తీరిక… విలియం హెన్రీ డేవీస్ వెల్ష్ కవి

నిత్యం భవిష్యత్తుకై చింతిస్తూ క్షణమైనా ఆగి,
చూసే తీరిక లేకుంటే జీవితానికి అర్థం ఏమిటి?

నీడలో నిలబడి సేదదీరడానికిగాని
తనివిదీరా జీవజాలాన్ని పరికించే సమయంలేకుంటే,

గడ్డిలో ఉడుతలు తాము సేకరించిన ఆహారాన్ని దాచుకునే
ప్రకృతి దృశ్యాన్ని చూసే తీరికలేక దాటిపోతుంటే,

రాత్రిపూట నక్షత్రాల్లా, పట్టపగలు మిలమిల మెరిసే
సెల్లయేటి కెరటాల నక్షత్రాలని చూసే తీరికలేకుంటే,

మనసు దోచుకునే ప్రకృతిలోని సౌందర్యాన్ని తిలకించడానికీ
ఆమె పాదాలు ఎంత అందంగా నర్తిస్తున్నాయో చూసే తీరికలేకపోతే,

ఆమె కన్నుల్లో విరిసిన చిరునవ్వుల రేకలు
పెదాలపై రూపుదిద్దుకున్న తీరు చూసే సమయం లేకుంటే

నిత్యం బాధ్యతలే తప్ప, ఆగి చూసి ఆనందించే
అవకాశం లేకుంటే ఇదేమి జీవితం? నిష్ఫలం.
.

విలియం హెన్రీ డేవీస్
వెల్ష్ కవి

(3.7.1871 – 26.9.1940)

William Henry Davies

 

Leisure

What is life, if, full of care, we
have no time to stand and stare.

No time to stand beneath the boughs
And stare as long as sheep or cows.

No time to see. when woods we pass,
Where squirrels hide their nuts in grass.

No time to see, in broad daylight,
streams full of stars, like skies at night.

No time to turn at Beauty’s glance,
and watch her feet, how they can dance.

No time to wait till her mouth can
Enrich the smile her eyes began.

A poor life this if, full of care,
We have no time to stand and stare.
.
Willian Henry Davies
(3 July 1871 – 26 September 1940)
Welsh Poet and writer
(From Songs and others)

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.