వర్గం: కవితలు
-
వీడ్కోలు… వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్, అమెరికను
నేను మరణించి రేపు పూచే గులాబికి ఎరుపునౌతానన్న మనసునుండిన ఆలోచన కంటే మించినది మరొకటి ఎక్కడుంది. . ఈమాత్రానికే సంతసించే నా మనసుకి ఉన్నదొక్కటే విచారం మెల్లిమెల్లిగా ఈ మట్టి నన్ను క్రిందకి తొక్కిపెడుతుందని. . వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్ (1876-1959) అమెరికను . . The Farewell . What is more beautiful Than thought, soul-fed, That I may be the crimson of a rose When…
-
ఒకదాని వెనక ఒకటి… ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, బ్రిటిష్
ఒకదాని వెనక ఒకటి ఇసకరేణువులు జారుతున్నై ఒకదాని వెనుక ఒకటి క్షణాలు రాలుతున్నై కొన్ని వస్తున్నై, కొన్ని పోతున్నై అన్నిటినీ పట్టుకుందికి ప్రాకులాడకు. ఒకదాని వెనుక ఒకటి నీ బాధ్యతలు ఎదురుచూస్తునై ప్రతిదానిమీద నీ పూర్తి శక్తియుక్తులు వినియోగించు భవిష్యత్తుమీది ఏ కలలూ నిన్ను ఉల్లాసపరచనీకు ముందుగా ప్రతి ఒక్కటీ నీకేది నేర్పగలదో తెలుసుకో ఒకదాని వెనుక ఒకటి స్వర్గం నుండి ఆశీస్సులు సుఖసంతోషాలుగా నీకు ఇక్కడకి పంపబడతాయి ఎప్పుడు వచ్చినా వాటిని తక్షణం స్వీకరించు అలాగే…
-
తిరుగుబాటుదారు … జాన్ గోల్డ్ ఫ్లెచెర్, అమెరికను కవి
అతని కళ్ళకి గంతలు కట్టండి పాదాల దగ్గర తుపాకులు ఓటమితో అంతిమ విషణ్ణ మృత్యుగీతాలాలపించనిండి . అతని శరీరం మీద దుప్పటి కప్పండి ఇక అది కదిలే పని లేదు; తనకోసం ప్రాణాలర్పించినవారి వల్ల సత్యం మరింత ధృఢంగా నిలబడుతుంది . అతనిపుడు తన స్వంత రహస్య స్థావరం చేరుకున్నాడు; అందులోకి చొరబడడానికి మనం సాహసిస్తే ప్రాణహీనమైన ఈ ముఖాన్ని చూసే అవకాశం ఉండదు . జాన్ గోల్డ్ ఫ్లెచెర్ (January 3, 1886 – May…
-
The Sky… Prasuna, Telugu, Indian
The sky is a great painter who draws upon herself umpteen self-portraits! To the sky tired of baby-sitting the Sun during the day, and the Moon at night, God shall permit a night off only on the new moon day. Yet, The sky shall not rest but loses herself in gossip gathering all stars about…
-
విశ్వాత్మ… రూమీ, పెర్షియన్ కవి, సూఫీ తత్త్వవేత్త.
ఈ మాటలు నేను ఇప్పుడు చెబుతున్నవి కావు, కాలాదినుండి వెలుగు తూలికతో రాసినవి. సత్యానికి రంగూ లేదు, వాసనా లేదు ఏ ఒకరి ప్రయాసలవల్లా, ప్రమాణాలవల్లా ఉత్పన్నమయేది, నిరూపించబడేదీ కాదు నువ్విక్కడికి రప్పింపబడ్డావు గనుక నీకో స్వర్గ రహస్యం చెబుతాను విను: “ఎవ్వరేమి చెప్పినా, ఏమి రాసినా ఆ రాసింది నువ్వే… స్వయంగా నువ్వే! నువ్వే జీవితానికి వాహికవి; ఈ విశ్వానికి ఆత్మవి! సంచరిస్తున్నా, సమాధిలో ఉన్నా, వేదనలోనూ, నిస్పృహలోనూ నీ జీవిత పర్యంతమూ నీ…
-
నేను శృంఖలాల బద్ధుణ్ణి… అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్, రష్యను
