వర్గం: కవితలు
-
అపార్ట్ మెంటు ఇళ్ళ వెనక వసారాలు… మేక్స్ వెల్ బోడెన్ హీం, అమెరికను కవి
నీ కళ్ళు లవండరులా తెల్లగా కళకళలాడే రోజుల్లో ఎప్పుడో నువ్వు కోసిన రేగి కాయని నోటితో కొరుకుతూ రేగి చెట్లగూర్చి ఎండలో పాటలుపాడుకునే ఓ పనిపిల్లా! సూర్యుడూ చంద్రుడూ, నక్షత్రాలూ ఎరుగని ఆకాశమూ ముఖం మీద ఆర్ద్రతాచిహ్నాలింకా చెరగని శవం లాంటి ఆకాశమూ నీ కళ్ళనుపోలిన రంగులోనే ఉంటాయిలే. నువ్వున్న ఇంటి మీది వసారాలో ఉన్న ఇద్దరు స్త్రీల ముఖాలు ఎన్నడూ వర్షం ఎరగని నేలలా ఎర్రబడి ఉన్నాయి; వాళ్ళకళ్ళు నీరంతా పోయి ఏమూలో కాస్త తడిమిగిలిన…
-
బోనాపార్టే రోడ్డు … జోసెఫ్ వారెన్ బీచ్, అమెరికను కవి.
సాదా రొట్టెలూ, నీ కాఫీ మాత్రమే అడిగి తీసుకుని నువ్వు బల్ల దాటి వస్తున్నపుడు, అక్కడ అన్నీ జాగ్రత్తగా గమనిస్తున్న యజమానురాలిని పలకరించిన తర్వాత మైధునంలో ఉన్న పక్షులని దాటేటంత నెమ్మదిగా లోనకి ప్రవేశించి, వార్తాపత్రిక అంచుమీదుగా వివేకంతో చూడమని అడ్గుతునాను. ఆదిగో ఆ మూల అస్పష్టంగా, ఏ మాటూ లేని ఆ మేజాబల్ల వెనక స్త్రీ పురుషులిద్దరు అనుకున్నట్టుగా కలుసుకుని మౌన సంభాషణ కొనసాగ్ఫిస్తున్నారు. బయట కాలిబాటమీద చక్కని వెలుగు వెల్లువెత్తుతోంది; దూరంగా గుట్టమీద పనిపిల్ల…
-
ఆత్మ-వర్షపు చినుకూ… సిడ్నీ లేనియర్, అమెరికను కవి
తేలికపాటి చినుకులు పడి సముద్రమ్మీద ముడుతలు పడుతాయి తర్వాత వెంటనే మాయమైపోతాయి అస్సలు జాడలేకుండా. మనకి అక్కడ వర్షం పడిందని కూడా తెలీదు ప్రతిచినుకూ గుండ్రంగా చేసిన ముడతలు చూసి ఉండకపోతే. అలాగే, కొన్ని ఆత్మలు మనజీవితంల్లో ముడుతలు సృష్టించి ఈ తనూవారాశి అలజడుల్లో సమసిపోతాయి. జీవితవదనంమీద ఈ ముడుతలు లేకపోయి ఉంటే ఆత్మకి అక్కడ చోటుందని కూడా ఎవరికీ ఎరుక ఉండదు. . సిడ్నీ లేనియర్ February 3, 1842 – September 7, 1881)…
-
There Comes A Day… Saif Ali Gore Syed, Indian
1 There comes a day So full of grief, that its gloom overwhelms The joy of razing Babri Masjid to the ground. 2 That day is not far off Dawns sooner than the Doomsday prophesied in Quran and Bible That day is too close and comes doubling up. 3 That day … there will be…
-
భల్లూకపు కౌగిలి … మైకేల్ ఓండాట్షీ, కెనేడియన్ కవి
తనదగ్గరకి వచ్చి గుడ్ నైట్ చెప్పి ముద్దివ్వమంటాడు గ్రిఫిన్. అలాగేలే అని నేను అరుస్తాను. చేస్తున్నపని పూర్తిచేసి, తర్వాత మరొకటి, మరొకటి పూర్తిచేసి మెల్లిగా నడుచుకుంటూ మా కుర్రాడి గదివేపు తిరుగుతాను. వాడు నవ్వుతూ రెండుచేతులూ చాచుకుని నేనివ్వబోయే భల్లూకపు కౌగిలివంటి గాఢాలింగనానికి ఎదురుచూస్తుంటాడు. అయినా, నా ఆనురాగానికి ఆ అమానవీయమైన పేరేమిటి? గట్టిగా హత్తుకుంటే మృత్యువు చూపిస్తుందది. నేను హత్తుకుంటే, వాడి లేత ఎముకలూ వెచ్చని మెడా నన్ను అతుక్కుంటాయి. ఆ పైజమాలోని సన్నని బిగువైన శరీరం…
-
పాఠకుని ఎంపిక … టెడ్ కూసర్, అమెరికను కవి
ముందు ఆమె అందంగా ఉండాలి ఒక ఏకాంతపు మధ్యాహ్న వేళ నా కవిత్వ పుస్తకం దగ్గరకి నడవాలి, తలస్నానంచేసి వచ్చిన ఆమె మెడదగ్గర జడ ఇంకా తడిగా ఉండాలి. ఆమె రెయిన్ కోటు తొడుక్కోవాలి అది కూడా బాగా పాతది, డబ్బుల్లేక ఎన్నాళ్ళబట్టో ఉతకక మురికిగా ఉండాలి. ఆమె కళ్ళజోడు తీసి, పుస్తకాల షాపులో నా కవిత్వ పుస్తకం పేజీలు తిరగేసి, తిరిగి దాన్ని పుస్తకాల షెల్ఫ్ లో ఉంచెస్తుంది. ఆమె తనలో ఇలా అనుకుంటుంది, ”…
-
ముదిమి – వయసు… ఫ్రాన్సిస్ విలియం బూర్డిలాన్, ఇంగ్లీషు కవి.
