వర్గం: కవితలు
-
లాయర్లకి చాలా ఎక్కువ తెలుసు…కార్ల్ సాండ్ బర్గ్… అమెరికను కవి
బాబ్! లాయర్లకి చాలా ఎక్కువ తెలుసు. వాళ్ళు జాన్ మార్షల్ పుస్తకాలకు సహపాఠులు. వాళ్లకి అన్నీ తెలుసు, చనిపోయినవాడు ఏమిటిరాసేడో బిగుసుకున్న మృతహస్తం, కూలుతున్న వేలి కణుపులూ, మెత్తగా, తెల్లగా పొడిలా రాలుతున్న చేతి ఎముకలూ. లాయర్లకి బాగా తెలుసు చనిపోయినవాడి మనసులోని మాట ఏమిటో. బాబ్! గీచి గీచి బేరమాడే లాయర్ల మాటల్లో ‘అయితే’లు, ‘కానీ’లు, ‘అయినప్పటికీ’లు సులభంగా జారుతాయి. చాలా ‘ఇంతకుముందు చెప్పినప్పటికీ’లు … రావడానికీ పోవడానికీ చెప్పలేనన్ని ద్వారాలు. బాబ్! లాయర్లు పని…
-
ప్లాట్ ఫారం పిల్లలు… సీమస్ హీనీ, ఐరిష్ కవి
వేస్తున్న రైలురోడ్డుపక్క మట్టిగుట్ట ఎక్కేం మేము మా కళ్ళూ … టెలిఫోను స్థంభాలమీది పింగాణీ కప్పులూ… మెరుస్తున్న తీగలతో సమతలంలో ఉన్నాయి చేతితో అలవోక గీసిన గీతలా తూర్పునుండి పడమరకి మైళ్ళకు మైళ్ళు సాగిపోయాయి… పిచ్చుకల బరువుకి వాలిపోతూ. మేం పిల్లలమి, తెలుసుకోవలసినది మాకేం తెలీదు అనుకుంటున్నాం. మెరిసే నీటి బిందువుల రూపంలో మాటలు తీగెల్లోంచి ప్రవహిస్తాయనుకున్నాం. ఆకాశపు అందాలను తనలో నింపుకున్న ప్రతి తీగా, దాని మీది తళతళలూ, మేమూ అంతా…
-
పానశాల … జలాలుద్దీన్ రూమి, పెర్షియన్ కవి
రోజల్లా దానిగురించి ఆలోచిస్తాను, రాత్రయేక చెబుతుంటాను. నేను ఎక్కడినుండి వచ్చేను, నేను ఇక్కడ చెయ్యవలసినదేమిటి? నాకైతే ఏమీ తెలియదు. నా ఆత్మ మాత్రం ఎక్కడిదో… అది మాత్రం నిశ్చయం, నేను చివరకి అక్కడకి చేరుకోవాలనుకుంటున్నాను. ఈ తాగుడు అలవాటయింది వేరే పానశాలలో. నేనక్కడికి చేరుకున్నానంటే, నాకు మత్తు పూర్తిగా వదులుతుంది. ఈ మధ్యకాలంలో నేను ఖండాంతరం నుండి వచ్చి పక్షిశాలలో కూర్చున్న పక్షిలా ఉన్నాను, నేను ఎగిరిపోవలసిన రోజు దూరంలో లేదు. కానీ, ఎవరది…
-
స్వర్గంలో కాఫీ… జాన్ అగార్డ్, ఆఫ్రో-గయానీస్ కవి
మీరు స్వర్గంలో అడుగుపెట్టినపుడు ఒక మంచి కప్పు కాఫీతోనూ గంధర్వ గానంతోనూ మీకు స్వాగతం లభిస్తుంది కానీ, మీకు అక్కడ కెఫీన్ తీసిన కాఫీ మాత్రమే ఇచ్చినపుడు, నరకంలోని ఫిల్టర్లనుండి సైతాను తాజా ఎస్ప్రెస్సో ఘుమఘుమలు మీ ముక్కుపుటాలమీద దాడి చేసినపుడు మీరు క్రుంగిపోరూ? . జాన్ అగార్డ్ (21.6.1949) ఆఫ్రో-గయానీస్ కవి. . . Coffee In Heaven . You’ll be greeted by a nice cup of coffee when you…
-
మిసెస్ థాచర్… స్యూ టౌన్ సెండ్, బ్రిటిష్
నువ్వు నిజంగా రోదిస్తావా, మిసెస్ థాచర్, రోదిస్తావా? నువ్వు మేల్కొంటావా, మిసెస్ థాచర్, నిద్రలో ఉలిక్కిపడి ఎన్నడైనా? ఎండి మోడై విచారగ్రస్తమైన చెట్టులా? ఖరీదైన నీ “మార్క్స్ & స్పెన్సర్” తలగడ మీద? నీ కన్నీళ్ళు మరుగుతున్న ఉక్కులా ఉంటయా? అసలు నీకు అసలు ఎప్పుడైనా ఏడుపొస్తుందా? నీ మనసులో “3 మిలియన్లు” అన్న ఆలోచనతో ఎప్పుడన్నా నిద్రలేస్తావా? వాళ్ళకి చెయ్యడానికి పని లేదని నీకెప్పుడైనా నిజంగా బాధకలుగుతుందా? నువ్వు నీ అధికారదుస్తులు వేసుకుంటున్నప్పుడు, ఉద్యోగంకోసం క్యూలో నిరీక్షిస్తున్నవారు…
-
మళ్ళీ సముద్రం మీదకి పోవాలి… జాన్ మేస్ ఫీల్డ్, బ్రిటిషు కవి
