కవిత్వంతో పరిచయము, బిల్లీ కాలిన్స్, అమెరికను కవి

 

ఒక కవితను తీసుకుని
దాన్ని దీపానికి ఎదురుగా
రంగు గాజు పలకలా పరీక్షించమంటాను

లేదా దాని గూటికి చెవి ఆనించి వినమంటాను

లేదా ఆ కవిత గదిలోకి అడుగుపెట్టి
దాని లైటు మీట ఎక్కడుందో తణవమంటాను.

వాళ్ళు పద్యం తలం మీద
తీరాన్నున్న రచయితపేరుకి చేతులూపుతూ
కెరటాలమీద తేలుతూ ఆడాలని నా కోరిక.

కానీ వాళ్లు చేస్తున్నదల్లా
కవితని కుర్చీకి తాడేసి కట్టేసి
చేసినతప్పు ఒప్పుకునేట్టు చేస్తున్నారు.

దాన్ని రూళకర్రతో కొడుతూ
ఆంతర్యాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
.
బిల్లీ కాలిన్స్
అమెరికను కవి
(జననం 22 మార్చి 1947)

                                                                                                    Billy Collins, American Poet

Photo and Poem Courtesy: Poetry Foundation. 

 

Introduction to Poetry
Billy Collins

I ask them to take a poem
and hold it up to the light
like a color slide

or press an ear against its hive.

I say drop a mouse into a poem
and watch him probe his way out

or walk inside the poem’s room
and feel the walls for a light switch.

I want them to waterskii
across the surface of a poem
waving at the author’s name on the shore.

But all they want to do
is tie the poem to a chair with rope
and torture a confession out of it.

The begin beating it with a hose
to find out what it really means.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.