వర్గం: కవితలు
-
ముళ్ళకి భయపడకు (ఘజల్ 482) … హఫీజ్, పెర్షియను కవి
ఓ నా ఆత్మా! నువ్వు మళ్ళీ ప్రేమ మార్గంలో ఎందుకు తిరుగాడకూడదు? నీ హృదయం ఒంటరితనాన్ని కోరుకుంటోంది; నీ జీవితం వృధాగా ముగుస్తుంది. విధి అనే బ్యాటు నీ చేతిలోనే ఉంది; బంతినెందుకు కొట్టవు? పైన ఎగురుతున్న అదృష్టపు పావురాన్ని ఎలాపట్టాలో నువ్వేనిర్ణయించుకోవాలి నీ హృదయంలో ఎగసి ప్రవహించే ఈ ఎర్రని రక్తం నీ ప్రియురాలిని గెలుస్తుంది; ఆమెని పోనివ్వకు. ముళ్ళంటే ఉన్న భయం గులాబి దగ్గరకి వెళ్ళకుండా నిన్ను నిలువరిస్తే లాభం లేదు. నువ్వు ఎన్నడూ…
-
నిన్ను ప్రేమించడం లేదు… కెరొలీన్ నార్టన్, ఇంగ్లీషు కవయిత్రి
నిన్ను ప్రేమించడం లేదు__ నిజంగానే, నిన్ను ప్రేమించడం లేదు! అయినా, నువ్వు కనిపించకపోతే నాకు బాధగా ఉంటుంది; నీ నెత్తిమీది వినీలాకాశం అన్నా నాకు అసూయే, అక్కడి నిశ్శబ్దతారకలు నిన్ను చూసి ఆనందిస్తాయని. నేను నిన్ను ప్రేమించడం లేదు. అయినా, ఎందుకో కారణం తెలీదు, నువ్వు ఏది చేసినా నాకు బాగున్నట్టే కనిపిస్తుంది, నాకు; తరచు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నిట్టూరుస్తుంటాను, నేను ప్రేమిస్తున్నవాళ్ళు నీలాగ లేరే అని! నేను నిన్ను ప్రేమించడం లేదు. అయినా,…
-
తిరిగి పల్లెలో బ్రతకడానికి… టావో చియెన్, చీనీ కవి
యువకుణ్ణైన నాకు అందరిలాటి ఆలోచనలు లేవు నాకు పర్వతాలూ ప్రకృతీ అంటే ఇష్టం. తెలివితక్కువగా నేను దుమ్ముకొట్టుకుపోయిన వలలో చిక్కాను, తెలివొచ్చేసరికి ముఫై ఏళ్ళు గడిచిపోయాయి. పంజరంలోని పిట్టకి ఒకప్పటి చెట్టూ, గాలీ కావాలి తోటలోని చేప పూర్వం స్వేచ్ఛగా తిరిగిన సెలయేటికై తపిస్తుంది నేను సౌత్ మూర్ ఒడ్డున ఉన్న ఒక చెలక దున్నుకుంటాను జీవితాన్ని సీదాసాదాగా ఉంచుకుని నా నేలకీ తోటకీ పోతాను. నా పొలంలో గట్టిగా చూస్తే నాలుగు మళ్ళు…
-
Poem XVIII… ఎమిలీ డికిన్సన్
మరో రకమైన ఒంటరి తనం ఉంది మనుషులు దానికోసం పడిచచ్చేది అది లేమివల్లో, మిత్రులవల్లో, లేదా పరిస్థితులప్రభావం వల్లో జరగదు. ప్రకృతిశక్తులవల్లా, మరోసారి ఆలోచనలవల్లా; కాని ఎవరు దానిపాలబడ్డా వాళ్ళు ఎంతగా లబ్దిపొందుతారంటే దాన్ని మనకు తెలిసిన అంకెల్లో చెప్పలేము. . ఎమిలీ డికిన్సన్ December 10, 1830 – May 15, 1886 అమెరికను . Emily Dickinson . Poem XVIII . There is another Loneliness That many die without,…
-
మిల్టనూ- ఒక గులాబీ… జార్జ్ లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి
కాల మాళిగలలో కనుమరుగైపోయిన వేల తరాల గులాబులలోంచి ఒక్క పువ్వుని విస్మృతినుండి వెలికితీస్తాను ఒకే ఒక్క నిష్కల్మషమైన గులాబి… అలాంటిదంటూ ఒకటి ఉంటే. విధీ! అనుగ్రహించు! అటువంటి గులాబిని ఎంచుకోగల శక్తి నాకొకసారి … మిల్టను తన ఎదురుగా ఉంచుకున్నదీ, మౌనంగా కాలగర్భంలో కలిసిన దానిని. సింధూరవర్ణమో, పసుపురంగో నాశమైన తోటలోని తెల్ల గులాబియో; చిత్రంగా దాని గతం ఈ కవితలో దేదీప్యంగా వెలుగుతూ శాశ్వతంగా మిగిలే ఉంటుంది. బంగారు వర్ణమో, రక్తవర్ణమో, తెలుపో, నలుపో విధి…
-
సుప్రభాత నామావళి … రఫేల్ ఆల్బర్టీ, స్పానిష్ కవి
లేకావి కిరణాల ప్రభాతమా! నీకు కొన్ని పేర్లు పెడుతున్నాను. నువ్వొక పొరబడ్డ కలవి, వీడని దేవకన్యవి, చెట్లమీది వర్షపు ఆభాసవి నదీప్రవాహాల్ని గుర్తుచేసుకునే నా ఆత్మాంచలాల సందిగ్ధంగా, వెనకాడుతూ, చివరకి స్థిరంగా ఉంటావు. నువ్వొక తారా విస్ఫోటనానివనీ, వేవెలుగుల ఆనందానివనీ, చప్పుడుచెయ్యని పారదర్శకతవనీ అందునా? కాదు, నువ్వు నీటిమీదిమంచుకి అపభ్రంశానివి. . రఫేల్ ఆల్బర్టీ 16 December 1902 – 28 October 1999 స్పానిష్ కవి Rafael Alberti Naming The Dawn …
-
మృదుల కంఠస్వరాలు కనుమరుగైపోయేక… షెల్లీ, ఇంగ్లీషు కవి.
