వర్గం: కవితలు
-
సుందర నదానికి…. ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను
ఓ సుందర నదమా*! స్ఫటికంలా స్వచ్ఛంగా, తళుకులీనుతూ, జలజలా గలగలా పరుగులిడి ప్రవహించే నీటితో, నీ సయ్యాటల హేలతో, మనసులో ఏ దాపరికమూలేక తుళ్ళిపడే ఆల్బెర్టో కూతురిలా, రాశీభూత సౌందర్యపుజిగికి నీవొక ప్రతీకవు. . ఆమె ఒకసారి తన నీడని నీలో చూసుకునే వేళ అది ఒకపక్క మెరుస్తూనే, ఆర్ద్రతతో వణుకుతుంది; ఎందుకంటే,అప్పుడు, అంత అందమైన సెలయేటివీ తనని ఆరాధిహించే ప్రియునిలా కనిపిస్తావు; అతని మనసులోనూ, నీ తరంగాలమీదలా ఆమె ప్రతిబింబం గాఢంగా ముద్రించబడి ఉంది; అతని…
-
Mirror Image … Sowbhagya, Telugu, Indian
In a still-water-like mirror rolling its eyes once, rollicking with laughter next, motionless now and effervescing with activity the next moment… dithers your image. In the full-length mirror up there, lies your itinerant reflection. Hiding from its view and stealing glances with it… stand I. Oooooh! That gleaming rosy countenance is so inviting to kiss.…
-
తళుకు … కీర్తనా విశ్వనాథ్, మలయాళం, భారతీయ కవయిత్రి
ఆమె చనిపోయింది. ఇక శవాన్ని ముస్తాబు చెయ్యడం మాత్రమే మిగిలుంది. . ఆ పొడుచుకొస్తున్నట్టున గుడ్లు మూయడం అయింది. పెన్సిలుతో దిద్దుకోడంవల్ల నల్లబడ్డ ఆమె కనుకొసల వేలాడుతున్న నిలకడలేని చివరి ఆశలకి వీడ్కోలుపలకడం పూర్తయింది. . ఈ రోజు కళ్ళజోడు తియ్యకుండా స్నానం చెయ్యొచ్చు నువ్వు! . ఊ… ఊ… త్వరగా కానివ్వండి. సమయం మించిపోతోంది. పాడెమీదకి తరలించడానికి అలంకరణ ముగించండి… . ముందు నుదుట చుక్క పెట్టండి… అదే, బొట్టు పెట్టండి. సిందూరంతో… దాన్ని గుండ్రంగా…
-
సందు మలుపులో… ఛార్ల్స్ హేన్సన్ టౌన్, అమెరికను
. అంతులేని ఈ మహానగరంలో, సందు మలుపులోనే నాకొక మంచి చిన్ననాటి స్నేహితుడున్నాడు, అయినా రోజులు, వారాలు వెళ్ళిపోతున్నాయి, నేను గుర్తించేలోపునే ఒక ఏడాది గడిచిపోయింది. నా స్నేహితుడిని నేను కలవడం అవడం లేదు. జీవితం ఒక పరుగులా, అంతా హడావుడైపోయింది. మా చిన్నప్పుడు వాళ్ళింటి తలుపు నేను తట్టినరోజులూ మా ఇంటి బెల్లు అతని మ్రోగించిన రోజులూ లానే తనంటే నాకు ఇష్టమని అతనికికూడా తెలుసు, ఇప్పుడు ఇద్దరికీ తీరికలేదు, అలసిపోయాం. …
-
పరిహాసానికి పరాకాష్ఠ … ఆలివర్ వెండెల్ హోమ్స్ , అమెరికను
. మాంఛి సంతోష సమయంలో ఒకసారి నేను నాలుగు మాటలు రాసేను కవితలా. అలవాటు ప్రకారం, చదివినవాళ్ళు ఓహో అద్భుతంగా ఉంటుందని అంటారనుకున్నాను. అవి ఎంత సరసంగా, అద్భుతంగా ఉన్నాయంటే మామూలు పరిస్థితుల్లో అంత అసభ్యంగా గట్టిగా నవ్వనినేనే పగలబడి నవ్వలేక చచ్చాను. మా పనివాడిని పిలిచేను. అతనొచ్చేడు; నాలాంటి అర్భకుడు పిలవగానే వచ్చేడంటే అతనెంత మంచివాడో కదా! అతను మంచి అవయవపుష్టి ఉన్నవాడు. “ఇవి ప్రింటరుకి తీసుకెళ్ళి ఇవ్వు” అన్నాను, అంటూ, ఇలా అలవాటైన హాస్యధోరణిలో…
-
వీడ్కోలు … డొరతీ లారెన్స్ మాన్, అమెరికను
