వర్గం: కవితలు
-
నా పేరు … మార్క్ స్ట్రాండ్, కెనేడియన్ అమెరికను కవి.
ఒకనాటి రాత్రి, పచ్చికబయలంతా స్వర్ణహరితమై ఉన్నపుడు సుగంధం నిండిన వాతావరణంలో, చంద్రకాంతశిలలతోచేసిన నిలువెత్తు కొత్త సమాధుల్లా వెన్నెల్లో చెట్లు కనిపిస్తున్నపుడు, నైసర్గిక ప్రకృతి అంతా కీటకాల అరుపులతో ప్రతిధ్వనిస్తున్నపుడు, నేను గడ్డిలో మేనువాల్చి, పైన పరుచుకున్న అనంతదూరాలను తలుచుకుంటూ చివరకి నేనేమౌతాను… నన్ను నేనెక్కడ కనుక్కోగలనని ప్రశ్నించుకున్నాను… నా ఉనికి నేను మరిచినప్పటికీ, ఒక క్షణంపాటు, నక్షత్రాలుపొదిగిన సువిశాల ఆకాశం నాదేననిపించింది, తొలిసారి వర్షాన్నీ, గాలిహోరునీ వింటున్నట్టు, మొదటిసారిగా నా పేరు నేను వింటున్నట్టు అది నా…
-
కవీ – అతని కవితలూ… లాంగ్ ఫెలో, అమెరికను కవి
వసంతం వచ్చేసరికల్లా పక్షులు ఎక్కడనుండి వస్తాయో తెలియనట్లు; సాయంత్రం అవడం తడవు రోదసికుహరాల్లోంచి చుక్కలు పొడిచినట్లు మేఘాల్లోంచి చినుకులు రాలినట్లు, భూమిలోంచి బుగ్గలు వాగులై ప్రవహించినట్లు అంత అకస్మాత్తుగానూ, నిశ్శబ్దంలోంచి చిన్నదో పెద్దదో చప్పుడు ఉత్పన్నమైనట్టు; ద్రాక్షతీగకి ద్రాక్షగుత్తులు వేలాడినట్లు; చెట్లకి పళ్ళు కాసినట్లు; దేవదారుకొమ్మల్లో గాలి చొరబడినట్లు; సముద్రం మీద అల్లలు ఉప్పొంగినట్లు; క్షితిజరేఖ మీద ఓడల తెల్లని తెరచాపలు లేచినట్లు; పెదాలమీద చిరునవ్వు మొలిచినట్లు, నురగలు ముందుకు తోసుకువచ్చినట్లు; అనంతాగోచర లోకాలకుచెంది స్పష్టాస్పష్ట ఆకృతులనుండి…
-
ఆమె పేరు… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి
బ్లాజ్ఞ్మిత్రులకీ, సందర్శకులకీ జయ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకూ మీ కుటుంబానికీ, మీ మిత్రులూ శ్రేయోభిలాషులకీ ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలు కలుగజేయాలని కోరుకుంటున్నాను *** మెత్తని సముద్రపుటిసకమీద నీ పేరు నేను రాసున్నప్పుడు నవ్విన నీ నవ్వు నాకింకా గుర్తే! “ఏమిటది, చంటిపిల్లడిలా! నువ్వు ఏదో రాతి మీద రాస్తున్నాననుకుంటున్నావు!” ఆ క్షణం తర్వాత ఇయాంథే పేరు రాసేను ఏ కెరటమూ ఎన్నడూ చెరపలేనట్టుగా; భావి తరాలు విశాల సాగరంపై చదవగలిగేలా. . వాల్టర్ సేవేజ్ లాండర్…
-
పద్యం -38… ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి
నిన్న రాత్రి ఊరంతా తిరుగుతూ మట్టి కూజాలమ్మే దుకాణం దగ్గర ఆగేను, వాటిపక్కన నిశ్శబ్దంగా నిల్చున్న నేను, అవి ఇలా అనడం విన్నాను: ఎన్నో ఏళ్ళుగా మేము మా దారంట వచ్చిన లెక్కలేనంతమంది కుమ్మరుల, వ్యాపారుల ఆప్యాయపు స్పర్శకు పులకించాము. వాళ్ళందరూ అకస్మాత్తుగా నిష్క్రమించారు– మమ్మల్ని వదిలి మరి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళేరో ఏమో! . ఉమర్ ఖయ్యాం (18 May 1048 – 4 December 1131) పెర్షియను కవీ, తాత్త్వికుడూ, గణిత, ఖగోళ శాస్త్రజ్ఞుడు.…
-
ముగింపు… ఛార్ల్స్ బ్యుకోవ్ స్కి, అమెరికను
