Poor Richard’s Almanac-1 Benjamin Franklin

A child thinks 20 shillings and 20 years can scarce ever be spent.

పసివాడు 20 షిల్లింగులూ, 20 సంవత్సరాలూ ఎన్నటికీ ఖర్చుపెట్టలే మనుకుంటాడు.  
A cold April, the barn will fill.

ఏప్రిల్ నెల చల్లగా ఉంటే, గాదెలు నిండుతాయి.
A Countryman between two lawyers, is like a fish between two cats.

ఇద్దరు వకీళ్ళమధ్య చిక్కిన గ్రామీణుడు రెండు పిల్లులమధ్య చిక్కిన చేప.
Act uprightly and despise calumny; dirt may stick to a mud wall, but not to a polished marble.

నిజాయితీగా నడుచుకుంటూ అపకీర్తికి వెరువు; మట్టి గోడకి మురికి  అంటుకుంటుంది గాని, మెరుగుపెట్టిన చలువరాతికి అంటదు.
A cypher and humility make the other figures and virtues of tenfold value.

సున్నా, వినయమూ ప్రక్కనున్న అంకెల, గుణాల విలువని పదిరెట్లు పెంచుతాయి.
A false friend and shadow attend only when the sun shines.

కపట స్నేహితుడూ, నీడా, సూర్యుడు(మన ప్రభ) వెలుగుతున్నప్పుడే వెంటనంటి ఉండేది.
A father is a treasure; a brother is a comfort; a friend is both.

తండ్రి ఒక సంపద; సోదరుడు ఒక సాంత్వన; స్నేహితుడు ఈ రెండూ.
A fat kitchen and a lean will.

వంటిల్లు నిండుగానూ, తినాలన్న కోరిక మితంగానూ ఉండాలి.
A fine genius in his own country is like a gold in the mine.

స్వదేశంలో ఉండిపోయిన మేధావి గనిలోని బంగారం వంటి వాడు. (విలువ ఎవరూ అంచనా కట్టలేరు / నిరుపయోగం) 
A flatterer never seems absurd: The flattered always takes his word.

భట్రాజు ఎన్నడూ తెలివితక్కువగా కనిపించడు: కారణం, పొగడ్తలు అందుకున్నవాడు అవి నిజమని నమ్ముతాడు. 

Courtesy: Poor Richard’s Almanac from Archive.org

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: