వర్గం: కవితలు
-
చిన్న చిన్న కవులు… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఆకాశం నిర్మలంగా ఒక్క తారకా లేకుండా ఉంటే అంత అందంగా ఉండదు, అక్కడ ఉండే ప్రతి గ్రహమూ, సూర్యుడూ, చంద్రుడూ కంటికి ఇంపుగా కనిపించరు వాటి వెనుక చుక్కలవంటి ఆ నక్షత్రాల వల లేకుంటే. అలాగే, అందం తక్కువైనవాటికి కూడా వాటి స్థానం వాటికి ఉంది; సముద్రంకోసం ఆరాటపడే వారు సెలయేటి సౌందర్యాన్ని అనుభవించలేరు, అక్కడ ఒక నీలాకాశపు తునకేలేకుంటే, కొండలకి అందమెక్కడిదీ? అక్కడ ఎన్ని అందమైన గులాబీలుంటే ఉండుగాక! కనుక, కొద్ది కొద్దిగా కవితలు రాసే…
-
గూడు… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి
అలవాటుపడిన అన్ని చక్కనైన త్రోవలనీ విడిచి, నీ పెదాలకీ, కనులకీ వీడ్కోలు పలికి నిన్ను మరొక మనిషిలో కనుగొనే ప్రయత్నం … నీకు ప్రశంసా? నమ్మక ద్రోహమా? నేను పొందినదాన్నే ఎందుకు వెతుకుతున్నాను, అరచేతికి అందినదాన్నే ఎందుకు దూరాల వెతుకుతున్నాను? ఎందుకో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఎలాగైనా నిన్ను చివరకి పట్టుకోవాలని తపిస్తున్నాను. నాకు తెలిసిందల్లా ప్రేమకు లెక్కలేనన్ని ఆలంబనలున్నాయనీ, ఆకలిగొన్న కడుపు లెక్కలేనన్ని వీధులు తిరగాలనీ; సౌందర్యం ఒక కల, ఈ…
-
కొల్లగొను…జాన్ఎస్.మిల్లర్ జూనియర్
ఒక వసంతపు గులాబి ఇంత అందంగా విరియగలదని ఎన్నడూ కలగనలేదు. పోతూ పోతూ ఒక వసంతం నన్నింతగా కొల్లగొంటుందని ఎన్నడూ తెలుసుకోలేదు . . జాన్ ఎస్. మిల్లర్ జూనియర్ ఈ కవి గురించి సమాచారం ఇవ్వలేనందుకు చింతిస్తున్నాను. ఈ కవిత Poetry Magazine సెప్టెంబరు 1916 సంచిక లో వచ్చింది (దిగువ నిచ్చిన లింకు చూడుడు) Ravage I did not dream one summer’s rose Could blossom so luxuriantly.…
-
In Front of More Supermarket…
When friends reunite After twenty years Sometimes words find their bearing And sometimes, not. Hand literally the shakes. The embrace reduces the gap by half. Some forgotten melodies, some current affairs, And some future shock! Memories of missed pals unsettle for a while, And the mad race for life That left no time…
-
అల్లర్లు … ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి

నా జీవితకాలంలో ఈ నగరం తగలడిపోవడం రెండుసార్లు చూశాను. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం అన్నీ అయిపోయాక రాజకీయనాయకులు రంగం మీద కనిపించడం, వ్యవస్థలోని లోపాలు ఏకరవుపెట్టి దానిని మార్చడానికి పేదలకి అనుకూలంగా కొత్త చర్యలు చేపట్టాలని వాదించడం. మొదటిసారి ఏ మార్పులూ జరగలేదు. ఈ సారీ ఏ మార్పులూ జరగబోవు. బీదలు బీదలుగానే కొనసాగుతారు నిరుద్యోగులు నిరుద్యోగులుగానే కొనసాగుతారు. ఇల్లులేనివాళ్ళు ఇల్లులేనివాళ్ళుగానే మిగులుతారు. కానీ రాజకీయనాయకులుమాత్రంభూమ్మీద బాగా బలిసి, చక్కగా హాయిగా బ్రతుకుతారు..ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ August…
-