వీడ్కోలుకి సమయం దగ్గరపడి పగలు నెమ్మదిగా ముగుస్తున్నప్పుడు, కొండలమీదా, మైదానాలమీదా చీకటి చిక్కబడుతున్నప్పుడు నేలమీద ఇక ఏ దుఃఖమూ ఏ వేదనా, ఏ యాతనా లేనప్పుడు మనం ఇంకా పోట్లాటలతోనూ, కలహాలతోనూ అలసిపోవాలా? . కడకు, జాడలు చెరుగుతూ సమీపంలో నక్షత్రాలు మెరుస్తూ విజయగంధాలని శ్వాసిస్తున్నప్పుడు; మనకు వినిపిస్తున్న గొంతుకలు చరిత్రను పునీతంచేసిన ఉదాత్తులైన మన సహచరులవైనప్పుడు, మనం పోతూ, ఒక నిముషపు శోకానికైనా నోచుకోగలమా? . ఆ డేగ కాళ్ళు అందుకునే ముందు ఒక్క క్షణకాలం…
-
ఒక నాటు రోడ్డు ప్రక్క దృశ్యం… మేరీ లూయిజ్ హెర్సే అమెరికను
ఈ “కేప్ కాడ్” ఆకాశం క్రింద ప్రతి పొలం పక్కనా, రాతిమడుగు పక్కనా కళ్ళులేని ముఖంలా పదే పదే ఎదురౌతున్న శుష్కించిన గాదెలు చూస్తున్నా. . ఎండకీ ఎండి, వానకి తడిసి, మట్టికొట్టుకుని రాటుదేరిన నిర్మలంగా చూసే పిల్లల్ని పిలిచే పని పాట్లతో గరుకెక్కి, గంతలుబడిన ఆ స్త్రీ చేతుల్ని నేను మరువలేను. . సౌందర్యమూ, శ్రమా ఒకే ‘కాడి’కి జతకూర్చినట్టు అటు బొద్దుగా, గుండ్రంగా దిసమొలతొ పిల్లలూ ఇటు వంగి కృషిచేస్తున్న కర్షకస్త్రీలూ. . మేరీ…
-
గాఢ హేమంతంలో … ఏమీ లోవెల్, అమెరికను
ఇష్టుడా! మనిద్దరం తోటలోపూసే పుష్పాలవంటి వాళ్ళమి. ఒకరు ఊదారంగయితే రెండోవారు ఎరుపు. ఒంటరిగా ఓమూల వాడిపోయిన ఈ తోటలో . ఈ వనంలోని మొక్కలన్నీ పీకి కొత్తవి వేసేరు ఒక ఎండిపోయిన ఆకు రెండోదానిని రాసుకుంటూ నాటి పూరేకుల సంగీతం ప్రతిధ్వనితోంది. ఇప్పుడు నువ్వూ నేనే దానికి తలలూచేది. . మనతో ఎన్నో కలిసి ఉండేవి; అన్నీ నేడు వాడిపోయేయి. ఇప్పుడు మనిద్దరమే ఎరుపూ ఊదారంగుల్లో మిగిలున్నాం; మంచు కడిగిన సుప్రభాతవేళల్లో మనిద్దరమే సూర్యుడు ఎదుగుతుంటే రాగరంజితులమై…
-
ఈ యుగపు ఆర్తి .. హేమ్లిన్ గార్లాండ్, అమెరికను
. నేను న్యాయంగా ప్రవర్తించాలంటే ఏమిటి చెయ్యాలి? నేను సంపాదనకి ఏ మార్గాన్ని అవలంబించాలి? ఈ ప్రపంచానికీ— ఇక్కడి దుఃఖానికి ఏమిటి చెయ్యాలి? ఈ సంక్లిష్ట కూడలిలో సరియైన దారి చూపించు (ప్రభూ!) నా తెలితక్కువదనం నుండీ, దుఃఖము నుండీ కడతేర్చి బాధని ఎలా నివారించాలో ఉపదేశించు! నా వేలికున్న ఉంగరాన్ని ఊడబెరికి గుమ్మం ముందర నిలబడ్డ యాచకునికి ఇద్దునా? నా దగ్గర ఉన్న ప్రతి విలువైన వస్తువునీ తీసి పేదల చేతులలో ఉంచుదునా? నేను న్యాయబద్ధంగా…
-
నేను పాడుకుంటూ వస్తా… జేకబ్ అస్లాండర్, అమెరికను
. వానవెలిసిన తర్వాత కోసిన పచ్చిక గుప్పుమని వేసే కమ్మని వాసనలనీ; పొట్టమీదున్న చేలోని గింజలమీంచి సుతారంగా జారే చల్లటి నీటిబిందువుల అలలనీ; మైదానం మీద తేలిపోతూ, ముంచెత్తుతున్న వెలుగునీ పాడుకుంటూవస్తాను. . శరత్కాలంలో విరగబూచిన పువ్వుల్నీ; లోయలలో ప్రతిధ్వనించే పిలుపులకి గుంపులు గుంపులుగా ఎగిరే పిచ్చుకలనీ; ఆ పిచ్చుకలని చెల్లాచెదరుచేసే పడమటి గాలినీ ఆలపిస్తూ వస్తాను; . డిసెంబరు నెలలో కత్తిలాకోసే పదునైన తెల్లని మంచునీ; నివురుగప్పుతున్న సూర్యాస్తమయవేళ, రివ్వుమని వీచే విసురుగాలికి ఉక్కులా పారే…