వర్గం: కవితలు
-
శుక్రవారం … ఫరూవే ఫరుక్జాద్, పెర్షియన్ కవయిత్రి
ప్రశాంతమైన శుక్రవారం బావురుమంటున్న శుక్రవారం పాత ఇరుకుసందుల్లా భయపెట్టే శుక్రవారం బద్ధకంగా అనారోగ్యపు ఆలోచనల శుక్రవారం వంకరటింకరగా విస్తరించిన దుర్గంధపు శుక్రవారం ఎదురుచూడడానికి ఏదీలేని శుక్రవారం అణిగి ఉండవలసిన శుక్రవారం… శూన్యమైన ఇల్లు ఒంటరిగా దివుదివుమంటూన్న ఇల్లు యువత తిరుగుబాటుకివ్యతిరేకంగా మూసిన ఇల్లు వెలుగుకోసం కలలుగనే చిమ్మచీకటి ఇల్లు ఒంటరితనం, శకునాలూ, అస్థిరతా కూడిన ఇల్లు కర్టెన్లూ, పుస్తకాలూ, బీరువాలూ, చిత్రపటాలూ ఉన్న ఇల్లు ఆహ్! నా జీవితం నిశ్శబ్దంగా, నిర్మలంగా ఎలా సాగిపోయిందో గంభీరంగా ప్రవహిస్తున్న…
-
ఖగోళంతో కసరత్తు … పీట్ హెయిన్, డేనిష్ కవి
నక్షత్రాలు పొదిగిన రాత్రి ఆరుబయట తలక్రిందులుగా నిలబడి కాళ్ళు పైకి ఆకాశంలోకి వేలాడేలా విడిచిపెట్టండి. తారానివహంతోకూడిన ఆకాశమే కాసేపు మీరు నడవడానికి ఎంచుకున్న ఆధారం అనుకొండి. శీతశైలాలూ, మహానగాగ్రాలూ, మరుగుతున్న అంతశ్శిలాద్రవమూ నీరూ, ఇనుమూ, ఖనిజాలతో కూడిన అపారమైన ఈ భూగోళపు బరువు మీ తలపై మోస్తున్నట్టు ఊహించి… కాసేపు చిత్రంగా దృఢమైన ఈ గ్రహం బరువు అంతే చిత్రంగా స్థిరమైన మీ తలపై నిలకడగా నిలబెట్టండి . పీట్ హెయిన్ 16 December 1905 –…
-
పున్నమి రేయి… జాన్ ఫ్లెచర్ ఇంగ్లీషు కవి
ఈ రేయి ఎంత అందంగా ఉంది! ప్రశాంతవాతావరణంలో మంచువంటి చల్లదనం; మబ్బుగాని, మసకగాని, ధూళిగాని, నలకగాని ఈ నిర్మలమైన ప్రకృతి ప్రశాంతతని భగ్నం చెయ్యడం లేదు. నీలి నీలి రోదసి కుహరాల్లోంచి అదిగో దూరంగా దివ్యమైన పూర్ణచంద్రబింబం దొర్లిపోతోంది. నిలకడగా కురిసే ఆ వెన్నెలల వెలుగులలో దిగువన ఒక ఎడారి వృత్తం పరుచుకుని ఉంది సముద్రంలా ఆకాశపువడ్డాణాన్ని తొడుక్కుని, ఆహ్! ఈ రేయి ఎంత అందంగా ఉంది! . జాన్ ఫ్లెచర్ 1579–1625 ఇంగ్లీషు కవి, నాటక…
-
ఎడబాటు… థామస్ స్టాన్లీ, ఇంగ్లీషు కవి
నా ప్రియమైన స్వామీ! దూరంగా వెళ్తున్నా నీ కౌగిటినుండి విడదీయబడి నన్ను సమ్మోహపరచిన వాటికంటె న్యూనమైన ఆకర్షణలవైపు. ఇక ముందెప్పుడైనా దుఃఖమే నన్ను పొట్టనబెట్టుకుందని నీకు తెలిస్తే, రా! నా సమాధిమీద ఒకటో, రెండో కన్నీటి చుక్కలు రాల్చు. నీ నిట్టూర్పులతో నా ప్రశాంతమైన నిద్రని భగ్నం చెయ్యి. నీ రోదన విని, మృతిలో కూడా నేను హర్షిస్తాను ఏమో! నీ కన్నీళ్ళకి నా చితాభస్మాన్ని కొత్త జీవంతో నింపగల సత్తా ఉండొచ్చు, లేదా నన్నొక పువ్వుగా…
-
రాతి మీది నాచు… జోస్ మెండోంకా, పోర్చుగీసు కవి
సాహసయాత్రికులూ, దేశదిమ్మరులూ, ఎన్నడో అదృశ్యమైపోయారనుకుంటున్న యాత్రీకులూ, బెర్బరులూ, ఆలమందలుతోలుకునే సంచార జాతులూ, దేశబహిష్కృతులూ… క్షణక్షణమూ ఎదురయ్యే ఊహించలేని అవసరాలు కాక పవిత్రగ్రంధాలే ధర్మశాస్త్రాలుగా భావించే మనలాటివాళ్ళకి ఏమి చెప్పగలరు? మన చైతన్య పరిధికి అతీతంగా, వాళ్ళు వసించే చోటులలో ఒక ప్రేతాత్మల భాష ఉంది అది ఏ భాషా చెప్పలేని విషయాలు చెబుతుంది: నక్షత్రాలు ఒకదాన్నొకటి ఢీకొన్నపుడు వెలుగుతునకలు పుడతాయనీ; తరుము కొస్తున్నపుడు జింక పిల్ల ఎన్నో అక్షరాల సోయగాలతో పరుగెడుతుందనీ; అఖండ హిమపాతము తర్వాత, మొనదేలిన…
-