మనమందరం విరిసి ఉండవలసిన వేళలో విరియడానికి ఎన్నడూ తొందరపడని గులాబుల్లాంటి వాళ్ళమి ఎంతగా అంటే చివరికి సూర్యుడు కూడా ఎదురుచూసి చూసి విసిగెత్తిపోయేడేమోననిపిస్తుంది. . ఛార్ల్స్ బ్యుకోవ్ స్కి, ఆగష్టు 16, 1920 – మార్చి 9, 1994 జర్మన్-అమెరికను కవి . . Finish . We are like roses that have never bothered to bloom when we should have bloomed and it is as if the sun…
-
Unrelenting Drizzle… Nanda Kishore, Telugu, Indian
As the wind blows off the roof, I run after the wheeling palm leaves… The delight at the gust of rain-borne wind Evaporates in no time. As the waters enter the house, I try bailing out with utensils. The indulgence of rain drops Really takes me to my wit’s end. One should only…
-
మార్చలేనిదిగా మారు … రూమీ, పెర్షియన్ కవి
ఏ అద్దమూ మునపటివలె ఇనప పలకగా మారలేదు; ఏ రొట్టే తిరిగి గోధుమ గింజగా మారలేదు! సారాయి నుండి మళ్ళీ ద్రాక్షగుత్తులు నువ్వు సృష్టించలేవు, ఒక సారి త్రుంచిన పువ్వుని లతకి పూర్వంలా అతికించలేవు! తన కొలిమిలో జీవితాన్ని పరివర్తనలేని దానిగా మార్చనీ, భూమిమీద నిన్నొక అనశ్వరమైన వెలుగుకిరణంగా తీర్చనీ. . జలాలుద్దీన్ రూమీ 1207- 1273 ప్రముఖ పెర్షియన్ సూఫీ కవి. . . Change to the Unchangeable! . No mirror becomes…
-
విహారనౌక… వాల్టర్ సేవేజ్ లాండర్, ఇంగ్లీషు కవి
కడకు ఇక్కడ విశ్రమిస్తున్న ఈ ఓడ ఒకప్పుడు బలమైన పరుశువులూ, గావాయి గలది; గాలి ఎప్పుడు ఎలా వీచినా విహారానికీ, దూరయాత్రకీ సిద్ధంగా ఉండేది. ఇప్పుడంటే ఒక ప్రక్కకి ఒరిగి రికామీగా ఉంది గలగలపారుతున్న ప్రవాహంతో పరుగులెత్తడం మరిచి. అయినా, దీనికి గతవైభవపురోజులున్నై; అప్పుడు అందమైన పడుచులు పూలు తెచ్చి దీని ముందరితట్టునలంకరించి, తలవరుస శుభ్రపరిచేవారు కలలప్రపంచాల్ని తమతో మోసుకుపోతూ; కొన్ని వేల గాథలు చెప్పగలదిది… కానీ, మనసులో దాచుకోవడమే దానికి మహా ఇష్టం. ఓ నా చిన్నారి బాలికా!…
-
మంచి కవిత … తుకారాం, మరాఠీ కవి
ఒక మంచి కవిత రాజభవనంలో గోడకి కన్నం కనుక్కోడం వంటిది. ఎవడికి ఏమిటి కనిపిస్తుందో ఎవడు చెప్పగలడు? . తుకారాం 1577–1650 మహరాష్ట్ర భారతీయ కవి. . A Good Poem . A good poem is like finding a hole in the palace wall– never know what you might see. . Tukaram 1577–1650 Marathi, Indian.
-
కొండ పూలు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
వసంతంలో మల్లెల్ని అడిగాను అతని మాటలు నిజమేనా అని, చక్కగా, తెల్లగా విరబూచిన మల్లెలకి అన్నీ తెలుసు. పొలాలన్నీ బీడుపడి వివర్ణమయాయి భీకరమైన శరదృతుప్రభావానికి. ఇన్ని పారిజాతాలున్నాయి గాని, ఒక్కదానికీ తెలీదే! . సారా టీజ్డేల్, August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి . . Wild Asters . In the spring I asked the daisies If his words were true,…