| Bargaining has neither friends nor relations. బేరమాడేవానికి స్నేహితుడూ లేడు, చుట్టమూ లేడు. |
| Be always ashamed to catch thyself idle. వ్యర్థంగా కాలం గడపడానికి సిగ్గు పడు. |
| Be at war with your vices, at peace with your neighbors. నీ వ్యసనాలతో ఎప్పుడూ యుద్ధం చెయ్యి; పొరుగుతో మాత్రం సఖ్యంగా ఉండు. |
| Beauty and folly are old companions. అందమూ, తెలివితక్కువదనమూ చిరకాల మిత్రులు. |
| Being ignorant is not much a shame, as being unwilling to learn. నేర్చుకుందికి విముఖతతో పోలిస్తే, అజ్ఞానం పెద్ద సిగ్గుపడవలసిన విషయం కాదు. |
| Ben beats his pate, and fancies wit will come out; but he may knock, there is nobody at home. బెన్ నెత్తితడుతుంటాడు తెలివితేటలు బయటకొస్తాయేమో నని. తలుపు ఎంత తట్టినా ఏం ప్రయోజనం ఇంట్లో ఎవరూ లేనపుడు? |
| Be not niggardly of what costs thee nothing, as courtesy, counsel, and countenance. దమ్మిడీ ఖర్చులేని విషయాలలో పిసినారిగా ఉండకు: మర్యాద, మంచి సలహా ఇవ్వడం, నవ్వుముఖం పెట్టడం వంటి వాటిలో. |
| Be slow in choosing a friend, slower in changing. స్నేహితుడి ఎంపికలో సావధానంగా ఉండు. మార్చే ముందు అంతకంటే ఎక్కువ. |
| Better is a little with content than with contention. వాసి వస్తువు గుణంలో ఉంటుంది, ఎందరు పోటీ పడుతున్నారన్నదాని మీద కాదు. |
| Better slip with foot than tongue. నోరు జారడం కంటే, కాలు జారడం నయం. |
వ్యాఖ్యానించండి