చాలాకాలం క్రిందట, ఒక వేసవి ఉదయాన ఆడుకుంటున్న పాప పక్కనించి వెళ్ళాను; అలా పక్కకి రాగానే, చిన్నతనపు ఉత్సాహంతో “దా! మనిద్దరం ఆడుకుందాం!” అని పిలిచింది. కానీ నా చూపులు దూరానున్న శిఖరం మీద ఉన్నాయి చీకటిపడేలోగా అదెక్కగలిగితే సంతోషమే. అందుకని కొంత అసహనంతో అన్నాను: ” లేదు! నేను నీతో ఆడడానికి మరీ ముసలివాడిని” అని. చాలా ఏళ్ళు గడిచిపోయేక, శీతకాలంలో నా కాళ్ళలో కొండలెక్కగల సత్తా సన్నగిలేక చక్కని పచ్చికబయల్లో ఒక…
-
వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా కవిత రాయమన్నప్పుడు… హీడెన్ కరూత్ , అమెరికను కవి
నిజానికి నాదగ్గర ఒకటేమిటి ఒకటికంటే ఎక్కువే ఉన్నాయి కవితలు వాటితో పాటే ఇదికూడా మీకు చెబుతాను ఆ పీడకల ఉందే, అదే, అల్జీరియా యుద్ధానికి వ్యతిరేకంగా ఒకటి రాసేను , మరొకటి కొరియా యుద్ధానికి వ్యతిరేకంగా మరొకటి నేను పాల్గొన్నదానికి వ్యతిరేకంగా నాకు గుర్తులేదు ఈ మూడూ కాకుండా ఇంకెన్నిన్నున్నాయో నేను కుర్రాడిగా ఉన్నప్పుడు అబిసీనియా, స్పెయిన్ హార్లాన్ కౌంటీలు… అందులో ఒక్కరంటే ఒక్కరు బతికిబట్టకట్టలేదు… గొంతుకలు బద్దలై ఆడ, మగ, పిల్లలు అన్నతేడా లేకుండా ఒక్కరు…
-
నేను రాస్తాను… మార్గరెట్ వాకర్. అమెరికను కవయిత్రి
నేను రాస్తాను నేను నా ప్రజల పాటలు రాస్తాను వాళ్లు రాత్రి చీకటిలో గీతాలు పాడడం వినాలి. ఏడ్చి బొంగురుపోయిన వాళ్లగొంతులలో కడపటి స్వరాన్ని నేను పట్టుకోగలగాలి. నేను వాళ్ళ కలల్ని మాతలలోకి మళ్ళిస్తాను వాళ్ళ ఆత్మల్ని స్వరాలుగా మలుచుకుంటూ… సూర్యుడి వెలుగువంటి వాళ్లనవ్వుల్ని ఒక పాత్రలో పట్టి చీకటి ఆకాశంలోకి వాళ్ళ నల్లని చేతులు విసిరేసి వాటిని నక్షత్రాలతో నింపుతాను ఆ వెలుగులని అన్నిటినీ కలిపి ఎంతగా నుజ్జు చేస్తానంటే ఉషోదయవేళ దీధుతులు విరజిమ్మే సరసులా…
-
చిన్నతనం… ఫ్రాన్సిస్ కార్న్ ఫొర్డ్, ఇంగ్లీషు కవయిత్రి
ఓ రోజు మేడమెట్లనానుకున్న కటకటాల్లోంచి మా పెద్దమ్మమ్మ’ఎట్టీ’ స్నేహితురాలు వెళ్ళిపోతున్నప్పుడు ఆమె మెడలోని పగడాల దండతెగిపోడం చూసేదాకా… నేననుకుంటూండేదాన్ని పెద్దవాళ్ళు బిగువైన మెడలూ, ముక్కు చుట్టూ ముడుతలూ చేతులమీద బాగా బలిసిన పాముల్లా నరాలూ గొప్పగా కనిపించడానికి ఎంచుకుంటారేమోనని. అవిదొర్లిపోతుంటే ఆమె వెదకడానికి తెగ అవస్థ పడింది. అప్పుడు నాకు అర్థమయింది, ఆమె ముసలితనమూ నా చిన్నతనమూ మా అధీనంలో లేనివని. . ఫ్రాన్సిస్ కార్న్ ఫొర్డ్ (30 March 1886 – 19 August 1960)…