తప్పదనుకుంటే ఖాళీగా కూచో … రోజ్ మిలిగన్, బ్రిటిషు కవయిత్రి

ఖాళీగా కూచుని దుమ్ముపడతావా? అంతకంటే
బొమ్మ గీయడమో, ఉత్తరం రాయడమో,
రొట్టె కాల్చడమో, విత్తు నాటడమో మెరుగు కాదూ?
కోరికకీ,అవసరానికీ మధ్యనున్న తేడా ఆలోచించుకో.

ఖాళీగా కూచోవాలనుకుంటే కూచో. కానీ అట్టే సమయం లేదు.
ఎన్ని నదులు ఈదాలి, ఎన్ని పర్వతాలు అధిరోహించాలి!
ఎంత సంగీతం వినాలి, ఇంకా ఎన్ని పుస్తకాలు చదవాలి!!
ఎందరు మిత్రుల్ని పోగేసుకోవాలి, ఎంత జీవితం గడపాలి!!!

తప్పదనుకుంటే ఖాళీగా కూచో. కానీ ఆ ప్రపంచాన్ని చూడు:
కళ్లలో సూర్యుడు మెరుస్తూ, జుత్తుని గాలి ఎగరేస్తూ
ఒక మంచుతెర కమ్ముకుంటూ, ఒక చిరుజల్లు కురుస్తూ
ఇలాంటి రోజు మరొకటి రమ్మన్నా రాదు.

ఖాళీగా కూచోక తప్పదంటే కూచో. కానీ ఒకటి గుర్తుంచుకో:
ముసలితనం ఒకరోజు మీదపడుతుంది. దానికి అసలు జాలన్నది లేదు.
నువ్వు పోయిన తర్వాత (ఏదో ఒకరోజు నువ్వు పోక తప్పదు)
నువ్వే దుమ్మై, మరింత దుమ్ముకి కారణం అవుతావు.
.
రోజ్ మిలిగన్
బ్రిటిషు కవయిత్రి
(జననం 1940? )

Rose Milligan

 

Dust If You Must

 

Dust if you must, but wouldn’t it be better

To paint a picture, or write a letter,

Bake a cake, or plant a seed;

Ponder the difference between want and need?

 

Dust if you must, but there’s not much time,

With rivers to swim, and mountains to climb;

Music to hear, and books to read;

Friends to cherish and life to lead.

 

Dust it you must, but the world’s out there

With the sun in your eyes, and the wind in your hair;

A flutter of snow, a shower of rain,

This day will not come around again.

 

Dust if you must, but bear in mind,

Old age will come and it’s not kind.

And when you go (and go you must)

You, yourself, will make more dust.

 

Rose Milligan

(Rose Milligan is a contemporary British poet hailing from Lancaster in Lancashire.

This “poem was published in the 21st edition of “The Lady” magazine on September 15, 1998.”

(This bio info is courtesy: https://megalomaniacwriter.wordpress.com/tag/rose-milligan/ )