వర్గం: కవితలు
-
Ramadan Crescent… Chittaluri Satyanarayana, Telugu Indian.
Every Muslim friend I encountered at every turn of my life is a Ramadan Crescent! The rendering of Aja at five used to wake up my heart, before my mother had reached out for the blanket. The same ardor reflected in my father’s voice when he said “come on, get up! The ‘Allah…’ is heard.”…
-
I still feel his hand on my shoulder…K Cube Varma, Telugu, Indian
I still feel his hand on my shoulder I still feel we were walking together In that road … less travelled He used to climb over the deer-like hillocks With his piercing cheetah-like looks… I still feel his hand over my shoulder. When he laughed sweetly Lending his hand I felt the moon were in…
-
To My Valentine… Vamshidhar Reddy, Telugu, Indian
I received your SMS this morning. What am I after all? But a nameless shadow of infatuated consummation Of deliquescent cold frozen by time. Take it Cool. Marriage is only a wedding of two corpora. Don’t eschew sleep when get dreamy. What had happened is only true; rest is fancy and a big lie.…
-
దేశాటనలక్కరలేదు… జేమ్స్ క్లారెన్స్ మేంగన్, ఐరిష్ కవి
శాస్త్రాలు తెలుసుకుందికి దేశాటన చెయ్యనక్కరలేదు! కొంచెం కఠినమైనది; అయితేనేం, మనసే ఖచ్చితమైన గురువు; దాన్ని, దాన్ని ఒక్కదాన్ని సరిగ్గా చదవగలిగేవంటే, నువ్వెక్కడనుండి వచ్చేవో, నువ్వేమిటో చక్కగా తెలుసుకోగలవు. తుర్క్ మన్, చైనీస్, ఈజిప్షియన్, రష్యన్, రోమన్, ఏదైతేనేం, అన్ని నాగరికతలూ పతనం వైపు దొర్లినవే. అన్నిచోట్లా పాత్రధారులు స్త్రీలూ, పురుషులే, అన్నిచోట్లా అనాదిగా చేస్తున్న ఆ దౌర్భాగ్యపు పాపాల చిట్టానే. ప్రతిచోటా మనల్ని దుష్టశక్తులు ప్రలోభపెడుతునే ఉంటాయి. ఈ నేల నీకేమిటి ఇవ్వగలదు, మన్నూ, మంచూ తప్ప?…
-
వైమానికుడి మనోగతం … గేరీ క్లాడ్ స్టోకర్, అమెరికను
తుఫాను తర్వాత మేఘాలతో నాట్యం చెయ్యాలన్నా, దొర్లుతూ, ఎగురుతూ జారుతూ, వంపులు తిరుగుతూ పోవాలన్నా మనసులో పెల్లుబికే ఆనందాన్ని అనుభూతి చెందాలన్నా స్వేచ్ఛకి అచ్చపు నిర్వచనమైన విమానంలో ఎగరాలిసిందే. భూమిని దాని బాధలకు దాన్ని వదిలేసి పైపైకి ఎగిరి వసంతకాలపు స్పష్టమైన పగటి వెచ్చదనాన్ని తెలుసుకోవచ్చు; ఒత్తిడులన్నీ కరిగిపోయి, వాటినుండి విముక్తి పొందేక చివరకి రోజు ముగిసే వేళకి తిరిగి నేలమీదకి చేరుకోవచ్చు. ఒక వేళ అలా ప్రయాణిస్తున్నప్పుడు నాకు మృత్యువు సమీపిస్తే అది పట్టపగలు కానివ్వండి,…
-
నలభైఏళ్ళ మగాళ్ళు… డొనాల్డ్ జస్టిస్, అమెరికను కవి