Relief… Manasa Chamarti, Telugu, Indian
O Vault of Heaven! When you sizzle all of a sudden With a streak of lightning Or, when I rattle feverishly To find expression to an idea What a turmoil it is! But when Once you melt down to drops… And I flow into a poem… What a relief of tranquility! . Manasa Chamarti Telugu…
-
ప్రాపంచిక సుఖాలకి వీడ్కోలు… ఏన్ కిలిగ్రూ, ఇంగ్లీషు కవయిత్రి
నశ్వరమైన సుఖాల్లారా! మీకు వీడ్కోలు బంగారు పూతపూసిన మిధ్యలు మీరు, తళుకులీనే బొమ్మలు చాలకాలం నా మనసు వశంచేసుకుని దారితప్పించారు రిక్తభక్ష్యాలతో నా కడుపునింపారు. చాలు! ఇక మీరు నా మనసుని పూర్వంలా మోసగించలేరు. ఎందుకంటే, ఇథాకా రాజు యులిస్సిస్ ని మోసగించిన మాయా సంగీతం మీరు వినిపించినా దృఢనిశ్చయంతో నా మనసునీ, నా కోరికలని అతన్ని వాడ స్తంభానికి కట్టినదానికంటే గట్టిగా నా వివేకానికి బంధించుకుంటాను. అపుడు, మీ మంత్రతంత్రాలు నా చెవి సోకినా అతనిలాగే,…
-
అనుభవశాలి … డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి
22nd August is 125th Birth Anniversary of Dorothy Parker వయసులో ఉన్నపుడు బలిష్ఠంగా, ధైర్యంగా ఉండేదాన్ని, ఓహ్, ఆ రోజుల్లో … తప్పు తప్పే, ఒప్పు ఒప్పే! నా రెక్కలు విప్పుకుని, నా జెండా ఎగురేసుకుంటూ ప్రపంచంలోని అన్యాయాన్ని సరిదిద్దడానికి పరిగెత్తేను. “ఒరేయ్ కుక్కల్లారా, దమ్ముంటే వచ్చి పోరాడండి!” అనేదాన్ని అయ్యో చావడానికి ఒక్కబ్రతుకే ఉందని విలపించేదాన్ని. ఇప్పుడు వయసు వాటారింది. మంచీ చెడూ పిచ్చిగా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. ఇప్పుడు ప్రశాంతంగా కూచుని…
-
బాధాసఖుడు… ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్, అమెరికను కవయిత్రి
“బాధ దానంతట అదే పోతుందిలే, భవిష్యత్తులో మంచిరోజులకై కలగను, ఈ వేళ సంగతి మరిచిపో,” అంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఆమెకు చెప్పొద్దు. మీకు చెప్పాలనిపిస్తే, బాధ వృధాగా పోదని ఆమెకి చెప్పండి; అది నేర్పే గుణపాఠం వల్ల కలిగే లాభం అది కలిగించే నొప్పికి పదిరెట్లు ఎక్కువని చెప్పండి. ఎప్పటిలాగే పాతమాటలతో ఊరడించకండి: “త్వరలోనే అది మరిచిపోతుందిలే”- అని. కటువైన సత్యం, నిజమే, అది విచారించవలసిన విషయమే; ఆమెకు ‘వేరే విషయాలపై మనసుపోనీ, కొత్త…
-
ఆ వయసుకి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఈ రాత్రి నా కళ్ళు మూసుకుని ఒక చిత్రమైన ఊరేగింపు నా కళ్ళముందునుండి పోవడం గమనిస్తాను… నీ ముఖాన్ని నేను అప్పటికింకా చూడకముందు రోజులు ఎంతో ఆశలహేలతో నా ముందునుండి నడిచిపోతుంటాయి; అవును! సిగ్గూ, సున్నితమైన మనసున్నరోజులు తరలిపోతాయి కన్నీటిపొరతో ఏమీ కనిపించకపోయినా నృత్యంచేసే నర్తకిలా అలా రోజులు గడచిపోయినా, గడచిన ప్రతిరోజూ నన్ను నీ సన్నిధికి చేరుస్తోందని తెలుసుకోలేకపోయాను; ఆ త్రోవలు చాలా ఇరుకుగా ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ప్రతీదారీ నన్ను నీ హృదయాసమీపానికే చేర్చింది……