Poor Richard’s Almanac 19… Benjamin Franklin

181. Happy is the wooing that is not long a doing.
చిరకాలం కొనసాగని ప్రణయం సుఖాంతం అవుతుంది.

182. Happy Tom Crump never sees his hump.
వాడి గూని వాడికి తెలియదు కనుక టామ్ క్రంప్ ఎప్పుడూ హాయిగా ఉంటాడు.

183. Haste makes waste.
తొందరపాటు ఎప్పుడూ వ్యర్ధానికి హేతువు

184. Harry Smatter has a mouth for every matter.
హారీ స్మాటర్ కి తెలియనిదంటూ లేదు.

185. Have you somewhat to do tomorrow; do it today.
నీకు రేపు చెయ్యడానికి పని ఏమైనా ఉందా? ఉంటే, అది ఈ రోజే చెయ్యి.

186. Having been poor is not no shame, but being ashamed of it, is.
పేదరికం అంత సిగ్గుపడవలసిన విషయం కాదు. సిగ్గుపడవలసింది, దాని గురించి సిగ్గుపడడానికి మాత్రమే.

187. Hear no ill of a friend, nor speak of an enemy.
నీ మిత్రుడి గురించి చెడు వినకు; శత్రువు గురించి చెడు చెప్పకు.

188. Hear reason, or she will make you feel her.
వివేకం చెప్పినట్టు విను; లేకుంటే, వినకపోతినే అని నువ్వు విచారించేలా చేస్తుంది.

189. He does not possess wealth, it possesses him.
మనిషి సిరిని వరించడు; సిరి వాడిని వరిస్తుంది.

190. He has changed his one-eyed horse for a blind one.
ఒంటికన్ను గుర్రాన్ని అమ్మి వాడు గుడ్డిదాన్ని కొన్నాడు.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.