వర్గం: కవితలు
-
సంతకం చేసిన హస్తం … డిలన్ థామస్, వెల్ష్ కవి
కాగితం మీద సంతకం చేసిన హస్తం ఒక నగరాన్ని పడగొట్టింది, సర్వాధికారాలు గల ఐదువేళ్ళూ ఊపిరిని కప్పం కట్టమన్నాయి ఒక దేశజనాభా సగానికి తగ్గించి, మృతులప్రపంచాన్ని రెట్టింపుచేసింది, ఈ ఐదుగురు రాజులూ, మరో రాజుని మట్టుపెట్టారు. ఆ శక్తిమంతమైన హస్తం వాటమైన భుజానికి చేర్చుతుంది వేళ్ళకణుపులు సున్నంతో బిరుసెక్కాయి; ఒక బాతు ఈక కలం హత్యల్ని పరాకాష్ఠకి తీసుకెళ్లింది అది వాక్స్వాతంత్ర్యానికి భరతవాక్యం పలికింది. ఒడంబడికపై సంతకం చేసిన హస్తం ఒక ఆవేశాన్ని రగిలించింది, కరువు విజృంభించింది,…
-
మనసుతో… జాన్ థామస్
వేసవిలో వర్షంలా రోజులిట్టే ఇంకిపోతాయి, కాలంతో పాటే నిన్ను విడిచిన బాధా పలచనౌతుంది ఇంద్రియాలు వాటి జ్ఞానాన్ని కోల్పోయి పరిణామాలు మసకబారుతాయి. బొమ్మలు ఏ జ్ఞాపకాలూ నిలుపుకోవు ఏ విషాదాలూ ఊడిపడవు నిన్ను ప్రేమిస్తున్నానన్న ఆనందాన్ని ఇక ఆస్వాదించగలిగే స్థితీ ఉండదు. నీ సుగంధాన్ని గాలిలో నే పసిగట్టే దాకా, నా ప్రేమలాగే స్వచ్ఛమైన తెమ్మెర, నా ఏకాగ్రతని భగ్నం చేసి నన్ను సందేహంలో ముంచెత్తి ఒక లిప్తపాటు నా గుండెకొట్టుకోవడం మర్చిపోతుంది. చాలా కాలం అయింది…
-
వీనస్… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి
ఓ వీనస్! పగలు గతించింది మెత్తగా మౌనంగా రాలుతోంది మంచు ఇప్పుడు ప్రతిపువ్వు మీదా కన్నీటిబొట్టే స్వర్గం వేరెక్కడా లేదు, ఉంది నీ చెంతనే! ఓ వీనస్! అందమైన సంధ్య మమ్మల్ని నెమ్మదిగా, తెలియకుండా కమ్ముకుంటోంది దివా రాత్రాల కలయిక వేళ పసిపాప ఊపిరితీస్తున్నట్టు ఉంది. ఓ వీనస్! మంచుకురిసిన నేలమీద రాలిపడిన పువ్వు నిద్రిస్తోంది మంచు సన్నని జల్లుగా కురుస్తుంటే చుట్టూ ప్రకృతి శ్వాసిస్తున్నట్టు ఉంది. ఓ వీనస్! వినీలాకాశంనుండి మిణుకుమంటున్న నీ కాంతికిరణం అలసిన…
-
కొవ్వొత్తి వేడికోలు … లీ జూ ఫెంగ్, సింగపూర్ కవయిత్రి
(ప్రభూ!) నా వయసు కరిగిపోతున్న కొద్దీ నన్ను సరికొత్త పనికి నియోగించుకో నీ ముందుకి చాచిన అరచేతిలో నన్నుంచు, అప్పుడు ఇద్దరికి తోవచూపించగలిగేలా; అలాగ, కాలక్రమంలో ఈ దీప కాంతి నే జాచినట్టే ముందుకి సాచిన మరో చేతిమీద పడేలా. . లీ జూ ఫెంగ్ మే 13, 1946 సింగపూర్ కవయిత్రి . Candlesong . As my years burn down you put me to new use, place me upon the…
-
సముద్రంలో… క్రిస్టినా రోజేటి, ఆంగ్ల కవయిత్రి
సముద్రం ఎందుకు ఎప్పుడూ అలాఘోషిస్తుంటుంది? ఆకాశం అందనంతదూరంలో ఉందేమో, అది అలా ఘోషిస్తుంది, అందుకే చెలియలకట్ట మీద తెగ విసుక్కుంటుంది; భూమ్మీది ఒడ్లు ఒరిసిపాడే సమస్తనదులూ సముద్రపు ఆర్తిని తీర్చలేవు. ఇంకా దాహం అంటుంది. ఎన్నడూ శోధింపబడని దాని భూతలం మీద అద్భుతమైన అందాలు దాగున్నాయి; ఏ సంపర్కమూ లేని అపురూపమైన పుష్పాలు, లవణాలూ సింహపర్ణి పూలలా బ్రతకడానికి సరిపడా, వ్యాపించి, వృద్ధిచెంది బతకగలిగేలా. చిత్రమైన వంపులతో, మచ్చలతో, మొనలతో శంఖులు వెయ్యికళ్ళున్నట్టు ఒకదానిమీద ఒకటి పేరుకుని…
-