మృదుల కంఠస్వరాలు కనుమరుగైపోయేక సంగీతం జ్ఞాపకాల్లో ప్రతిధ్వనిస్తుంటుంది; సుకుమారమైన పూల నెత్తావి అవి వాడిపోయినా అవి రేకెత్తించిన ఇంద్రియజ్ఞానంలో నిక్షిప్తమై ఉంటాయి. గులాబి రేకులు, గులాబి రాలిపోయేక ప్రియురాలి సమాధిదగ్గర పోగుచెయ్యబడతాయి; అలాగే, నీ ఆలోచనలు, నీ తదనంతరం, ప్రేమ తనలోతాను నెమరువేసుకుంటుంటుంది. . P B షెల్లీ 4 August 1792 – 8 July 1822 ఇంగ్లీషు కవి. . . Music, when Soft Voices die . Music, when soft…
-
కవి… యోనీ నొగూచి, జపనీస్ కవి
అగాధ తమోమయ జగత్తులోకి ఒత్తిగిలిన ఉదయంలా పరిపూర్ణమూ, అద్భుతమూ ఐన ఒక రహస్య ఆకారం అవతరిస్తుంది. అతని ఊర్పులు సువాసన భరితం అతని కనులు తారకాసముదయానికి త్రోవచూపించగలవు అతని ముఖంలో ప్రసన్న మరుద్వీచికలుంటాయి స్వర్లోక ప్రాభవమంతా అతని మూపున ఉంటుంది అమూర్త దివ్యరూపంలా నడచివస్తాడు అనంతమైన ప్రేమని పంచిపెడుతూ, ప్రాభాత సూర్యకిరణం అతని ఆటపట్టు మధుర సాంధ్య సంగీతం అతని పలుకు. అతని చూపు పడితే సమాధి మృత్తికలోకూడ కదలిక వస్తుంది నందనవనాలకి ప్రయాణం సాగుతుంది. .…
-
రుబాయీ XIV … ఉమర్ ఖయ్యాం, పెర్షియన్
మనుషులు మనసు లగ్నంచేసే లౌకికాపేక్షలు బూడిదైపోతాయి… లేదా వర్ధిల్లుతాయి; ఐనా, అవి త్వరలోనే పొడిబారిన ఎడారి ముఖం మీది మంచు బిందువుల్లా ఘడియో రెండు ఘడియలో వెలుగు వెలిగి… మాయమౌతాయి. . ఉమర్ ఖయ్యాం 18 May 1048 – 4 December 1131 పెర్షియన్ . . Rubai XIV The Worldly Hope men set their Hearts upon Turns Ashes — or it prospers; and anon,…
-
గొర్రెలకాపరి… ఫెర్నాండో పెసో, పోర్చుగీసు కవి
నేనొక మందనుతోలే గొర్రెలకాపరిని నా ఆలోచనలే నా గొర్రెలు నా అనుభూతులే నా ఆలోచనలు. నేను నా కళ్ళతో, చెవులతో నా చేతులతో, కాళ్ళతో నా ముకుపుటాలతో, నోటితో ఆలోచిస్తాను ఒక పువ్వుని ఆలోచించడమంటే దాన్ని చూసి వాసనచూడ్డం ఒకపండుని తినడమంటే దాని రుచిని అనుభూతించడం అందుకే, బాగా ఎండకాసిన రోజూ, నాకు బాధకలిగినపుడూ, బాగా ఆనందం కలిగినపుడూ, గడ్డిలో విశ్రాంతి తీసుకుందికి మేను వాలుస్తాను, ఎండపడిన నా కళ్ళని మూసుకుంటాను నిజానికి నా శరీరంఅంతా సేదదీరినట్టు…