తన బలం ఏమిటో తనకే తెలియని తెలివిమాలిన
పశుప్రాయులు ప్రజలు, అందు వల్లనే వాళ్ళు రాయీ,
కట్టెలువంటి బరువులు మోస్తుంటారు; ఎంతమాత్రం బలంలేని
చిన్నపిల్లవాడి చెయ్యి ముకుతాడుతో, ములుగర్రతో నడపగలుగుతుంది.
ఒక్క తాపు తంతే చాలు, దాని బంధం తెగిపోతుంది,
కానీ ఎందుకో ఆ జంతువు భయపడుతుంది, అంతేకాదు
పిల్లాడు అడిగినవన్నీ చేస్తుంది; దాని భయకారణం దానికే తెలీదు;
నిష్కారణ భయాలతో తబ్బిబ్బై, అచేతనమైపోతుంది.
అంతకంటే చిత్రం, తన చేతులతో స్వయంగా గొంతు నొక్కుకుని,
రాజ్యాధిపతులు తన ఇంట్లోంచి కొల్లగొని, తనపై విసిరే
చిల్లరపైసలకు యుద్ధాలనీ, మృత్యువునీ తలకెత్తుకుంటుంది.
ఈ భూమ్యాకాశాల మధ్యనున్న సర్వస్వమూ తనదే అయినా,
ఆ విషయం తనకు తెలియదు; నిజం చెప్పొద్దూ, ఒకవేళ ఎవరైనా
ఎదురు తిరిగితే వాళ్ళని ఎంతమాత్రం కనికరం చూపక చంపుతుంది.
.
(అనువాదం: జాన్ ఏడింగ్టన్ సైమండ్స్)
తొమాసో కేంపనెల్లా
(5 September 1568 – 21 May 1639)
ఇటాలియన్ కవీ, తత్త్వవేత్త.
The People
.
The people is a beast of muddy brain
That knows not its own force, and therefore stands
Loaded with wood and stone; the powerless hands
Of mere a child guide it with bit and rein:
One kick would be enough to break the chain;
But the beast fears, and what the child demands
It does; nor its own terror understands,
Confused and stupefied by bugbears vain.
Most wonderful! With its own hands it ties
And gags itself- gives itself death and war
For pence doled out by kings from its own store.
Its own are all things between earth and heaven;
But this it knows not; and if one arise
To tell the truth, it kills him unforgiven.
.
(Tr: John Addington Symonds)
Tomasso Campanella
(5 September 1568 – 21 May 1639)
Italian Poet
https://archive.org/details/anthologyofworld0000vand/page/599/mode/1up
స్పందించండి