వేదనా గీతాలు… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి
మొన్న రాత్రి లెనాక్స్ అవెన్యూలో పాలిపోయి, మసకబారిన పాత గాస్ దీపం ప్రక్కన. స్వరాల్ని కుంచించి మత్తుగా కూనిరాగం తీస్తూ ముందుకీ వెనక్కీ కమ్మని పాటతోపాటు ఊగుతూ ఒక నీగ్రో పాట వాయించడం విన్నాను. ఆ వేదనా గీతపు స్వరానికి … అతను చాలా తీరుబడిగా ఊగేడు… చాలా తీరుబడిగా తూగేడు… ఆ దంతపు మెట్లమీద తన నల్లని చేతులతో పాపం! ఆ పాత పియానో మాధుర్యంతో కేరేలా చేసేడు! ఆహ్! ఎంత అందమైన గీతం! ఆ…
-
ఆఫీసు స్నేహాలు … గవిన్ ఏవార్ట్, బ్రిటిషు కవి
ఈవ్ కి హ్యూ అంటే తగని ప్రేమ హ్యూ కి జిమ్ అంటే చాలా మక్కువ. ఛార్లెస్ కి ఎవరితోనూ పెద్దగా పడదు ఛార్లెస్ అన్నా ఎవరూ ఎక్కువ ఇష్టపడరు. మైరా ప్రేమలేఖలు టైపు చేస్తూ కూచుంటుంది తన అందమైన పియానో కళాకారిణి వేళ్ళతో. ఫ్రాన్ నించి వీచే అపూర్వమైన సుగంధానికి డిక్ స్వర్గాన్ని ఊహిస్తూ తన్మయమౌతాడు. నికీ తన కళ్ళనీ వంపుల్నీ హొయలుగా నడుస్తూ ప్రకటిస్తుంటుంది క్లైవ్ మాటాడే ద్వంద్వార్థాలకి ప్రతివారూ పగలబడి నవ్వుతుంటారు. అదుపులేని కోరిక వెర్రితలలు వేస్తుంది, కానీ, అందరినీ…
-
రైలుపెట్టెలోంచి… రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి
యక్షిణుల కన్నా వేగంగా, మంత్రగత్తెలకన్నా వడిగా, గుట్టలూ, ఇళ్ళూ, కంచెలూ, కందకాలూ; యుద్ద్ధంలో సేనలు దాడి చేస్తున్నట్టు పొలాల్లోంచి, గుర్రాలు, పశువుల మధ్యలోంచి; కొండలూ, మైదానాల వింతలన్నీ తరుముకొస్తున్న చిక్కని వర్షంలా పరిగెడుతునాయి; రెప్పపాటులో రంగులేసిన స్టేషన్లు మళ్ళీ కనిపించకుండా మాయమౌతునాయి. అక్కడో కుర్రాడు చూడానికి కష్టపడి ఎగబాకుతున్నాడు ముళ్ళకంపల్ని తనొక్కడూ పక్కకి తొలగించుకుంటూ; ఇక్కడొ దేశదిమ్మరి నిలబడి తేరిపారి చూస్తున్నాడు; అడివిపూలని మాలలల్లడానికి పచ్చని తీగ అదిగో! రోడ్డు మీద పరిగెత్తే గూడుబండి ఇదిగో మనుషులతో…
-
ఆదర్శం… జేమ్స్ ఫెన్టన్, ఇంగ్లీషు కవి
నేను వచ్చింది ఇక్కడనుంచి నేను వెళ్ళినది ఈ త్రోవ. ఇది చెప్పడానికి కష్టమూ కాదు అవమానకరం అంతకన్నా కాదు. వ్యక్తిత్వం వ్యక్తిత్వమే. అదేమీ తెర కాదు. ఒక వ్యక్తి తనేమిటో తప్పకుండ గౌరవించాలి. ఇదీ నా గతం దాన్ని నేను వదులుకో లేను. ఇది కష్టమే. కానీ, ఇదే ఆదర్శం. . జేమ్స్ ఫెన్టన్ 25 April 1949 ఇంగ్లీషు కవి, సాహిత్య విమర్శకుడు. చిన్న చిన్న పదాలతో, ఆత్మవంచన చేసుకోవడాన్ని (Hypocrisy)…
-
సానెట్II … జార్జి శాంతాయన, స్పానిష్- అమెరికన్
నీతోపాటే నాలో కొంతభాగంకూడా మరణించింది. నా మనో జన వనంలో శీతగాలి ఒక చెట్టును మోడుని చేసింది. ఇక మరి అది ఎన్నడూ పచ్చదనానికి నోచుకోదు. గుడీ, చలికాగేపొయ్యీ, ఊరి రోడ్డూ, సముద్రతీరమూ, తాము కోల్పోయిన స్నేహానికి అలవాటుపడుతున్నాయి. మరొకరు, నేనెంతకోరుకున్నా, దొరక లేదు, ఒక్క రోజుకే, నే నెంతో ముసలివాడినయిపోయాను. అయినా, నేను నాజ్ఞాపకాలని పదిలపరచుకుంటాను… నీ ఔదార్యం, లేతహృదయాలకిచ్చే చనవూ నీస్నేహాన్ని పొందగలిగే గౌరవమూ; ఒకప్పుడు ఇవి నావి, నాజీవితం వాటితో వన్నెకెక్కింది. ఇందులో…