ఎంత భావుకతతో కూడిన కవిత చెప్పాడో గమనించండి. వయసులో ఉన్న యువతీ యువకులకి పరస్పరం కలిగే ఆకర్షణని ప్రేమగా…
-
ఎదురుపడ్డ మృత్యువు … Shiv K Kumar
ఆ నీలిరంగు గంటెనపూలు, ముసుగులోతప్పెట్లలా సడిలేకుండ, తిరోజ్ఞ్ముఖమౌతున్న సేనలా, చావువాయిద్యంలా చిత్రంగా గలగలలాడేయి. దాని భారీ పృష్టం మీద కూర్చున్న నా తెల్ల ఆల్సేషియన్ కుక్క ‘జ్యూస్’, ఎందుకో ఒక్క సారి ఏడుపు లంకించుకుంది కానీ, బాగా గాలి వీస్తున్న ఆ మధ్యాహ్నవేళ, దీవాను మీద మొగలాయీ తలగడలకు చేరబడి మహరాణీలా కూర్చున్న ఎనభై మూడేళ్ళ మా అమ్మతో చతుర సంభాషణ జరుపుతున్న నేను ఈ శకునాలేవీ గుర్తించలేకపోయాను . నేను చెప్పినదానికో, చెప్పనిదానికో గాని ఆమె…