ప్రయత్నం మానొద్దు… జాన్ గ్రీన్ లీఫ్ విటియర్, అమెరికను కవి

మనం అనుకున్నట్టు జరగనపుడు (ఒకోసారి అలా జరుగుతుంది)
నువ్వు నడుస్తున్న త్రోవ ఎగుడుగా శ్రమతో కూడుకున్నప్పుడు,
రాబడి పరిమితమై అప్పులు పేరుకుంటున్నప్పుడు,
నవ్వాల్సిన సమయంలో నిట్టూర్పులు విడవ వలసి వచ్చినపుడు,
బాధ్యతల బరువు నిన్ను క్రుంగదీస్తున్నప్పుడు
కావలస్తే విశ్రాంతి తీసుకో, కానీ నీ ప్రయత్నం విడిచిపెట్టకు.

జీవితం దాని ఒడిదుడుకులతో చిత్రమైనది
ఎప్పుడో ఒకనాడు అందరికీ అనుభవంలోకి వస్తుంది:
మరికొంచెం ఓపిక పట్టి ప్రయత్నించి ఉంటే
విజయం వరించవలసిన చోట అపజయాలు ఎదురవడం,
కోరినంత వేగంగా పనులు జరగటం లేదని ప్రయత్నం మానకు,
ఎవరికి తెలుసు, తరువాతి ప్రయత్నంలో విజయం నీదేనేమో!

విజయం అంటే, సందేహాల కారుమబ్బుల అంచున
వెండి వెలుగులను తిరగ రాయడం,
విజయం ఎంత దగ్గరగా ఉందో ఎవరూ చెప్పలేరు,
అనంతదూరాల్లో ఉన్నట్టు భ్రమింపజేసి చేరువనే ఉండొచ్చు,
బలమైన ఎదురుదెబ్బ తగిలినప్పుడే మరింత పట్టుదల బూనాలి,
పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేనప్పుడే అసలు విడిచిపెట్టకూడదు.

మనిషి రాసే, పలికే అన్ని మాటల్లోకీ
“ఇలా జరిగి ఉండవలసింది” అన్నది మిక్కిలి బాధాకరం.
.
జాన్ గ్రీన్ లీఫ్ విటియర్
అమెరికను కవి

John Greenleaf Whittier
Photo Courtesy: Wikipedia

Don’t Quit

 

When things go wrong as they sometimes will,

When the road you’re trudging seems all up hill, 

When the funds are low and the debts are high

And you want to smile, but you have to sigh,

When care is pressing you down a bit,

Rest if you must, but don’t you quit.

 

Life is strange with its twists and turns 

As every one of us sometimes learns 

And many a failure comes about

When he might have won had he stuck it out;

Don’t give up though the pace seems slow 

You may succeed with another blow. 

 

Success is failure turned inside out

The silver tint of the clouds of doubt, 

And you never can tell just how close you are,

It may be near when it seems so far;

So, stick to the fight when you’re hardest hit 

It’s when things seem worst that you must not quit. 

 

For all the sad words of tongue or pen,

The saddest are these: “It might have been!”

 

John Greenleaf Whittier

(December 17, 1807 – September 7, 1892)

American Poet