ఓ గులాబి కన్నియా! నేను శృంఖలాల బద్ధుణ్ణి. అయినా, ఈ బంధాల కాపలాదారులను చూసి సిగ్గుపడను; దట్టమైన కొమ్మలగుబురులలో కోకిలకూడ బందీనే, ఆ రెక్కల రేడు వనవాణికవులలో కలికితురాయి; కంటికింపైన ఒక సొగసరి గులాబికి చూపు మరల్చలేని మధురమైన దాస్యం చేస్తూ… ఇంద్రియ నిగ్రహాలను సడలించగల చీకటి ముసుగు వివశతలో, ఆమెకై లలితమధురమైన కుహుకుహూ రాగాలాలపిస్తుంది… . అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్ 6 June 1799 – 10 February 1837 రష్యను . . I am…
-
నగరపు పై కప్పులు… ఛార్ల్స్ హేన్సన్ టౌన్, అమెరికను కవి
ఇంటికప్పులారా! ఇంటికప్పులారా! మీరేం దాస్తున్నారు? దుఃఖితుల్నీ, దుష్టుల్నీ, జ్వలిస్తున్న ప్రేమికుల్నీ, మేధావుల్నీ, మూర్ఖుల్నీ, దిక్కులేని దీనుల్నీ; ఇంటికప్పులు, ఇంటికప్పులు దాస్తున్నై చింతలూ, వంతలూ. . ఇంటికప్పులారా! ఇంటికప్పులారా! మీ రే పాపాలు చూస్తున్నారు? మీ మీదుగా ఆకాశంలో బొల్లిమబ్బులై కొట్టుకుపోతున్నై, క్రింద సంవేదనలూ, దుఃఖాలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నై ఎప్పటిలా, పాతపాటే, జీవనపోరాటం కొనసాగించడానికి. . ఇంటికప్పులారా! ఇంటికప్పులారా! దౌర్భాగ్యులు, బందీలూ, పేరుచెప్పాలంటే జాలేస్తుంది… వాళ్ల మానాల్ని కాపాడండి: చుక్కల్ని మరుగుపరచడానికే మిమ్మల్ని మనిషి నిర్మించాడు…
-
దుఃఖంతో చెలిమి .. ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, అమెరికను
నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకుని “కష్టం గట్టెక్కిపోతుందిలే. భవిష్యత్తులో మంచిరోజులకోసం చూడు. ఈ రోజు సంగతి మరిచిపో!” అని ఆమెకు చెప్పకు. నీకింకా చెప్పాలని ఉంటే, కష్టాలు వృధాగా రావనీ, అవి కలిగించే బాధకన్నా మిన్నగా నేర్చుకోగల గుణపాఠాలుంటాయని చెప్పు. . “నువ్వు త్వరలోనే ఇనన్నీ మరిచిపోతావులే”… అంటూ, అరిగిపోయినఓదార్పువచనాలతో ఆమెని మోసగించకు; అది చేదు నిజం అన్న మాట నిజమే, కానీ, విచారించవలసిన విషయం; “ఇతర వ్యాపకాలపై మనసు తిప్పుకో” మనీ “ఉల్లాసం కలిగించే విషయాలు…
-
నేను విన్న సంగీతం … కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి
నేను నీతో కలిసి విన్న సంగీతం, కేవలం సంగీతం కాదు నేను నీతో కలిసి పంచుకున్న రొట్టె … కేవలం రొట్టె కాదు, నా ప్రక్కన ఇప్పుడు నువు లేవు… కనుక అంతా శూన్యమే, ఒకప్పుడు సౌందర్యంతో దీపించినదంతా ఇపుడు జీవకళ కోల్పోయింది. . ఒకప్పుడు నీ చేతులు ఈ మేజానీ, ఈ పాత్రల్నీ స్పృశించేయి నీ వేళ్ళు ఆ గాజుపాత్రని పట్టుకోగా చూడడం నాకింకా గుర్తే, ప్రేయసీ! ఈ వస్తువులేవీ నిన్ను గుర్తుపెట్టుకోకపోవవచ్చు, కానీ,…
-
The Gold Seekers… Hamlin Garland, American
కలలుగనే ఈ “కలాకారులు” పక్కనుంచి వెళ్ళడం చూశాను వాళ్ళ అడుగులవెనక కొంత దూరం నడిచాను కూడా ప్రతి వ్యక్తి చూపులూ నింగి వంకే ప్రతి వ్యక్తి ముఖంలోనూ ఆశలవెలుగే నిరాశామయ జీవితాలూ, వేదననుండీ వాళ్ళంతా పరుగు వాళ్ళకళ్ళల్లో అందమైన భవిష్యత్తూ, బంగారపు వెలుగు దహించే ఆకలి బాధ కొందరిని ఉన్మత్తులని చేస్తే బానిస కొలుముల దగ్గర తెల్లారిన బ్రతుకులు కొందరివి. పనిముట్లకు బానిసలైన వీళ్ళందరూ వాళ్ళ “బానిసభత్యా”లని వెనక్కి గిరాటువేసారు వాళ్ళు భవిష్యత్తుని కలగనటం లెదు మీసం…