వర్గం: కవితలు
-
బిల్లు కలెక్టరు… (ఫాదర్) జాన్ బి టాబ్, అమెరికను
“ఎవరు మీరు?” ఒక నల్ల కలువ…తుమ్మెదని అడిగింది మంచుబిందు సులోచనాల్లోంచి దాని భీకరమైన ఆకారం చూసి ఆశ్చర్యపోతూ . “నేనా అమ్మా, నేను ప్రజా సేవకుణ్ణి తేనె, మైనం పన్ను వసూలు చేసే బిల్లు కలెక్టర్ని. నాకివ్వడానికి మీదగ్గర ఏమీ లేదా?” బదులిచ్చేడు గండుతుమ్మెద. . (ఫాదర్) జాన్ బి టాబ్ (March 22, 1845 – November 19, 1909) అమెరికను కవి. . Image courtesy: http://catholiclane.com/john-b-tabb-americas-forgotten-priest-poet/ . The Tax-Gatherer .…
-
కొత్త సిపాయిలు… అజ్ఞాత కవి, రుథేనియన్
కొండవాలులో మంఛుపేరుకుని ఉంది, కాని తర్వాత కరిగి వాగులై ప్రవహిస్తుంది. రోడ్డుపక్కన పాపీలు విరగవూసాయి… అవి పాపీలేనా? కాదు, అవి ఎర్రగా మెరుస్తున్నాయి గాని, ఓహ్, అవి పువ్వులు కవు, సైన్యంలోకి కొత్తగా చేరిన సిపాయిలు! వాళ్ళు కొత్తగా చేరిన యువ సిపాయిలు! వాళ్ళు క్రిం (Krym) దాకా ఒకరివెనక ఒకరు స్వారీచేస్తూ వెళ్తారు, ఆ విశాలమైన పల్లెసీమలో గుర్రపు డెక్కల చప్పుడు ప్రతిధ్వనిస్తుంది. ఇంతలో ఒక తల్లి పిలుపు వినిపిస్తుంది: ఒరేయ్ శ్రద్ధమాలినవాడా! వెనక్కి రా…
-
There is Nothing Much To Say…. Nanda Kishore, Telugu, Indian
1 Now there are only two tenses… The times when I loved her, and the times when I can’t help loving her. 2 It never occurred to me how time would pass without her; All these days, amidst enveloping despair, I could understand I was better off because of her, But strange, I…
-
జీవిత సంగ్రహం … జిస్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి
నువ్విప్పుడు ఏంచెయ్యాలి? ఒక దరఖాస్తు నింపి దానికి నీ జీవిత సంగ్రహాన్ని జతపరచాలి, నీ జీవితం ఎంత దీర్ఘమైనది అన్న నిమిత్తం లేకుండా నీ జీవిత సంగ్రహం చాలా సంక్షిప్తంగా ఉండాలి. కనుక క్లుప్తత పాటించి, వాస్తవాలనే ఎంచుకో. దృశ్యాలని చిరునామాలుగా మార్చు, లీలగా ఉన్న జ్ఞాపకాలని తారీకులుగా మార్చు, పెళ్ళి చేసుకున్నవారినే ఉటంకించు, పిల్లలలోకూడ పుట్టిన వాళ్లనే చూపించు. నీ కెవరు తెలుసునన్నదానికంటే నిన్నెవరికి తెలుసో చాలా ముఖ్యం. ప్రయాణాలు…. విదేశప్రయాణాలయితేనే, అనుబంధాలు— దేనితోనో చెప్పు, ఎందుకో…
-
భావ శకలం 2 … జకోమో లెపార్డి , ఇటాలియన్ కవి
మనిషికి చెందిన ఏదైనా క్షణికమే: ఖీయోస్(Chios) కి చెందిన ఆ అంధకవి* నిజమే చెప్పాడు: చెట్ల ఆకులూ, మానుషప్రకృతీ ఒకే ధర్మాన్ని కలిగి ఉన్నాయి. కాని, ఈ మాటలని పట్టించుకునే వాళ్లు తక్కువ. అందరికీ, చపలమైన ఆశ, వయసు తమతో శాశ్వతంగా ఉంటుందని. మన యవ్వనపుష్పం పచ్చగా అందంగా మెరుస్తూ కనిపిస్తే గర్విష్ఠి అయిన విశృంఖల ఆత్మ వృధాగా అనేక అందమైన ఊహలు ఊహిస్తుంది వయసూ, మృత్యువు అన్న ధ్యాస లెకుండా, ఆరోగ్యంగా, బలంగా ఉన్నప్పుడు రోగాం…
-
శైశవానందం… విలియం బ్లేక్, ఇంగ్లీషు కవి
