When it was Dark… Koduri Vijaya Kumar, Telugu, Indian Poet

That night…

When failure streamed down as a tear from lashes,

And, the contused body groaned in seething pain

Into that dark room entered Death taking storm for escort

And said:

“Look here, my friend! Your grief is as enduring as this rain

… there is nothing left in life…but grief!

Come! Embrace me!…

It is the balm that soothes your wounds.”

Breaking through the wounds, these words came out harshly:

“This soil has been bathed with their blood by martyrs!

I am a child of the land where even ploughs were turned to arms.

I am a fighter and love the fighting spirit in man

I can’t disgrace the sacrifices of my immortal lineage.  

A rolling of thunder was heard in the distance

And the doors opened all of a sudden.

Lo! There was neither storm… nor Death.

The room was flooded with effulgent radiance .

.

Koduri Vijaya Kumar

Telugu, Indian Poet

చీకటి గదిలో

.

ఓటమి కంటి చివరి చినుకై జారిన రాత్రి

దేహం గాయాల కూడలిగా మారి అలమటించిన రాత్రి

తలుపులు మూసి వున్న చీకటిగదిలో వర్షాన్ని వెంటేసుకు వొచ్చిన

మృత్యువు యిలా అంది:

 “… మిత్రుడా… యిటు చూడు! ఎడతెగని ఈ వర్షం నీ దుఃఖం!

… జీవితంలో దుఃఖం తప్ప మరేమీ లేదు.

రా! నన్ను ప్రేమించు…

నా కౌగిలి నీ గాయాలకు లేపనం!!”

దేహపు గాయాలను చీల్చుకుని, మాటలు కొన్ని యిలా కర్కశంగా వెలువడినాయి:

‘ వీరుల రక్తంతో తడిసిన మట్టి నా దేశం! నాగళ్ళు సైతం

ఆయుధాలుగా మారిన నేల, నా చిరునామా! మనుషుల

పోరాటాల్ని ప్రేమించే మనిషిని; మృత్యువును ప్రేమించలేను

అమరవీరుల త్యాగాలను అవమానించలేను ‘

బయటెక్కడో వురిమిన శబ్దం

గది తలుపులు తెరుచుకున్నాయి

వర్షమూ లేదు… మృత్యువూ లేదు

గదినిండా గొప్ప వెలుగు!

.

కోడూరి విజయ కుమార్

వార్త ఆదివారం 16 జూన్ 1997.

స్పందించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.