స్మారక-తిప్ప గుర్తుంచుకో… యెహుదా అమిఖాయ్. ఇజ్రేలీ కవి
నాకు బదులు ఈ స్మారక తిప్పని గుర్తుంచుకో, అది ఉన్నది అందుకే. నా సహచరులని గుర్తుంచుకో, వాళ్ల పేరు పెట్టిన వీధిని గుర్తుంచుకో, బాగా పేరుపడ్డ భవనాన్ని గుర్తుంచుకో. దేవుని పేర వెలిసిన ఆరాధన మందిరాన్ని గుర్తుంచుకో, తోరాటోరాలోని వ్యాఖ్యానాలను గుర్తుంచుకో, స్మృతిగీతాలని గుర్తుంచుకో, చరిత్రని తమలో ఇముడ్చుకున్నరంగురంగుల జండాలను, వాటిలో చుట్టబడిన అమరవీరుల దేహాలనూ గుర్తుంచుకో అవి ఏనాడో మట్టిలో కలిసినై; ఆ మట్టిని గుర్తుంచుకో. వాకిటముందు కళ్ళాపినీ, పునర్జన్మనీ గుర్తుంచుకో. భూమిమీద పశుగణాలూ, ఆకాశంలోని విహంగాలూ గుర్తుంచుకో.…
-
కలలు…. లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి
కలల్ని సజీవంగా ఉంచుకో! ఎందుకంటే, కలలు గనక మరణిస్తే జీవితం రెక్కలు తెగిన పక్షిలా ఇక పైకి ఎగరలేదు. కలల్ని గట్టిగా పొదువుకో! ఎందుకంటే, కలలు గనక జారిపోతే జీవితం మంచుకప్పిన మైదానంలా ఊసరక్షేత్రమైపోతుంది. . లాంగ్స్టన్ హ్యూజ్ February 1, 1902 – May 22, 1967 అమెరికను కవి. . Langston Hughes . Dreams . Hold fast to dreams For if dreams die Life is a broken-winged…
-
శిశువు… సిల్వియా ప్లాత్, అమెరికను కవయిత్రి
Image Courtesy: http://www.plant-and-flower-guide.com/snowdrop-flower.html . నిర్మలమైన నీ కనులు అత్యంత సుందరంగా ఉన్నాయి. వాటిని నేను రంగులతో, పక్షులతో నింపదలుచుకున్నాను, ఒక కొత్త జంతు ప్రపంచం దానికేపేరు పెడతావో నువ్వే ఊహించు— ‘తుహినకుసుమ’మా, మోహన మురళీ చిన్నారీ… మొనదేరిన అంకురం, పోలికలు ఉదాత్తంగా సాంప్రదాయికంగా ఉండే సరస్సు… వ్యాకులమైన మనసుతో చేతులు నులుపుకుంటూ, చుక్కలెరుగని చూరుకింద కూచోడం కాదు. . సిల్వియా ప్లాత్ October 27, 1932 – February 11, 1963 అమెరికను కవయిత్రి (గమనిక:…
-
దురహంకారం … జాన్ వెబ్స్టర్, ఇంగ్లీషు కవి
వసంత ఋతువులోని పూలన్నీ మన సమాధులని గుబాళింపజెయ్యడానికి సరిపోతాయి; పాపం అవన్నీ మంచి వయసులో ఉన్నాయి, మనిషి చూడబోతే అలంకరించుకునేది కాసేపే: పుట్టినప్పటినుండి మన ప్రగతి ఒక సారి గమనించండి మనం పుడతాం, పెరుగుతాం, తిరిగి మట్టిలో కలుస్తాం. టాటాలు చెప్పుకుంటాం, అన్ని సుఖాలకీ, అన్ని బలహీనతలకీ వశమౌతాము ! తియ్యని మాటైనా, నిశితమైన చూపైనా, పరిమళాల్లా, నాలుగుదిక్కులా వ్యాపించి నశించవలసిందే. సూర్యుడికోసం నిరీక్షించే నీడలా, అందుకనే, ఈ తంతు అంతా జరుగుతుంటుంది. రారాజుల నిష్ఫలమైన కోరిక,…
-
దైవానికి ప్రేమగీతాలు… రిల్కే, ఆస్ట్రియన్ కవి
నువ్వే భవిష్యత్తువి, ప్రభాత సంధ్యల విశాల కాలమైదానాల విరిసే అరుణారుణ గగనానివి నువ్వు. నిశాంతాన్ని సూచిస్తూ కూసే తొలికోడి కూతవి, తుహిన బిందువువీ, ప్రాభాత భేరీవీ, కన్నియవీ, అపరిచితుడివీ, తల్లివీ, మృత్యువువ్వీ నువ్వే. మేము కనీ వినీ ఎరుగని కారడవిలా… మేము కీర్తించక, శోకించక, వర్ణించక గడిపే మా దైనందిన జీవితాలలోంచి ప్రభవించే అనేకానేక రూపాలుగా నిన్ను నువ్వు సృజించుకుంటావు వస్తువులలోని అంతరాంతర ప్రకృతివి నువ్వు, ఎన్నడూ నిర్థారించి చెప్పలేని తుది పలుకువి నువ్వు. మాకొక్కరికీ ఒక్కొక్కలా నువ్వు…