మట్టికంటే నివురు కావడమే నాకిష్టం… జాక్ లండన్, అమెరికను రచయిత

 

నా శరీరంలోని వెలుగు
బ్రహ్మాండమైన తేజస్సుని వెదజల్లుతూ
మండి నుసి అయిపోవడం నాకిష్టం
ఎండి, మోడువారి నశించడం కంటే.

నేనొక అద్భుతమైన ఉల్కనై,
ప్రతి అణువూ వెలుగు విరజిమ్మడం
ఇష్టం, నిదురోయే గ్రహశకలంలా
చిరకాలం మనడం కంటే.

మనిషి పుట్టింది జీవించడానికి
ఏదోలా వెళ్ళదీయడానికి కాదు. నా ఆయువుని
ఏదోలా పొడిగిస్తూ వ్యర్థం చేసుకోను.
జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాను.
.
జాక్ లండన్
ప్రఖ్యాత అమెరికను రచయిత

 

I would rather be ashes than dust!

By Jack London

I would rather that my spark
Should burn out in brilliant
Blaze than it should be stifled
By dry rot

I would rather be a superb
Meteor, every atom of me in
Magnificent glow, than a
Sleepy and permanent planet.

The function of man is to live,
Not to exist, I shall not waste
My days trying to prolong them.
I shall use my time.

.
Jack London, American writer.