పూర్తికాని ఉత్తరం … సూసన్ వైజ్మర్, కెనేడియన్ కవయిత్రి

నిద్రలోజోగుతున్న తరుసమూహాల మధ్య,
తియ్యని చీకటిముసుగు లోంచి తెలియకుండా
హేమంతపు పొద్దు పొడుస్తుంది
నేనింకా పొయ్యిదగ్గర వెచ్చగా చలి కాగుతూ ఉంటాను
కాగితం కలం తీసుకుని నీకు ఏదో ఉత్తరం రాస్తూ.

ఇంటిల్లిపాదీ ఇంకా నిద్రలోనే ఉంటారు
పాపం మా పక్కింటివాళ్ళు, ఇకనుండి వారిది కాని ఇంట్లో
అప్పుడే నిద్రలేచారు. ఏవి తీసుకు వెళ్ళాలో, ఏవి విడిచిపెట్టాలో
మళ్ళీ నెల ఎక్కడ ఎలా గడపాలో అన్న బెంగతో.
ఈ పట్నంలో అద్దెలవాళ్ళకి పెద్దగా ఎంచుకుందికి అవకాశాలు లేవు.

ఉత్తరాన్ని పక్కన బెట్టి, వెచ్చని దుస్తులు వేసుకుంటాను, టామీని పిలుస్తూ.
కాలి మేజోళ్ళను బూట్లలోకి జొనిపి, చేతికి మిటెన్స్ వెతుక్కుంటాను.
గాలికి మంచు శిల్పాలు చెల్లాచెదురౌతాయి.
ఒక కాలు గాలిలోకి లేచి, పొట్టమీద ముడతలతో, ఒక కాలు తెల్లగా పాలిపోయి…
అందమైన కవళికలతో… ముంగిట ఒక దేవత శాశ్వత నిద్రపోతోంది.

పారతో మంచు తవ్వుతున్నాను. ఇప్పుడు ఒక గొయ్య తియ్యాలి.

 

సూసన్ వైజ్మర్

కెనేడియన్ కవయిత్రి

రానున్న ఆమె పుస్తకం “Hag Dances (At Bay Press)” నుండి ఆమె అనుమతితో

 

Susan   Wismer, Canadian Poetess 

Winter letter, unfinished

 

Under a well of slumbering trees, winter’s day cracks

From beneath the sweet shell of darkness hardly noticed, my head bent by the fire

Over paper and pen, I am writing

 

To you while most of this house still sleeps

And our good neighbours wake in a home no longer theirs

Think about what to take, what to leave, wonder

Where they will live next month in this town where

Renters have nowhere to go.

 

Set letter aside, pull on warm clothes, call the dog.

Slide boots over socks, find dry mitts. Wind sculpture drift-

Rise of a hip, deep folds of a belly, one long white leg,

Graceful lines, a goddess asleep

In my doorway.

 

My shovel hits snow, we must dig out.

 

Susan Wismer, Canadian Poetess.

(From  her forthcoming book, Hag Dances, (At Bay Press, Canada)