నేను మళ్ళీ సముద్రం మీదకి పోవాలి ఒంటరి సముద్రమూ, ఆకాసమూ వైపుకి. నేను కోరుకునేదల్లా ఒక పొడవాటి ఓడా దానికి దోవచూపడానికి ఒక నక్షత్రమూ, గిరగిరా తిరిగే చక్రాలూ, హుషారుగా ఈలవేసే గాలీ దానివడికి అటుఇటు ఊగే తెల్లని తెరచాపా, సంద్రతలం మీద సన్నని తెల్లని మంచుతెరా, అప్పుడే చీకటిని తొలగిస్తున్న అరుణోదయమూ. నేను మళ్ళీ సముద్రం మీదకి వెళ్ళాలి పరిగెడుతున్న అలల పిలుపుకి ఊ కొడుతూ, అది స్పష్టమైన, నీరవమైన పిలుపే, అందులో సందేహం లేదు.…
-
మనిషికి జీవితంలో తగినంత సమయం చిక్కదు… యెహుదా అమిఖాయ్, ఇజ్రేలీ కవి
అతనికి కావలిసిన దానికి దేనికీ జీవితంలో మనిషికి తగినంత సమయం చిక్కదు అతని ప్రతి అవసరానికి తగినట్టుగా అతనికి తగినన్ని ఋతువులు లేవు. ఈ విషయంలో మతగ్రంధాలు చెప్పేదంతా తప్పే. మనిషికి ఏకకాలంలోనే ప్రేమించనూ ద్వేషించనూ వలసి వస్తుంది అవే కళ్ళతో ఏడ్వనూ, నవ్వనూ వలసి వస్తుంది, ఆ చేతుల్తోనే రాళ్లు విసరనూ, ఏరుకోనూ వలసి వస్తుంది యుద్ధంలో ప్రేమించనూ, ప్రేమలో పోరాడనూ వలసి వస్తుంది ద్వేషించి క్షమించనూ, గుర్తుండి మరిచిపోనూ వలసి వస్తుంది, సవరించి చిందరపరచనూ వస్తుంది, తిని అరిగించుకోనూ…
-
మనసు తాకే రీతులు… మిల్లర్ విలియమ్స్, అమెరికను కవి
నువ్వు కలిసే ప్రతిమనిషిపై అనుకంప చూపించు… వాళ్ళు అక్కరలేదన్నప్పటికీ. మనకి అసభ్య నడతగా, చిటపటలాడే స్వభావంగా, నిరాశావాదంగా కనిపించే ప్రవర్తన మన చెవులు వినని, కనులు చూడని ఎన్నో వాటికి సంకేతం. అక్కడ… “దేహమూ ఆత్మా సహజీవనంచేసే చోట” ఎన్ని అగోచర అంతర్యుద్ధాలు జరుగుతున్నాయో నీకు తెలియదు. . మిల్లర్ విలియమ్స్ (born April 8, 1930) Note: దేహమూ ఆత్మా సహజీవనంచేసే చోట (“Spirit meets the Bone”): దేహము పదార్థానికి ఉదాహరణ అయితే, ఆత్మ…
-
కాలం ఏ ఉపశాంతీ కూర్చదు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి.
కాలం ఏ ఉపశాంతీ ఇవ్వదు; మీరుచెప్పినదంతా పచ్చి అబద్ధం. కాలమే నా బాధని మాన్పుతుందని చెప్పిందెవడు? ఈ హోరుమంటున్న రాత్రిలో అతని తోడులేమి వెలితే. సముద్రం ఆటులో ఉన్నప్పుడు తను నాప్రక్కనుంటే బాగుణ్ణు ప్రతి కొండ వాలులోనూ మంచు కరిగి ప్రవహిస్తోంది. క్రిందటేడువి ఆకులు ప్రతివీధిలో దర్శనమిస్తున్నాయి; కానీ, ఆలోచనలలోనే మిగిలిన క్రిందటేటి గాఢమైన ప్రేమ నా గుండెల్లో భద్రంగా పేరుకుంది. నేను వెళ్ళడానికి భయపడే స్థలాలు వంద. ఎందుకంటే అవన్నీ అతని జ్ఞాపకంతో పొర్లుతుంటాయి. ప్రశాంతతకోసం, అతని…
-
ప్రియురాలి స్మృతికి… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి.
ఆమె జీవితం అంతా బంగారపు ఇసుకని తెలివితక్కువగా చక్రాలుగా, ముగ్గులుగా అరచేతి వేళ్లసందుల్లోచి జారనిస్తూ ఇసుకకోటలు కట్టడానికే సరిపోయింది. హరివిల్లులు ఒకదానివెనకఒకటివచ్చినట్టు మంచిరోజులు కట్టగట్టుకుని వచ్చినా వాటినన్నిటినీ ఆమె తృణప్రాయంగా విసిరేసింది కుళ్ళు కాలవలో సుడులుతిరుగుతూ పోయేట్టు. ఆమె కొరకు ఒక కొత్త గులాబీ మొగ్గని వదిలి మీ మానాన్న మీరు వెళ్ళండి; జాలి పడొద్దు; ఆమె హాయిగానే జీవించింది; ఆమెకి తెలుసు, తను మట్టిలోకలిసినా, అదీ అందంగా ఉంటుందని. . డొరతీ పార్కర్. August 22,…