నలభై ఏళ్ళు వచ్చిన మగాళ్ళు మళ్ళీ తాము అక్కడికి రామని తెలిసిన గది తలుపులను నెమ్మదిగా వెయ్యడం నేర్చుకుంటారు. చివరి మెట్టు ఎక్కిన తర్వాత ఆగినపుడు కాళ్ళక్రింద కదలిక చిన్నదే అయినప్పటికీ, పడవ పైభాగం మీద నిలబడినప్పటిలా, కదుల్తున్నట్టు అనుభూతి చెందుతారు. అద్దం లోతుల్లో చిన్నప్పుడు వాళ్ళ నాన్న ‘టై’ ని రహస్యంగా కట్టుకోవడం సాధన చేసిన కుర్రాడి ముఖం తిరిగి చూస్తారు. గడ్డం నిండా పరుచుకున్న నురుగుతో చిత్రంగా కనిపించిన నాన్న ముఖం ఇప్పటికీ స్పష్టంగా…
-
దార్శనికత … సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
నాకు కాలగతిలో కలిసిపోయే వస్తువులన్నీ ఇష్టం; వాటి క్షణికతే నిలకడలేని నిశ్శబ్దాలమీద సంగీతమై, క్రమంగా అంతరిస్తుంది. సుడిగాలులు, పక్షులు, లే చివుళ్ళు, అన్నీ ఒక వెలుగు వెలిగి రాలిపోతాయి ప్రపంచానికి ఆనందాన్ని వెదజల్లుతాయి; దానికి మెరుపులా లయబద్ధంగా కదలగల అవయవాలు కావాలి, ప్రభాతవేళ యవ్వనపు జిగితో వెలిగే మోమూ, మృత్య్తువుతో ముగిసే క్షణణకాల ప్రేమా… “ఓ సౌందర్యమా! నువ్వు నశ్వరమైన వస్తువులోంచే జనిస్తావు సుమీ!” . సీ ఫ్రై ససూన్ (8 September…
-
కడలి దృశ్యం (సానెట్ 83) … ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి
కొండల మీద సంచరించే ఆ గొర్రెల కాపరి మేను వాల్చేడు కొండశిఖరం వరకూ పరుచుకున్న మెత్తని గడ్డిమీద, క్షితిజరేఖవద్ద ఆకాశంతో కలుస్తున్న కడలి అంచును చూస్తున్నాడో, లేక, తన వియద్దృష్టిపరిధికి బాగా దిగువన, పడమటి జలాల్లో నిప్పులు చెరుగుతూ వాలుతున్న వేసవి సూర్యుణ్ణి చూసునాడో; ఆ విశాల దృశ్యం, అద్భుతంగా, పరమ శాంతంగా, నలుదిక్కులా వ్యాపిస్తోంది, ఆ గ్రామీణుడి గుండెమీదకూడా ఒక ప్రసన్న హర్షం కానీ, దూరంగా, సముద్రజలాలపై, నల్లని మచ్చల్లా మృత్యువునద్ది రాక్షసులు కురిపిస్తున్న రోగ…
-
లక్షణాల ఏకరువు … డొరతీ పార్కర్, అమెరికను
నాకు నా మానసిక స్థితి నచ్చదు; ఎప్పుడూ కఠినంగా, నిర్దయగా, చాడీలు చెబుతూ ఉంటాను. నాకు నా కాళ్లు నచ్చవు, నా చేతులంటే అసహ్యం, నాకు చక్కని ప్రదేశాలకు వెళ్ళాలని ఉండదు. నాకు ఒకేలా వెలుగుచిమ్మే ఉదయవేళ నచ్చదు; నాకు రాత్రి పడుక్కోవాలంటే చికాకు. సీదాసాదా అమాయకపు మనుషులంటే ముఖం చిట్లిస్తాను. నేను చిన్నపాటి జోకు కూడా సహించలేను. నాకు బొమ్మలువెయ్యడంలో, రాసుకోడంలో మనశ్శాంతి లేదు. నా ప్రపంచం అంతా ఎందుకూ పనికిరానిది. నా కలలన్నీ కరిగిపోయాయి;…
-
భగవత్సృష్టి… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను
ఓహ్! ప్రకృతీ! నిన్ను ఇంతకంటే గాఢంగా హత్తుకోలేను! నీ తెమ్మెరలేమిటి! విశాలమైన ఆకాశాలేమిటి! పడిలెస్తూ ఎగసిపడే నీ మంచుదొంతరలేమిటి! నీ ఈ వనాలు, ఈ శరదూదయం, పెరిగి సడలే తీపు, అన్నీ రంగులకోసం పోటీపడుతున్నాయి! ఆ సన్నని కొండవాలు, చెట్ల గుబురుపై తొలగుతున్న చీకటీ మనసుదోచుకుంటున్నై. ఓ విశ్వమా! ప్రకృతీ! నేనూ ఇంతకంటే దగ్గర రాలేని అసమర్థురాలిని! ఇందులోని మహిమగురించి చాలా కాలంగా తెలుసు; కానీ మరీ ఇంత అందంగా ఉంటుందని ఎన్నడూ తెలుసుకోలేకపోయాను; ఇక్కడ ఎంత…