21. A lie stands on one leg, truth on two. అబద్ధం ఒంటికాలు మీద నిలబడ గలదు, సత్యానికి రెండు కాళ్ళు కావాలి. (మనం అసత్యాన్ని నమ్మినంతగా, సత్యాన్ని నమ్మం) |
22. A life of leisure, and a life of laziness, are two things. విశ్రాంత జీవనమూ, సోమరి జీవితమూ ఒకటి కావు. |
23. A light purse is a heavy curse. తేలికగా ఉండే జేబు(డబ్బు లేకపోవడం) పెను శాపం. |
24. A little house well filled, a little field well tilled, and a little wife well willed, are great riches. నిండైన ఇల్లూ, దున్నిన పొలమూ, అనుకూలవతియైన భార్యా, ఎంత చిన్నవైనా, మహద్భాగ్యాలు. |
25. All blood is alike ancient. అందరి వంశవృక్షాలూ, ఒక్కలాగే, అనాదివే. |
26. All mankind are beholden to him that is kind to the good. మంచిపట్ల దయగా ఉండే వ్యక్తికి మానవాళి ఋణపడి ఉంది. (మంచిని ఎవ్వరో కాని గుర్తించరు, ఆ గుర్తింపు మరొకరికి ప్రేరణ నివ్వడం వల్లనే మంచి ఇంకా కొనసాగుతోంది) |
27. All things are cheap to the saving, dear to the wasteful. పొదుపరికి అన్ని వస్తువులూ చవుకే; దూబరికి అన్నీ ప్రియమే. |
28. All things are easy to the industry, all things difficult to a sloth. కష్టించే వాడికి అన్ని పనులూ సుళువు; సోమరికే అన్నీ కష్టం. |
29. All would live long, but none would be old. అందరికీ దీర్ఘాయుష్షు కావాలి ఉంటుంది; వృద్ధాప్యం అక్కరలేదు. |
30. A long life may not be good enough, but a good life is long enough. సుదీర్ఘమైన జీవితం సంతృప్తి నివ్వకపోవచ్చు; కానీ, సజావుగా సాగిన జీవితం, ఎంత చిన్నదైనా సంతృప్తినిస్తుంది. |
స్పందించండి