“నాకు ఏ పేరూ లేదు; పుట్టి రెండురోజులయింది. అంతే!” మరి నిన్ను ఏమని పిలవాలి? “నేను ఆనందంగా ఉన్నాను. ఆనందమే నా పేరు.” నీజీవితం ఆనందమయమగు గాక! నిజమైన ఆనందం! రెండురోజుల వయసుగల శైశవానందం. మధురానందం అని పిలుస్తాను నిన్ను. నువ్వు అలా నవ్వితే చాలు నేను ఆనందంతో గీతాలాలపిస్తాను. నీ జీవితం ఆనందమయమగు గాక! . విలియం బ్లేక్ (28 November 1757 – 12 August 1827) ఇంగ్లీషు కవి . . Infant…
-
కార్డినల్ న్యూమన్ స్మృతికి … క్రిస్టినా రోజేటి ఇంగ్లీషు కవయిత్రి
(సమాధిలో నువ్వెక్కడకి పోగలవు.) . శిలువ తరఫున పోరాడి అలసిన యోధుడా, విశ్రమించు, తుదకు అన్నిటినీ అక్కునచేర్చుకునే నిద్ర, నిద్రపో; నువ్వు నాట్లువేసిన రోజు సుదీర్ఘమయినది, నిద్రించి ప్రతిఫలం అందుకో, నువ్వు చాలా కాలం ఉపవశించేవు, నీ ఆత్మతృప్తిగా విందు భోజనం చెయ్యి. అవును, ప్రేమ నిండుగా అనుభవించడం నీవంతు, ఎందుకంటె, నువు కనపరిచినప్రేమ, పైపైది కాదు, లోతైనది, నీ ప్రేమ నిండుపున్నమనాటి పోటువంటిది, కొంచెపునరుల పిల్లకాలవలలు నీ వరద ముందు దిగదిడుపే. నీకిపుడు రాత్రి అయింది,…
-
నిర్భాగ్యుడి మరణశయ్య… కెరొలీన్ ఏన్ సదే, ఇంగ్లీషు కవయిత్రి
మెల్లగా అడుగులెయ్యండి… తల వంచుకొండి గౌరవపురస్సరంగా తల అవనతం చెయ్యండి ఇక్కడ ఏ గుడిగంటలూ మోగవు… అయినా ఒక అమర్త్యాత్మ శరీరంనుండి నిష్క్రమించబోతోంది. ఓ తెరువరీ! నువ్వు ఎంతో గొప్పవాడివై ఉండొచ్చు అయినా, కనీసగౌరవంతో తల వంచుకో; ఆ పాడుబడ్డ పూరిపాకలో… ఆ నామమాత్రమైన పక్కమీద నీకంటే గొప్పవాడు పరున్నాడు. ఆ బిచ్చగాడి గుడిశలో మృత్యువు రాజసాన్ని ప్రదర్శిస్తోంది. ఎవరూ లేరులే… లోపలికి నడు ఈ రాజమందిరానికి ఎవరూ కాపలా లేరులే లోపలికి తొంగిచూడు చెమ్మగా చల్లగా…
-
వియోగవేళ… ఆలివ్ ఎలినార్ కస్టాన్స్, బ్రిటిషు కవయిత్రి
లేదు, ప్రియతమా! లేదు, సూర్యుడింకా నెత్తిమీదే ఉన్నాడు, నిన్న రాత్రి నువ్వు, “సూర్యాస్తమయం తర్వాత” కదా వెళతా నన్నావు. తోటలోకి రా, అక్కడ పూలు వాడిపోతుంటే నోటమాట రాదు; బహుశా అదే మంచిది: అబ్బా! ఎంత భరింపరానిది “వీడ్కోలు” అన్న మాట! విను! పక్షులు ఎంత మధురంగా వసంతగీతాలాలపిస్తున్నాయో! త్వరలో అవి గూళ్ళు కట్టుకుంటాయి, ఆ శ్రమలో మౌనం ఆవహిస్తుంది మనం కూడా వయసువస్తున్నకొద్దీ ఉల్లాసాన్ని మరిచిపోతాం జీవితపు బాధ్యతలు నెత్తిమీద పడి… వాటితో పాటే బాధాకరమైన…
-
సౌందర్యం… ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్, అమెరికను
సౌందర్యం సత్యం యొక్క వన్నెగాని, మెరుగు గాని కాదు అది మనిషి ఆనందం కోసం సృష్టించబడిందీ కాదు. ఆ మాటకొస్తే, స్వర్గంలోని కిటికీలగుండా సుదూరంగా చూస్తే నరకం కూడా చాలా సుందరంగా కనిపిస్తుంది. . ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అమెరికను. ( సూచన: ఈ వ్యక్తి ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అవడానికి అవకాశాలు కనిపించడం లేదు. 1917 ఆగష్టు సంచికలో ఈ కవిత పడే నాటికి హిచ్ కాక్ కి 18 నిండలేదు. 1919 తర్వాతే అతనిలోని సాహిత్య…